దినేశ్ కార్తీక్, ఆండ్రూ రస్సెల్ మధ్య విభేదాల్లేవ్.. ఉన్నది బ్రొమాన్స్: డేవిడ్ హస్సీ

దుబాయ్: కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్, ఆ జట్టు విధ్వంసకర ఆల్‌రౌండర్ ఆండ్రూ రస్సెల్ మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయని, అది జట్టును దెబ్బతీయవచ్చని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హగ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. గత సీజన్ ఐపీఎల్ సమయంలో ఈ ఇద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. జట్టు తీసుకున్న కొన్ని నిర్ణయాలను మీడియా సమావేశంలో రస్సెల్ ప్రశ్నించడంతో ఈ వార్తలకు బలం చేకూర్చింది.

అది బ్రొమాన్స్..
అయితే, ఈ వివాదంపై గతంలోనే దినేష్ కార్తిక్ మాట్లాడాడు. తామిద్దరం కలిసి ఈ విషయంపై చర్చించుకున్నామని, సమస్య పరిష్కారమైనట్లు పేర్కొన్నాడు. అయినా ఈ వార్తలకు ముగింపు పడలేదు. ఈ ఏడాది కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు డేవిడ్ హస్సీ ఈ వార్తలను కొట్టిపారేశాడు. దీనేశ్ కార్తీక్-రస్సెల్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చాడు. అది వారిద్దరి మధ్య బ్రొమాన్స్ అయ్యుంటుందని వ్యాఖ్యానించాడు.

ముక్కు సూటి మనిషి..
వారు ఎంతో సన్నిహతంగా ఉంటారని అది జట్టుకు బలం చేకూర్చే అంశమని స్పష్టం చేశాడు. ‘కార్తీక్ ముక్కుసూటి మనిషి. ఆటగాళ్లలోని అత్యుత్త ప్రతిభను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తాడు. అది సారథ్య లక్షణం. అతడు ఆటని ఎంతో ప్రేమిస్తాడు. ఆస్వాదిస్తాడు. జట్టు గెలుపు గురించే ఆలోచిస్తాడు' అని హస్సీ పేర్కొన్నాడు. అంతేకాకుండా ఇయాన్ మోర్గాన్, దినేశ్ కార్తీక్ కాంబినేషన్‌లో ఈ సీజన్ ఐపీఎల్‌లో కేకేఆర్ అద్భుత ఫలితాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.

మోర్గాన్, దినేశ్ కాంబినేషన్..
‘మోర్గాన్, దినేశ్ కార్తీక్‌తో కలిసి మిడిలార్డర్ బాధ్యతలను చేపట్టనున్నాడు. ఈ ఇద్దరు అద్భుత భాగస్వామ్యాలు కూడా నెలకొల్పుతారు. వికెట్ల వెనుకాల నుంచి దినేశ్.. ఫీల్డర్‌గా మోర్గాన్ వైస్ కెప్టెన్సీ హోదాలో బౌలర్లకు కావాల్సిన సూచనలు చేయనున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో వారికి అండగా నిలవనున్నారు.'అని తెలిపాడు. ఇక టూటైమ్ చాంపియన్స్ అయిన కేకేఆర్ మూడో టైటిలే లక్ష్యంగా ఈ సీజన్‌లో బరిలోకి దిగుతుంది.
ధోనీ, కోహ్లీ కెప్టెన్సీలో అదే పెద్ద తేడా.. ఆర్‌సీబీ వైఫ్యలానికి కారణమదే: గౌతమ్ గంభీర్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications