Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బ్రో.. పాకిస్థాన్ హిందువులకు మీ సాయం కావాలి: కనేరియా

Danish Kaneria appeals to Yuvraj and Harbhajan, Pakistani minorities need your help too

కరాచీ: కరోనా కకలావికలంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ హిందువులకు సాయం చేయాలని ఆదేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా భారత దిగ్గజ క్రికెటర్లు హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్‌లను కోరాడు. పాక్ మైనార్టీలకు అండగా వీడియోను రూపొందించాలని విజ్ఞప్తి చేశాడు.

ఆదుకోండి.. బ్రో..

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది తన ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సాయానికి ముగ్దులైన భజ్జీ, యూవీ ప్రత్యేక వీడియోను రూపొందించి సోషల్ మీడియా ద్వారా విరాళలు అందించాలని అభిమానులకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ హిందువులు, క్రైస్తవులకు అండగా నిలవాలని కనేరియా ఈ స్టార్ క్రికెటర్లను ట్విటర్ వేదికగా కోరాడు.

‘పాకిస్థాన్‌లోని మైనార్టీల కోసం వీడియో రూపొందించాలని యువరాజ్, హర్భజన్‌సింగ్‌లను కోరుతున్నా. కరోనాతో నెలకొన్న ఈ గడ్డు పరిస్థితుల్లో వారికి మీ సాయం అవసరం. ప్రజలు కూడా విరాళాలు అందించవచ్చు.'అని పాకిస్థాన్ మైనార్టీ ఫండ్ రైజింగ్ సంస్థ వివరాలను కనేరియా జత చేస్తూ ట్వీట్ చేశాడు.

మానవత్వమే గొప్ప..

మానవత్వమే గొప్ప..

ఇక షాహిద్ అఫ్రిది స్వచ్చంద సంస్థకు విరాళాలు ఇవ్వాలని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేసిన భజ్జీ, యూవీలపై ఓ వర్గం అభిమానులు తీవ్ర ట్రోలింగ్‌కు పాల్పడ్డారు. శతృదేశానికి విరాళలు ఇవ్వమంటారా? మతిపోయి మాట్లాడుతున్నారా? అని ఘాటుగా కామెంట్ చేశారు. ఈ ట్రోలింగ్‌కు అంతే స్థాయిలో బదులిచ్చిన యూవీ, భజ్జీ.. వీటన్నటికన్నా మానవత్వమే ముద్దని చెప్పారు. కులం, మతం వద్దని, కేవలం మానవత్వమే ముద్దని, ద్వేషం, వైరస్‌ను వ్యాపింపచేయకండా.. ప్రేమను మాత్రమే పంచాలని భజ్జీ ట్వీట్ చేయగా.. తాను ఎప్పటికీ భారతీయుడేనని, కష్టకాలంలో ఉంటే తనకు హానీ చేసిన వారికైన సహాయం చేస్తానని యువీ పేర్కొన్నాడు.

ఇప్పటికీ తానే వేగవంతమైన కీపర్ అని ధోనీ ఫీలింగ్.. రిటైర్మెంట్ విషయం ఎత్తితే..

ధన్యవాదాలు తెలిపిన అఫ్రిది

ధన్యవాదాలు తెలిపిన అఫ్రిది

ఇక యువరాజ్‌ సింగ్‌, హర్భజన్‌ సింగ్‌కు అఫ్రిది ధన్యవాదాలు తెలిపాడు. కరోనా వైరస్‌పై పాక్‌లో చేస్తున్న తన పోరాటానికి మద్దతు పలికినందుకు కృతజ్ఞతలు చెప్పాడు. ప్రేమ, శాంతికి సరిహద్దులు ఉండవని చాటిచెప్పారని కొనియాడాడు. ‘మద్దతు తెలిపిన నా బ్రదర్స్ యువరాజ్‌ సింగ్, హర్భజన్‌ సింగ్‌కు ధన్యవాదాలు. మీ మద్దతు నాకు ఎంతో విలువైనది. మన మధ్య ఉన్న ఈ బంధం మానవత్వం, ప్రేమ, శాంతికి సరిహద్దులు ఉండవని చాటిచెబుతోంది. యువరాజ్‌ ఫౌండేషన్‌ యూవీకెన్‌కు అభినందనలు'అని ట్వీట్‌ చేశాడు.

మామ అనిల్‌ దల్పాత్‌ తర్వాత

మామ అనిల్‌ దల్పాత్‌ తర్వాత

తన మామ అనిల్‌ దల్పాత్‌ తర్వాత పాకిస్థాన్ జట్టు తరపున ఆడిన రెండో హిందువుగా కనేరియా నిలిచాడు. 2000లో పాక్ తరుపున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్ర చేసిన కనేరియా.. 61 టెస్టులు, 18 వన్డేలు ఆడి 276 వికెట్లు తీశాడు. పాకిస్థాన్ క్రికెట్‌‌లో కనేరియా ఓ బెస్ట్ స్పిన్నర్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఎలాంటి కారణం లేకుండానే పీసీబీ కనేరియాను జట్టు నుంచి తప్పించింది. జట్టులో చోటు కోసం చాలా రోజులు నిరీక్షించిన కనేరియా.. అవకాశం దక్కకపోవడంతో కౌంటీ క్రికెట్‌లో ఎస్సెక్స్ తరఫున ఆడటం మొదలు పెట్టాడు. ఇక 2009లో డర్హామ్‌పై ఎసెక్స్ తరఫున ఆడుతున్నప్పుడు సహచర ప్లేయర్ మెర్విన్ వెస్ట్‌ఫీల్డ్‌తో కలిసి స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడు. వెస్ట్‌ఫీల్డ్‌ తనను ఓ వన్డే గేమ్‌లో 12 పరుగులు ఇవ్వాలని ఒప్పించాడని కనేరియా అంగీకరించాడు. దీంతో ఈ ఇద్దరిపై జీవిత కాల నిషేధం విధించారు.

ఈ విషయంలో పీసీబీ తనకు ఎలాంటి సహకారం అందించలేదని, దేశం కోసం ఎంతో చేసినా.. కనీసం ఆర్థికంగా కూడా ఆదుకోలేదని చాలా సందర్భాల్లో కనేరియా ఆవేదన వ్యక్తం చేశాడు.

Story first published: Friday, April 3, 2020, 15:48 [IST]
Other articles published on Apr 3, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+