For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తబ్లిగీ జమాత్‌పై వివాదాస్పద ట్వీట్.. ట్రెండింగ్‌లో స్టార్ రెజ్లర్ బబితా ఫోగాట్!!

Support or suspend? Babita Phogat trends on Twitter over controversial tweet

న్యూఢిల్లీ: దేశంలో కరోనా బాధితుల సంఖ్య పెరగడానికి తబ్లిగీ జమాత్ ప్రార్థనలే కారణమనే ఉద్దేశంతో భారత స్టార్ రెజ్లర్ బబితా కుమారి ఫోగాట్‌ చేసిన ట్వీట్‌ సోషల్ మీడియా వేదికగా తీవ్ర దుమారం రేపింది. ఈ స్టార్ రెజ్లర్ అభిప్రాయంపై కొందరూ అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరూ మద్దతు తెలుపుతున్నారు. రెండు వర్గాలుగా విడిపోయి ఈ ట్వీట్‌పై వాదించుకుంటున్నారు.

ట్విటర్ వార్.. యాష్‌ట్యాగ్స్ ట్రెండ్స్..

ట్విటర్ వార్.. యాష్‌ట్యాగ్స్ ట్రెండ్స్..

బబితా విద్వేశాన్ని రెచ్చగొడుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆమె ట్విటర్ అకౌంట్‌ను సస్పెండ్ చేయాలని ఓ వర్గం #SuspendBabitaPhogat అనే యాష్ ట్యాగ్‌ ట్రెండ్ చేయగా.. ఆమె చేసిన ట్వీట్‌లో తప్పేముందని, బబితా పేర్కొన్న వ్యాఖ్యలు అక్షరాల నిజమని మరో వర్గం #ISupportBabitaPhogat అనే యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తుంది. దీంతో సోషల్ మీడియా వేదికగా మాటల యుద్దం నడుస్తుంది.

ప్రధాన సమస్య కరోనా కాదు..

సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటూ దేశంలో జరిగే ప్రతిఘటనపై స్పందిస్తూ తన అభిప్రాయాలను నిక్కచ్చిగా పంచుకునే బబితా.. బుధవారం దేశంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌ను ఉద్దేశించి ట్వీట్ చేసింది. ప్రసత్త పరిస్థితుల్లో కరోనా వైరస్ దేశం ఎదుర్కొంటున్న రెండో సమస్యని, ‘జహిల్ జమాతీస్' ప్రధాన ప్రాబ్లమ్ అంటూ ట్వీట్ చేసింది.

ఆగ్రహంతో ట్రోలింగ్..

ఈ ట్వీట్ నచ్చని కొందరూ ఆమెపై తీవ్ర ట్రోలింగ్‌కు పాల్పడుతున్నారు. అసలు బబితా భారతీయురాలేనా? అని ఒకరు ప్రశ్నిస్తే.. ఆమె ప్రజల ప్రేమ, అభిమానం అందుకోవడానికి అర్హురాలు కాదని మరొకరు కామెంట్ చేస్తున్నారు. బబితా ట్వీటర్ అకౌంట్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ద్వేశానికి ఈ దేశంలో చోటులేదు బబితా.. అని ఇంకొందరు మండిపడుతున్నారు. ఇలాంటి వారు రోల్‌మోడల్స్ ఎలా అవుతారని కూడా ప్రశ్నిస్తున్నారు.

ప్రశంసలతో మద్దుతు..

ఇక మరికొందరూ ఆమె ముక్కుసూటితనాన్ని ప్రశంసిస్తున్నారు. ఉన్నది ఉన్నట్లు చెప్పిందని కొనియాడుతున్నారు. ఆమెకు తమ మద్దతు ఉంటుందని కామెంట్ చేస్తున్నారు. ఇక బబితాపై జరుగుతున్న ట్రోలింగ్‌ను సహచర రెజ్లర్లు బజరంగ్ పూనియా, యోగేశ్వర్ దత్ తిప్పికొట్టారు. వారి స్పూర్తిదాయకమైన ప్రదర్శనలతో దేశానికి సేవ చేశారు కాబట్టే వారి జీవితాలపై సినిమాలు తీశారని ట్రోలర్స్‌పై మండిపడ్డారు.

ఇక హర్యానా ఎన్నికల ముందు బీజేపీ తీర్థం పుచ్చుకున్న బబితా ఫోగాట్.. దాద్రి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలైన విషయం తెలిసిందే.

1023 కరోనావైరస్ పాజిటివ్ కేసులకు

ఇక దేశంలోని 17 రాష్ట్రాలలో నమోదైన 1023 కరోనావైరస్ పాజిటివ్ కేసులకు తబ్లిగీ జమాత్ సంస్థ జరిపిన ప్రార్థనలతో సంబంధాలు ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఈ కార్యక్రమానికి వచ్చిన విదేశీయుల ద్వారా వైరస్ మిగతా వారికి సోకిందని భావిస్తున్నారు.

Story first published: Friday, April 17, 2020, 15:26 [IST]
Other articles published on Apr 17, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+