
హేల్స్‌కు లక్షణాలు.. రద్దు
ఈ టోర్నీ తుది దశకు చేరుకోగానే ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం ఎక్కువ కావడంతో విదేశీ ఆటగాళ్లు లీగ్‌ను వదిలి పెట్టి సొంత దేశాలకు పయనమయ్యారు. అయితే ఇలా ఇంగ్లండ్‌కు వెళ్లిన అలెక్స్ హేల్స్ కరోనా లక్షణాలతో బాధపడుతుండటంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అప్రమత్తమైంది. వెంటనే తుది దశకు చేరిన టోర్నీని అర్ధాంతరంగా రద్దు చేసింది.

నెగటివ్ వస్తేనే...
ముందు జాగ్రత్తగా టోర్నీలో ప్లే ఆఫ్ చేరిన టీమ్స్‌లోని ప్రతీ ఒక్కరికి పరీక్షలు నిర్వహించింది. విదేశీ ఆటగాళ్లకు నెగటివ్ అని తేలితేనే ప్రయాణానికి అనుమతిచ్చింది. పరీక్షలకి పంపిన శాంపిల్స్ రిపోర్ట్ రావడం ఆలస్యం కావడంతో అప్పటి వరకూ క్రికెటర్లని హోటల్ గదులకే పరిమితం చేసింది.

మళ్లీ పాక్‌లో ఆడుతానా?
ఆ సమయంలో తన పరిస్థితి గురించి డెల్ స్టెయిన్ క్రిక్‌ఇన్‌ఫోకు తెలిపాడు. ‘ఆటగాళ్లందరం హోటల్ నిర్భంధంలో ఉండిపోయాం. హోటల్ దాటి వీధుల్లోకి రాకూడదని మాకు ఆదేశాలు ఇచ్చారు. వ్యక్తిగతంగా కూడా ఈ నిబంధనల్ని అతిక్రమించాలనిపించలేదు.. ఒకవేళ నేను ఏదైనా పిచ్చి పని చేసినా.. ఆ తర్వాత మళ్లీ పాకిస్థాన్‌లో క్రికెట్ ఆడలేననే విషయం తెలుసు' అని చెప్పుకొచ్చాడు.
సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన వార్నర్ మేనేజర్

టీ20 ప్రపంచం కోసం..
ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది అక్టోబరులో జరిగే టీ20 ప్రపంచకప్‌లో ఆడాలని ఆశిస్తున్న డేల్ స్టెయిన్.. ఇప్పటికే సంప్రదాయక ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పాడు. కానీ.. సఫారీ సెలక్టర్లు మాత్రం ఈ పేసర్‌కు టీ20 జట్టులో చోటివ్వడం లేదు.ఈ నేపథ్యంలో..ప్రపంచవ్యాప్తంగా జరిగే టీ20 లీగ్‌లు ఆడటం ద్వారా తన ఫామ్ నిరూపించుకోవాలని ఈ స్టార్ పేసర్ ఉవ్విళ్లూరుతున్నాడు.
ఐపీఎల్ 2020 సీజన్‌లోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఈ ఫాస్ట్ బౌలర్ ఆడాల్సి ఉంది. కానీ.. కరోనా వైరస్ కారణంగా ఇప్పుడు ఐపీఎల్ జరగడంపై సందేహాలు నెలకొన్నాయి. ప్రస్తుతానికి ఎప్రిల్ 15కు వాయిదా పడినా.. భారత్‌లోని ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఈ మెగా లీగ్ జరగడం డౌట్‌గానే మారింది.


Click it and Unblock the Notifications












