ఆ సూపర్ ఓవరే నా ఆలోచనను మార్చింది.. నేను చెలరేగేలా చేసింది: విరాట్ కోహ్లీ

దుబాయ్: ముంబై ఇండియన్స్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా వేసిన సూపర్ ఓవరే తన ఆలోచన విధానాన్ని మార్చిందని, ఒత్తిడిలో నుంచి బయటకు వచ్చేలా చేసిందని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 37 పరుగుల తేడాతో ఘన విజయాన్నందుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 52 బంతుల్లో 90 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. బౌలర్ల అడ్డగా మారిన పిచ్‌పై తనదైన బ్యాటింగ్‌తో తడాఖ చూపించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
అయితే ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన కోహ్లీ.. టోర్నీ ప్రారంభంలో వరుసగా విఫలమవ్వడంతో తీవ్ర ఒత్తిడికి లోనయ్యానన్నాడు. బుమ్రా వేసిన సూపర్ ఓవర్‌లో తాను కొట్టిన బౌండరీతో ఆత్మవిశ్వాసం పెరిగిందని చెప్పుకొచ్చాడు. ఇక సమష్టి ప్రదర్శనతో చెన్నైపై విజయం సాధించామని, తమ బౌలర్లు అద్భుతంగా రాణించారన్నాడు.

అదే ఈ రోజు నేర్చుకున్నాం..
‘ఈ మ్యాచ్ మా సమష్టి ప్రదర్శనల్లో ఒకటి. తొలుత బ్యాటింగ్ చేయాలనుకున్నా. కానీ ఊహించని విధంగా క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయి. స్ట్రాటజిక్ టైమ్ ఔట్‌లో 150 పరుగులు చేస్తే గొప్పని చర్చించుకున్నాం. బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్‌లతో గెలుపు మూమెంట్ అందుకోవడం తప్పనిసరిని భావించం. అనుకున్న లక్ష్యం కోసం ప్రయత్నించినప్పుడు కొంత రివార్డు(169 రన్స్) కూడా లభిస్తుంది. డెత్ ఓవర్స్ వరకు ఉంటే బంతిని సులువుగా హిట్ చేయవచ్చని మేం ఈ రోజు నేర్చుకున్నాం.

నా ఇన్నింగ్స్ క్రెడిట్ ఆ ఓవర్ దే..
టోర్నీ ఆరంభంలో నాపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. మనిషిపై భారం ఉన్నప్పుడు రాణించలేం. అలాగే జట్టు ఒత్తిడిలో ఉన్నా ఫలితాలు రాబట్టలేం. ఆ సూపర్ ఓవర్ నా ఆలోచన విధానాన్ని మార్చింది. ఆ ఓవర్‌లో నేను ఆడకపోతే జట్టు ఓడిపోతుంది. జట్టు విజయం కోసం నేను ఆడాను. మూమెంటమ్‌ను అందుకున్నాను. క్రిస్ మొర్రిస్ ఆలస్యంగా వచ్చినా అద్భుత ప్రదర్శన కనబర్చాడు. అతనితో పాటు గుర్‌క్రీత్ జట్టులోకి రావడంతో జట్టులో సమతూకం వచ్చింది. ఇది పూర్తిగా సమష్టి ప్రదర్శన. మైదానంలోకి అడుగుపెట్టిన తొలి ఓవర్ నుంచే.. మంచి ఆరంభం అందుకుంటే.. మూమెంటమ్ వస్తుంది. అప్పుడు టోర్నీలో ముందుకు వెళ్లవచ్చని ఆలోచనతో ఉన్నాం'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

ముంబైతో ‘సూపర్'విక్టరీ..
ముంబై ఇండియన్స్ జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ సూపర్ ఓవర్‌లో విజయాన్నందుకున్న విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 201 రన్స్ చేయగా.. ముంబై కూడా నిర్ణీత ఓవర్లలో అంతే స్కోర్ చేయడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది. సూపర్ ఓవర్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన ఆర్‌సీబీ పేసర్ నవ్‌దీప్ సైనీ ప్రత్యర్థి కట్టడి చేస్తూ ఏడు పరుగులే ఇచ్చాడు. అనంతరం బుమ్రా బంతిని అందుకోగా విరాట్, డివిలియర్స్ చెరొక బౌండరీ కొట్టి విజయాన్నందించారు. ఆఖరి బంతికి సింగిల్ తీయాల్సిన క్రమంలో కోహ్లీ బౌండరీ కొట్టాడు. ఈ సీజన్‌లో ఇదే అతనికి తొలి బౌండరీ. ఆ తర్వాత రాజస్థాన్‌తో జరిగి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసి టచ్‌లోకి వచ్చి కోహ్లీ అదే ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.

చెన్నైకి చేతకాలేదు..
చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్లకు 169 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' కోహ్లి (52 బంతుల్లో 90 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆఖర్లో చెలరేగాడు. దేవ్‌దత్ పడిక్కల్ (34 బంతుల్లో 33; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. తర్వాత చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులే చేయగల్గింది. రాయుడు (40 బంతుల్లో 42; 4 ఫోర్లు), ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన జగదీశన్ (28 బంతుల్లో 33; 4 ఫోర్లు) రాణించారు. మోరిస్ 3, వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు తీశారు.
ధోనీ గుండు చేసుకున్నా ఓటమి తప్పలేదు.. చెన్నై ఓటమిపై పేలుతున్న జోక్స్, మీమ్స్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications