
ధోనీ రివ్యూ సిస్టమ్..
దాంతో.. అతన్ని కట్టడి చేసేందుకు దీపక్ చాహర్‌తో స్టంప్ టు స్టంప్ బౌలింగ్ చేయించిన ధోనీ.. ఫలితం రాబట్టాడు. చాహర్ విసిరిన బంతిని లెగ్ సైడ్ ఆడేందుకు ఆఫ్ స్టంప్ లైన్‌పైకి వెళ్లాడు. బంతిని అంచనా వేయడంలో విఫలమైన డికాక్.. వికెట్ల ముందు ఎల్బీడబ్ల్యూగా దొరికిపోయాడు. కానీ.. ఫీల్డ్ అంపైర్ ఔటివ్వలేదు. కానీ ధోనీ మాత్రం వెంటనే రివ్యూ తీసుకున్నాడు. దాంతో టీవీల ముందు ప్రేక్షకులతో పాటు అందరూ పక్కా ఔటేనని భావించారు. అంపైర్ వెన్నులో వరణుకు పుట్టింది. అనుకున్నట్లుగానే రీప్లేలో బంతి స్పష్టంగా వికెట్లను తాకింది. దాంతో ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. ఇక ధోనీ మార్క్ కెప్టెన్సీకి బలైన డికాక్ నిరాశగా పెవిలియన్ చేరాడు.

మహేంద్రుడి మాయాజాలం..
ఆ తర్వాత 13 ఓవర్ల ముగిసే సరికి ముంబై 4 వికెట్లకు 87 రన్స్ చేసింది. క్రీజులో హాఫ్ సెంచరీ హీరో సౌరభ్ తివారి(40 బంతుల్లో 50 నాటౌట్)తో పాటు కీరన్ పొలార్డ్ ఉన్నాడు. ముంబై ఇంకా 42 బంతుల్లో 70 పరుగులు చేయాలి. క్రీజులో విధ్వంసకర పొలార్డ్ ఉండటంతో ముంబై విజయం లాంఛనమేనని అంతా భావించారు. పైగా ఫస్టాఫ్‌లో ఇదే పొలార్డ్ ఒంటి చేత్తో చెన్నై ఓడించాడు. ఈ చేధు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకున్న ధోనీ.. వ్యూహాత్మకంగా జోష్ హజెల్ వుడ్‌ను రంగంలోకి దింపాడు. అప్పటికే రెండు ఓవర్లు వేసిన హజెల్‌వుడ్.. 26 పరుగులిచ్చాడు. కానీ అతనికే మళ్లీ ధోనీ బంతినివ్వడం విశేషం. వికెట్ల ముందు కాస్త నిదానంగా కదులుతున్న పొలార్డ్‌ను వేగవంతమైన డెలివరీతో.. ఎల్బీడబ్ల్యూగా హజెల్‌వుడ్ ఔట్ చేశాడు. పొలార్డ్ రివ్యూ తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది.
CSK vs MI మ్యాచ్ టర్నింగ్ పాయింట్.. ముంబై ఇండియన్స్ కొంప ముంచిన మూడు తప్పిదాలు!
చెన్నై చమక్..
ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు సాధించింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' రుతురాజ్ గైక్వాడ్ (58 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 88 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీకి తోడుగా రవీంద్ర జడేజా (33 బంతుల్లో 26; 1 ఫోర్), డ్వేన్ బ్రావో (8 బంతుల్లో 23; 3 సిక్స్‌లు) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడారు. ముంబై బౌలర్లలో ఆడమ్ మిల్నే, బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ తలా రెండేసి వికెట్లు తీశారు. ఛేజింగ్‌లో ముంబై 20 ఓవర్లలో 8 వికెట్లకు 136 పరుగులు చేసి ఓడింది. సౌరభ్ తివారీ (40 బంతుల్లో 50 నాటౌట్; 5 ఫోర్లు) మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. చెన్నై బౌలర్లు బ్రావో (3/25), దీపక్ చహర్ (2/19) ప్రత్యర్థిని దెబ్బ తీశారు. మోకాలి గాయంతో ముంబై రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌కు దూరంకాగా. పొలార్డ్ తాత్కాలిక సారథిగా వ్యవహరించాడు.


Click it and Unblock the Notifications












