For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CSK vs DC ప్రివ్యూ: ధోనీ vs అయ్యర్.. గెలిచేది అనుభవమా.. యువతరమా?

 CSK vs DC Preview: Who will win Chennai Super Kings vs Delhi Capitals
IPL 2020 : CSK vs DC Preview | Experience Vs Young Talent | Pitch Report || Oneindia Telugu

దుబాయ్: ఒక విజయం, ఒక ఓటమితో ఐపీఎల్‌ 2020 సీజన్‌ను మొదలుపెట్టిన చెన్నై సూపర్‌కింగ్స్ మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో దుబాయ్ వేదికగా ప్రారంభమయ్యే లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఎదుర్కోనుంది. అనుభవపూర్వకమైన ఆటగాళ్లతో సీఎస్‌కే.. యువ రక్తంతో ఉన్న ఢిల్లీ అమీతుమీ తేల్చుకోనున్నాయి. కింగ్స్ పంజాబ్‌తో ఓడే మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌తో విజయాన్నందుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. అదే ఉత్సాహాన్ని కొనసాగించాలని భావిస్తుంది. మరోవైపు తమకంటే తక్కువ స్థాయి టీమ్.. రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడి షాక్‌కు గురైన సీఎస్‌కే‌ ఢిల్లీని ఓడించి మళ్లీ విజయాలబాట పట్టాలని ఉవ్విళ్లూరుతోంది.

ఫలితం ఎలా ఉన్నా.. భీకరమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ఈ రెండు జట్ల మధ్య జరిగే పోరు మాత్రం అభిమానులకు మంచి కిక్ ఇవ్వనుంది. పేపర్‌పై ఇరు జట్లు సమతూకంగా ఉన్నప్పటికీ అనుభవం ప్రకారం సీఎస్‌కే హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది. ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటి వరకు 21 సార్లు తలపడగా 15-6తో చెన్నై లీడ్‌లో ఉంది. ఇదే ఆధిపత్యాన్ని కొనసాగించాలని ధోనీసేన భావిస్తోంది. . మరీ గెలిచేది అనుభవమా..? యువతరమా? ఏ జట్టును విజయం వరిస్తుందో..? చూడాలి!

ధోనీపైనే అందరి చూపు..

ధోనీపైనే అందరి చూపు..

గత మ్యాచ్ ఓటమితో సీఎస్‌కేకు గెలుపు అనివార్యంగా మారింది. అలాగే ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌పై కూడా ఆసక్తినెలకొంది. ఎందుకంటే షార్జాలో బ్యాటింగ్ పిచ్‌పై మహీ లోయర్ ఆర్డర్‌లో రావడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. కాబట్టి ఈ మ్యాచ్‌లో కెప్టెన్.. లైనప్‌లో కచ్చితంగా ప్రమోట్ అవుతాడని అందరూ భావిస్తున్నారు.

ఇక మురళీ విజయ్, కేదార్ జాదవ్‌తో పాటు షేన్ వాట్సన్ పూర్ షో.. చెన్నైకి ప్రతి కూలంగా మారింది. బ్యాటింగ్ భారాన్ని మొత్తం డుప్లెసిస్ ఒక్కడే మోస్తున్నాడు. సామ్ కరణ్ ఆకట్టుకుంటున్నా.. ఎక్కువసేపు వికెట్ కాపాడుకోవడం లేదు. రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా గాడిలో పడటం చాలా అవసరం.

గాయం నుంచి రాయుడు కోలుకోకపోవడం, బ్రావో పరిస్థితి ఏంటో తెలియకపోవడం ఫ్యాన్స్‌ను కలవరపెడుతున్నది. బౌలింగ్‌లో స్పిన్నర్లు పీయూష్ చావ్లా, జడేజా వైఫల్యం కొనసాగితే సీఎస్‌కే‌కు కష్టాలు తప్పవు. ఫస్ట్ మ్యాచ్‌లో రాణించిన లుంగిడి ఎండిడి రెండో మ్యాచ్‌లో తేలిపోయాడు. తుది జట్టులో మార్పు ఉండకపోవచ్చు. కానీ ఇమ్రాన్ తాహీర్‌ను ఆడించాలనుకుంటే లుంగి ఎంగిడి బెంచ్‌కు పరిమితం కావచ్చు. అలాగే కరణ్ శర్మ స్థానంలో శార్ధుల్ ఠాకుర్ తుది జట్టులోకి రావచ్చు.

పంత్, అయ్యర్ మెరిస్తే..

పంత్, అయ్యర్ మెరిస్తే..

మరోవైపు తొలి మ్యాచ్‌లో సూపర్ షో చూపెట్టిన ఢిల్లీ పూర్తి ఆత్మ విశ్వాసంతో ఉంది. గత మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్, పేసర్ కగిసో రబడా అద్భుత ఆటతీరు కనబర్చారు. టాపార్డర్‌లో శిఖర్ ధావన్, పృథ్వీషా రాణించాలి. పంత్, అయ్యర్ మంచి టచ్‌లో ఉన్నారు. ఈ నలుగురు ఆటగాళ్లు ఏ ఇద్దరు చెలరేగినా.. వీరికి స్టోయినిస్‌ తోడైతే ఢిల్లీ బ్యాటింగ్‌కు తిరుగుండదు. బ్యాటింగ్‌లో హెట్‌మయర్‌కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని కోచ్ పాంటింగ్ భావిస్తున్నాడు.

ఇక భుజ గాయంతో బాధపడుతున్న రవిచంద్రన్ అశ్విన్ గైర్హాజరైతే అమిత్ మిశ్రాకు అవకాశం దక్కవచ్చు. మోహిత్ శర్మ ప్రదర్శనపై కూడా అసంతృప్తిగా ఉన్న మేనేజ్‌మెంట్ ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది. లాస్ట్ 10 ఓవర్స్‌లో సీఎస్‌కేను కట్టడి చేయాలంటే హర్షల్ పటేల్‌ను తీసుకోవడం మరో అవకాశం. లోయర్ ఆర్డర్‌లో మంచి బ్యాట్స్‌మన్‌గా కూడా పనికొస్తాడు. మరోసారి రబడా రఫ్ఫాడిస్తే ఢిల్లీ బౌలింగ్‌కు డోకా ఉండదు.

తుది జట్లు(అంచనా):

తుది జట్లు(అంచనా):

చెన్నై సూపర్ కింగ్స్: షేన్ వాట్సన్, ఫాఫ్ డూప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్, సామ్ కరన్, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ(కెప్టెన్, కీపర్), దీపక్ చాహర్, షార్దుల్ టాకుర్/కరన్ శర్మ, పియూష్ చావ్లా, లుంగి ఎంగిడి/ ఇమ్రాన్ తాహిర్

ఢిల్లీ క్యాపిటల్స్: ఢిల్లీ క్యాపిటల్స్, పృథ్వీ షా, శిఖర్ ధావన్, షిమ్రాన్ హెట్‌మైర్, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), రిషభ్ పంత్, మార్కస్ స్టోయినిస్, అక్సర్ పటేల్, అశ్విన్/అమిత్ మిశ్రా, అన్రిచ్ నోర్జ్, మోహిత్ శర్మ

పిచ్ రిపోర్టు:

పిచ్ రిపోర్టు:

స్పిన్‌కు అనుకూలం. డ్యూ ప్రభావం ఉంటుంది. ఈ కారణంగానే గత 6 మ్యాచ్‌ల్లో టాస్ గెలిచిన కెప్టెన్లు ఫీల్డింగ్ ఎంచుకున్నారు. ఈ మ్యాచ్‌లో కూడా ఇందులో ఏ మార్పు ఉండకపోవచ్చు. ఓపికగా క్రీజులో కుదురుకుంటే భారీ స్కోర్స్ చేయవచ్చు. గత రెండు మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ అలానే సక్సెస్ అయ్యారు. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా.. స్టార్ స్పోర్ట్స్ చానెల్స్‌, డిస్నీ హాట్‌స్టార్‌‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

ప్లీజ్ డోన్ట్ సిట్ హియర్: పోయి పోయి అక్కడే కూర్చున్న సొట్ట బుగ్గల సుందరి: ఆ తరువాత ఏమైంది?

Story first published: Friday, September 25, 2020, 15:04 [IST]
Other articles published on Sep 25, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+