అతను లేకనే ఓటమి పాలయ్యాం: ధోనీ

దుబాయ్: హైదరాబాద్ స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు లేకపోవడంతోనే గత రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలయ్యామని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తెలిపాడు. అతడు గైర్హాజరీ కారణంగా జట్టు సమతూకం దెబ్బతిన్నదని అభిప్రాయపడ్డాడు. తదుపరి మ్యాచ్‌కు రాయుడు అందుబాటులోకి వస్తే అంతా సర్దుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 44 రన్స్ తేడాతో ఓడిన విషయం తెలిసిందే. ఢిల్లీ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో చెన్నై బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. ఇక తమ వైఫల్యంపై మ్యాచ్ అనంతరం ధోనీ మాట్లాడాడు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఓటమిపాలయ్యామన్నాడు. తాము కమ్‌బ్యాక్ చేయాల్సిన పరిస్థితి అనివార్యమైందని, ఆటగాళ్లంతా మెరుగవ్వాలన్నాడు.

రాయుడు వస్తే..
'అంబటి రాయుడు లేకపోవడంతో చివరి రెండు మ్యాచుల్లో ఓడిపోయాం. బ్యాటింగ్ ఆర్డర్ బ్యాలెన్స్ తప్పింది. ఇది మాకు మంచి మ్యాచ్ అనుకోవడం లేదు. డ్యూ ప్రభావం లేనప్పటికీ వికెట్ నెమ్మదించింది. బ్యాటింగ్ విభాగంలో కసి తగ్గడం మమ్మల్ని బాధిస్తోంది. దూకుడైన ఆరంభం లేకపోవడంతో రన్‌రేట్‌తో పాటు ఒత్తిడి పెరుగుతోంది. స్పష్టమైన లక్ష్యం, కూర్పుతో మేం బరిలోకి దిగాలి. తర్వాతి మ్యాచ్‌లో రాయుడు వస్తే జట్టు సమతూకం మెరుగవ్వొచ్చు. అలా జరిగితే ఒక అదనపు బౌలర్‌తో ప్రయోగాలు చేసేందుకూ వీలుంటుంది. మేం పుంజుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టంగా తెలుస్తోంది.

స్పిన్నర్లు మెరుగవ్వాలి..
బౌలర్లు కూడా మెరుగువ్వాలి. గుడ్ లెంగ్త్స్, లైన్స్, పేస్‌తో బౌలింగ్ చేయాలి. స్పిన్నర్లు ఇంకా తమ పూర్వవైభవాన్ని అందుకోలేదు. మేం మంచి బంతులు వేసాం. అలాగే తరుచూ బౌండరీ వెళ్లే బంతులు సంధించాం.'అని ధోనీ అన్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి మ్యాచులో 48 బంతుల్లో 71 పరుగులతో అదరగొట్టిన రాయుడు తొడ కండరాలు పట్టేయడంతో గత రెండు మ్యాచ్‌లకు దూరమైన విషయం తెలిసిందే.

మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' పృథ్వీ షా
దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' పృథ్వీ షా (43 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌తో 64 ) అర్ధ సెంచరీ సాధించాడు. రిషభ్ పంత్ (25 బంతుల్లో 5 ఫోర్లతో 37 నాటౌట్ ), శిఖర్ ధావన్ (27 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 35) రాణించారు. అనంతరం చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 131 పరుగులు చేసింది. డుప్లెసిస్ (35 బంతుల్లో 4 ఫోర్లు 43) టాప్ స్కోరర్‌గా నిలవగా... రబడా 3 వికెట్లు పడగొట్టాడు.
CSK vs DC: మూడు వ్యూహాత్మక తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్న చెన్నై సూపర్ కింగ్స్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications