
ధోనీ మళ్లీ ఛేజింగ్‌కు మొగ్గు చూపడం
ఇక రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనే చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ బలహీనతలు బయటపడ్డాయి. 217 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఆ జట్టు విఫలమైంది. డూప్లెసిస్ ధాటిగా ఆడటంతో 200 పరుగులు చేసింది. అలాంటి పరిస్థితుల్లో ఢిల్లీతో మ్యాచ్‌లో టాస్ గెలిచి మళ్లీ చేజింగ్‌కు మొగ్గు చూపడం వ్యూహత్మకంగా ధోనీ చేసిన ఘోర తప్పిదం. డ్యూ ప్రభావం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నానని ధోనీ స్పష్టం చేశాడు. ఇప్పటి వరకు టాస్ గెలిచిన అన్ని జట్లు ఫీల్డింగే ఎంచుకున్నాయి. డ్యూ ప్రభావం కారణంగానే ఫీల్డింగ్ తీసుకుంటున్నామని ప్రతీ కెప్టెన్ చెప్పాడు. కానీ భారీ లక్ష్యాలను చేధించే క్రమంలో ప్రతీ జట్టు విఫలమైంది. డ్యూ ప్రభావం గుర్తించిన ధోనీతో సహా ఇతర కెప్టెన్లు.. ఛేజింగ్‌లో బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి ఉంటుందనే లాజిక్ ఎలా మిస్సాయ్యరనే ప్రశ్న తలెత్తుంది. ఫస్ట్ మ్యాచ్‌లో సీఎస్‌కే ఛేజింగ్‌లో గెలవగా.. అన్ని జట్లు ఓటమిపాలయ్యాయి. ఇక రైనా, రాయుడు లేక బ్యాటింగ్ బలహీనంగా ఉన్న పరిస్థితుల్లో ధోనీ ఛేజింగ్‌కు మొగ్గు చూపడం ఆ జట్టు ఓటమికి ప్రధాన కారణమైంది.

తేలిపోయిన స్పిన్నర్లు..
ఇక చెన్నై స్పిన్నర్లు మళ్లీ తేలిపోవడం ఆ జట్టు ఓటమికి ప్రధాన కారణం. రవీంద్ర జడేజా, పియూష్ చావ్లా గత రెండు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యారు. దారళంగా పరుగులు సమర్పించుకున్నారు. పదేపదే లైన్ మిస్సవుతూ షార్ట్ బంతులు వేస్తూ మూల్యం చెల్లించుకున్నారు. చావ్లా పృథ్వీ షా, శిఖర్ ధావన్‌లను ఔట్ చేసి బ్రేక్ ఇచ్చినా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇతర జట్ల స్పిన్నర్లు అమిత్ మిశ్రా, చాహల్, ఎక్స్‌ట్రా టర్న్ రాబడుతూ బ్యాట్స్‌మెన్ కట్టడి చేస్తున్నారు. ఆఖరికి అక్సర్ పటేల్ కూడా అద్భతంగా బౌలింగ్ చేశాడు. వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు అయిన జడేజా, చావ్లా విఫలమవ్వడం అభిమానులను విస్మయపరుస్తుంది. సరైన హోమ్ వర్క్ చేయడం లేదనే భావన కలుగుతోంది. తదుపరి మ్యాచ్‌కైనా వీరు గాడిలో పడాలి లేకుంటే సీఎస్‌కేకు కష్టాలు తప్పవు.

బ్యాటింగ్ ఆర్డర్ గందరగోళం..
రైనా దూరమవడం.. రాయుడు గాయపడటంతో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ఆర్డర్ గందరగోళంగా తయారైంది. బలమైన బ్యాటింగ్ ఆర్డర్‌తోనే ఇన్నాళ్లు విజయం సాధించిన సీఎస్‌కే ఇప్పుడు అదే బలహీనతతో మూల్యం చెల్లించుకుంటుంది. డ్వేన్ బ్రావో గాయం కూడా ఆ జట్టును ఇబ్బందుల్లోకి నెట్టింది. ఓపెనర్ల వైఫల్యం ప్రధాన సమస్యగా మారింది. మురళీ విజయ్, షేన్ వాట్సన్ గత మూడు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యారు. రాయుడు స్థానంలో జట్టులోకి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ సత్తాచాటలేకపోయాడు. సామ్ కరన్ మెరుపులు మెరిపిస్తున్నా.. క్రీజులో నిలబడలేకపోతున్నాడు. డూప్లెసిస్ మంచి ఫామ్‌లో ఉన్నా అతనికి తోడుగా మరే బ్యాట్స్‌మెన్ నిలబడలేకపోతున్నాడు. ధోనీ, జాదవ్, జడేజా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలేదు. తదుపరి మ్యాచ్‌కు రాయుడు తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. మురళీ విజయ్, జాదవ్‌లకు బదులుగా చెన్నై ప్రత్యామ్నాయాలపై దృష్టిసారించాలి. మిడిలార్డర్ లోపాలను సరిదిద్దుకోవాలి. లేకుంటే చెన్నై భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

రాణించిన షా, పంత్
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' పృథ్వీ షా (43 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌తో 64 ) అర్ధ సెంచరీ సాధించాడు. రిషభ్ పంత్ (25 బంతుల్లో 5 ఫోర్లతో 37 నాటౌట్ ), శిఖర్ ధావన్ (27 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 35) రాణించారు. అనంతరం చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 131 పరుగులు చేసింది. డుప్లెసిస్ (35 బంతుల్లో 4 ఫోర్లు 43) టాప్ స్కోరర్‌గా నిలవగా... రబడా 3 వికెట్లు పడగొట్టాడు.


Click it and Unblock the Notifications












