
నాకు కొంచెం ప్రైవసీ కావాలి..
‘ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నాననే నా నిర్ణయాన్ని సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌కు తెలియజేశాను. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నా. ఈ విపత్కర కాలంలో నాకు కొంచెం బ్రేక్ కావాలనుకుంటున్నా. నా నిర్ణయాన్ని అర్ధం చేసుకుంటారని భావిస్తున్నా. అదే విధంగా నాకు కావాల్సిన ప్రైవసీ కూడా ఇస్తారని ఆశిస్తున్నా.'అని భజ్జీ పీటీఐ వార్తా సంస్థకు తెలియజేశాడు. ఇక ఈ సీజన్‌లో భజ్జీని చెన్నై రూ.2 కోట్లకు రిటైన్ చేసుకుంది.

థ్యాంక్స్‌తో సరిపెట్టలేను..
ఇక తన నిర్ణయానికి సీఎస్‌కే మేనేజ్‌మెంట్ అండగా నిలిచిందన్నాడు. ‘నా ఈ నిర్ణయాన్ని సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌కు చెప్పగానే వారు నాకు అండగా నిలిచారు. వారికి కేవలం థ్యాంక్స్‌తో సరిపెట్టలేను. కరోనా విపత్కర కాలంలో నా ఫ్యామిలీని వదిలి వెళ్లడం నాకు కష్టంగా అనిపించింది. నా కుంటుంబమే ముఖ్యం అనిపించింది. కానీ నా మనసంతా దుబాయ్‌లోనే ఉంది. ఈ సీజన్‌లో సీఎస్‌కే అద్భుత ప్రదర్శన కనబరుస్తుంది'అని భజ్జీ పేర్కొన్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే మోస్ట్ సక్సెఫుల్ బౌలర్ అయిన హర్భజన్.. 150 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నారు. లసిత్ మలింగా(170), అమిత్ మిశ్రా(157) భజ్జీ కన్నా ముందున్నారు.

ఇక భజ్జీ రాడు..
ఇక భజ్జీ తప్పుకున్నాడని చెన్నై సూపర్ కింగ్స్ కూడా ప్రకటించింది. ‘వ్యక్తిగత కారణాలతో అందుబాటులో ఉండటం లేదని హర్భజన్ సింగ్ సమాచారం ఇచ్చాడు. ఈ విపత్కర కాలంలో కుటుంబానికి అండగా ఉండాలనే అతని నిర్ణయానికి సీఎస్‌కే మద్దతు తెలుపడంతో పాటు గౌరవిస్తుంది.'అని సీఈవో కాశీ విశ్వనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. వ్యక్తిగత కారణాలతో సురేశ్ రైనా తప్పుకోవడం.. చెన్నై ఆటగాళ్లు దీపక్ చాహర్, రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు 11 మంది సహాయక సిబ్బంది కరోనా బారిన పడటంతో.. మూడు రోజుల క్రితం భజ్జీ తప్పుకుంటున్నాడనే వార్తలు వచ్చాయి.
ప్రస్తుతం భారత్‌లో ఉన్న హర్భజన్ తన తల్లి అనారోగ్యం కారణంగా జట్టుతో దుబాయ్‌కు వెళ్లలేదు. చెన్నై వేదికగా నిర్వహించిన ప్రాక్టీస్ క్యాంప్‌లో కూడా పాల్గొనలేదు. అయితే జట్టు ప్రణాళిక ప్రకారం అతను గత మంగళవారం(సెప్టెంబర్ 1) యూఏఈలో అడుగుపెట్టాల్సింది. కానీ ఓ వైపు కరోనా భయం, మరోవైపు తల్లి అనారోగ్యం కారణంగా అతను తప్పుకున్నాడు.

హర్భజన్ లేకపోవడం..
ఇక భజ్జీ గైర్హాజరీతో సీఎస్‌కేకు నష్టమే జరగనుంది. నెమ్మదైన పిచ్‌లు గల దుబాయ్ మైదానాల్లో స్పిన్నర్లు కీలకం కానున్నారు. అలాంటి పరిస్థితుల్లో హర్భజన్ సింగ్ వంటి సీనియర్ స్పిన్నర్లు జట్టులో ఉండటం అటు జట్టుకు.. ఇటు యువ ఆటగాళ్లకు మంచిదని టీమ్‌మేనజ్‌మెంట్ భావించింది. అయితే హర్భజన్ దూరమైనా... పియూష్ చావ్లా, మిచెల్ సాంట్నర్, కరన్ శర్మ, ఇమ్రాన్ తాహిర్, సాయి కిషోర్, పార్ట్ టైమ్ స్పిన్నర్ కేదార్ జాదవ్‌తో ఆ జట్టులో స్పిన్నర్లకు కొదవలేదు. హర్భజన్ సింగ్ గైర్హాజరీతో ఇమ్రాన్ తాహిర్ స్పిన్ దళాన్ని నడిపించనున్నాడు. ఇక కరోనా కొరల్లో నుంచి సీఎస్‌కే బయటపడింది. 13 మంది మినహా అందరికి రెండో సారి నిర్వహించిన పరీక్షల్లో నెగటీవ్ వచ్చింది. దీంతో ఆ జట్టు శుక్రవారం ప్రాక్టీస్ షురూ చేసింది.
IPL 2020 టైమింగ్స్ మార్చండి గంగూలీ సర్.. 7.30కి మా ఫ్యామిలీ ‘కార్తీక దీపం' సీరియల్ చూస్తుంది!


Click it and Unblock the Notifications
