For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీని ఓపెనర్‌గా ఆడించాలా? ఏంది.. చెన్నై కోచ్ స్టీఫెన్ ఫ్లేమింగ్ సెటైర్స్!

CSK coach Stephen Fleming jokes after the MS Dhoni is not needed to bat

దుబాయ్: ఐపీఎల్‌2020లో హ్యాట్రిక్ పరాజయాలకు ఫుల్ స్టాప్ పెడుతూ చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయాన్నందుకుంది. కింగ్స్‌ఎలెవన్ పంజాబ్‌తో ఆదివారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో చెన్నై 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్నందుకుంది. షేన్ వాట్సన్(53బంతుల్లో 11 ఫోర్లు 3 సిక్స్‌లతో 83 నాటౌట్), ఫాఫ్ డూప్లెసిస్(53 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 87 నాటౌట్) రికార్డు భాగస్వామ్యంతో దంచికొట్టారు. ఈ గెలుపుతో చెన్నై అభిమానులతో పాటు ఆ జట్టు కోచ్, మేనేజ్‌మెంట్ ఊపిరి పీల్చుకుంది.

ఫ్లెమింగ్ మీకు తలనొప్పి తప్పినట్లే..

ఫ్లెమింగ్ మీకు తలనొప్పి తప్పినట్లే..

అయితే గత మూడు మ్యాచ్‌ల్లో చెన్నై ఓడటంపై అసంతృప్తికి గురైన సీఎస్‌కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్.. మైదానంలో తమ ఆటగాళ్లు చేస్తున్న తప్పిదాలపై అసహనం వ్యక్తం చేశాడు. చెన్నై ఆటగాళ్లు క్యాచ్ డ్రాప్స్ చేసినప్పుడు కోచ్ రియాక్షన్స్‌ టీవీ కెమెరాల్లో పదేపదే కనిపించాయి. అయితే తాజాగా కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఓపెనర్లు మంచి భాగస్వామ్యం నెలకొల్పడంతో ఫ్లెమింగ్ తెగ సంతోషం వ్యక్తం చేశాడు. సీఎస్‌కే ఇన్నింగ్స్ సందర్భంగా కామెంటేటర్ సునీల్ గవాస్కర్ డగౌట్‌లోని ఫ్లెమింగ్‌తో మాట్లాడాడు. వికెట్ నష్టపోకుండా సీఎస్‌కే గెలిస్తే.. ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌పై ప్రశ్నలు ఎదురువ్వవని,పెద్ద తలనొప్పి తప్పినట్లేనని ఫ్లెమింగ్‌తో గవాస్కర్ చమత్కరించాడు.

ఓపెనర్‌గా ఆడించాలేమో...

ఓపెనర్‌గా ఆడించాలేమో...

దీనికి ఫ్లెమింగ్ సరదాగా స్పందించి నవ్వులు పూయించాడు. ‘ఆ ప్రశ్న మళ్లీ వస్తే ధోనీని నెంబర్‌వన్‌గా ఆడించాలేమో'అని ఫన్నీగా బదులిచ్చాడు. దీంతో అక్కడ నవ్వులు పూసాయి. ప్రెస్ కాన్ఫరెన్స్‌కు వెళ్లేటప్పుడు తాను అన్నిటికీ సిద్దమై వెళ్తానని ఫ్లెమింగ్ చెప్పుకొచ్చాడు. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిన అనంతరం మీడియా సమావేశంలో ఫ్లెమిగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. బ్యాటింగ్‌ ఆర్డర్లో ఎంఎస్ ధోనీ దిగువన రావడంపై ప్రశ్నించిన విలేకరులపై మండిపడ్డాడు. ఇది అసలు ప్రశ్నేనా, అంత ముఖ్యమైనదా అని మండిపడ్డాడు.

ఇది అసలు ప్రశ్నేనా?

ఇది అసలు ప్రశ్నేనా?

'ఎంఎస్‌ ధోనీ కన్నా ముందుగా కేదార్‌ జాదవ్‌ను పంపించడంలో మీ ఆంతర్యం ఏంటి?' అని ఒక విలేకరి ఫ్లెమింగ్‌ను ప్రశ్నించారు. 'ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నాను. నిజంగానే ఇది అసలు ప్రశ్నేనా?, అది అంత ముఖ్యమైనదా' అని చిరాకుపడ్డాడు. 'మా బ్యాటింగ్‌ ఆర్డర్లో కేదార్ జాదవ్‌ది నాలుగో స్థానం. ప్రాథమికంగా ఎంఎస్ ధోనీ మిడిల్‌ నుంచి లోయర్‌ ఆర్డర్ ఆటగాడు. ఇక్కడ జాదవ్‌ రెండు పాత్రలు పోషిస్తాడు. ఒకవేళ టాప్‌ ఆర్డర్‌ రాణిస్తే.. జాదవ్‌ దిగువకు వచ్చి ధోనీ ముందుగా బ్యాటింగ్‌కు వస్తాడు. అదే త్వరగా వికెట్లు పడితే.. జాదవ్‌ నాలుగులో వచ్చి వికెట్లు పడకుండా అడ్డుకుంటాడు. ధోనీ దిగువన వస్తాడు. ఇక్కడితో నేను ఆపేస్తాను' అని విలేకరికి ఫ్లెమింగ్‌ వివరణ ఇచ్చాడు.

వాట్సన్ ఫామ్‌లోకి.. చెన్నై టచ్‌లోకి..

వాట్సన్ ఫామ్‌లోకి.. చెన్నై టచ్‌లోకి..

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 178 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్(52 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 63), నికోలస్ పూరన్(17 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లతో 33) రాణించారు. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ 17.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 181 పరుగులు చేసి 16 బంతులు ఉండగానే సునాయస విజయాన్నందుకుంది. ఓపెనర్లు షేన్ వాట్సన్(53బంతుల్లో 11 ఫోర్లు 3 సిక్స్‌లతో 83 నాటౌట్), ఫాఫ్ డూప్లెసిస్(53 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 87 నాటౌట్) రికార్డు భాగస్వామ్యంతో దంచికొట్టారు. విజయంలో కీలక పాత్ర పోషించిన షేన్ వాట్సన్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు దక్కింది.

కోహ్లీ బాటలోనే రాహుల్.. వ్యక్తిగతమే తప్పా జట్టుకు పనికొచ్చిందేమీ లేదు.. నెట్టింట పేలుతున్న సెటైర్స్!

Story first published: Monday, October 5, 2020, 13:31 [IST]
Other articles published on Oct 5, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+