Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దారుణ హత్యకు గురైన సురేశ్ రైనా మామ.. అందుకే ఐపీఎల్‌కు దూరం!

Cricketer Suresh Raina’s uncle killed by robbers in Pathankot

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్‌కు అడుగడుగున ఆటంకాలు ఎదురువుతున్నాయి. తొలుత కరోనా.. ఆ తర్వాత టైటిల్ స్పాన్సర్ సమస్య.. ఇప్పుడు ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి కరోనా సోకడం.. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ సింగ్స్(సీఎస్‌కే) స్టార్ ఆటగాడు సురేశ్ రైనా హఠాత్తుగా ఐపీఎల్‌ నుంచి వైదొలిగాడు. దుబాయ్ నుంచి భారత్‌కు పయనమయ్యాడు. దీంతో యావత్ క్రికెట్ ప్రపంచం షాక్‌కు గురైంది. అసలు ఐపీఎల్ జరుగుతుందా ? లేదా? అనే అనుమానాలు రెకెత్తుతున్నాయి.

దోపిడీ దొంగల చేతిలో..

దోపిడీ దొంగల చేతిలో..

అయితే ఓవైపు కరోనా భయం.. మరోవైపు దగ్గరి బంధువు దారుణ హత్యకు గురవడంతోనే రైనా ఐపీఎల్ నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది. రైనా మామ (మేనత్త భర్త)‌ అశోక్‌ కుమార్‌ దారుణ హత్యకు గురైనట్లు తెలిసింది. దోపిడీ దొంగల దాడిలో అశోక్‌ ప్రాణాలు కోల్పోగా నలుగురు కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడినట్లు పంజాబ్‌లోని పఠాన్‌కోటా పోలీసులు శనివారం సాయంత్రం తెలిపారు. పంజాబ్ పఠాన్‌కోఠ్ జిల్లాలో ప్రభుత్వ కాంట్రాక్టర్ అయిన అశోక్ కుమార్(58) తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నారు. ఈ నెల 19న రాత్రి వీరు డాబాపై నిద్రిస్తుండగా...గుర్తు తెలియని దుండగులు వీరి ఇంట్లోకి ప్రవేశించి దోపిడికి ప్రయత్నించారు.

తిరగడబడటంతో..

తిరగడబడటంతో..

అయితే వారిపై అశోక్‌తో పాటు కుటుంబ సభ్యులు తిరగబడటంతో బలమైన ఆయుధాలతో దాడికి పాల్పడ్డారు. కొంత నగదు, బంగారం దోచుకెళ్లారు. దోపిడీ దొంగల దాడిలో అశోక్ కుమార్ తలకు తీవ్ర గాయాలుకాగా...అదే రాత్రి కన్నుమూసినట్లు శనివారం పోలీసులు తెలిపారు. అశోక్ కుమార్ తల్లి సత్యదేవి, భార్య ఆశాదేవి, కుమారులు అపిన్, కౌశల్ కూడా గాయపడ్డారు. సత్యదేవి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగా..మిగిలిన ముగ్గురు ఇంకా చికిత్స పొందుతున్నారు. దుండగుల కోసం గాలిస్తున్నట్లు జిల్లా ఎస్పీ గుల్నీత్ సింగ్ తెలిపారు. అయితే హత్యకు గురైన కుటుంబం రైనా బంధువలా? అనే విషయంపై మాత్రం పోలీసులు స్పష్టత ఇవ్వలేదు.

ధోనీ చెప్పినా..

ధోనీ చెప్పినా..

చెన్నై జట్టులో కరోనా పాజిటివ్‌ల సంఖ్య పెరుగుతుండడం రైనాను భయాందోళనకు గురిచేసినట్టు తెలుస్తోంది. రెండు రోజుల్లోనే కేసుల సంఖ్య 13కు చేరడంతో అతను తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యాడట. ‘శుక్రవారం రాత్రి ఈ విషయమై కోచ్‌ ఫ్లెమింగ్‌, కెప్టెన్‌ ధోనీతోపాటు సహచర ఆటగాళ్లకు రైనా పదే పదే కాల్‌ చేస్తూ తన భయాన్ని వ్యక్తం చేశాడు. అతడిని సముదాయించేందుకు ధోనీ చేసిన ప్రయత్నం ఫలించలేదు. మానసికంగా అతను ఇబ్బందిపడుతున్నాడు. ఈ పరిస్థితిలో అతడిని ఇక్కడే ఉంచడం అనవసరం అనిపించింది' అని జట్టు ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు.

ట్రైనింగ్ క్యాంపే కొంప ముంచిందా..?

ట్రైనింగ్ క్యాంపే కొంప ముంచిందా..?

అన్ని జట్లు యూఏఈకి రాకముందు ఒక్క సీఎస్‌కే మాత్రం చెన్నైలో ఆటగాళ్లకు పూర్తి స్థాయిలో ప్రాక్టీస్ క్యాంప్ నిర్వహించింది. ఇది కెప్టెన్‌ ధోనీ ఒత్తిడి మేరకే జరిగిందని ఇప్పటికే సీఈవో కాశీ విశ్వనాథన్‌ ప్రకటించాడు. ఇప్పుడు జట్టులో కరోనా కేసులు వెలుగు చూస్తుండడంతో అంతా ఆ శిబిరంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే క్యాంపు చెపాక్‌ స్టేడియంలో జరగగా, దీని పక్కనే ఎక్కువ కేసులు నమోదైన ట్రిప్లికేన్‌ ఏరియా ఉంది. ప్రస్తుతం అత్యధికంగా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు రెండోస్థానంలో ఉంది. కాబట్టి ఈ క్యాంపు ప్రభావం చూపిందేమోననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అప్పట్లోనే బోర్డు అధికారులు సీఎస్‌కేకు శిబిరం అనవసరమని చెప్పినట్టు సమాచారం.

ధోనీ నాకు హిందీ రాదనుకున్నాడు.. అతని సక్సెస్ సీక్రెట్ అదే: ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్

Story first published: Sunday, August 30, 2020, 9:47 [IST]
Other articles published on Aug 30, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+