Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నెలరోజులు కోమాలోనే!: బంతి తలకు తగిలి అంపైర్ మృతి

Cricket Umpire Hit By Ball In Match, Demise In Hospital || Oneindia Telugu
Cricket umpire hit by ball in match dies in hospital

హైదరాబాద్: ఓ క్రికెట్ మ్యాచ్‌లో బంతి తగిలి తీవ్రంగా గాయపడిన ప్రముఖ అంపైర్ జాన్ విలియమ్స్ గురువారం కన్నుమూశారు. జూలై 13న కార్డిఫ్ వేదికగా పెంబ్రోక్, నార్బెర్త్ జట్ల మధ్య జరిగిన డివిజన్ 2 మ్యాచ్‌లో బంతి ఆయన తలను బలంగా తాకింది.

ఏంటా షాట్ సెలక్షన్? పంత్ ఓవర్‌రేటెడ్ ప్లేయర్: నెటిజన్ల ఆగ్రహం

దీంతో మ్యాచ్ నిలిపివేసి 80 ఏళ్ల జాన్‌ను కార్డిఫ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ వేల్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూనే ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. సుమారు నెలరోజులకు పైగా మృత్యువుతో పోరాడారు. ఆగస్టు 1న మెరుగైన చికిత్స్ కోసం ఆయన్ను హేవర్‌ఫోర్డ్‌వెస్ట్‌లోని వితిబుష్ ఆసుపత్రికి తరలించారు.

స్టీవ్ బక్నర్ ప్రపంచ రికార్డుని సమం చేసిన పాక్ అంఫైర్

ఆ తర్వాత రెండు వారాలకే ఆయన మరణించారు. ఈ మేరకు గురువారం ఉదయం కన్నుమూసినట్టు పెంబ్రోక్ క్రికెట్ ట్విటర్లో వెల్లడించింది. ఈ సందర్భంగా ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు వెల్లడించింది.

ఇదే క్రికెట్ మ్యాచ్‌కు అంఫైర్‌గా వ్వవహారించిన నార్బెర్త్ క్రికెట్ క్లబ్‌కు చెందిన రాబర్ట్ సిమన్స్ మాట్లాడుతూ "అతను ఒక జెంటిల్మెన్. క్రికెట్ దృక్పథం నుండి వచ్చినవాడు. క్రికెట్ కోసం ఎంతో సమయాన్ని వదులుకున్నాడు. 80 ఏళ్ల వయసులో కూడా అంఫైరింగ్‌గా విధులంటే మామూలు విషయం కాదు" అని కొనియడాడు.

అయితే, క్రికెట్‌లో బంతి తలకు తగిలి మృతి చెందడం ఇదే మొదటి సారి కాదు. గతంలో పలువురు క్రికెటర్లు సైతం ఇలానే మృత్యువాత పడ్డారు.

Story first published: Friday, August 16, 2019, 11:42 [IST]
Other articles published on Aug 16, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+