ఆ స్ట్రాటజీతోనే ధోనీని బోల్తా కొట్టించి.. 2011 ప్రపంచకప్‌లో గెలిచాం: సౌతాఫ్రికా మాజీ అనలిస్ట్

న్యూఢిల్లీ: 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 2011 వన్డే ప్రపంచకప్ అందించిన విషయం తెలిసిందే. ఆసియా దేశాల వేదికగా జరిగిన ఈ టోర్నీలో ధోనీ నేతృత్వంలోని భారత్ అద్భుత ప్రదర్శన కనబర్చిచింది. సౌతాఫ్రికాతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఓడిన ధోనీ సేన.. ఇంగ్లండ్‌తో డ్రా చేసుకుంది. ఈ రెండు మ్యాచ్‌ల మినహా అన్నింటిలో విజయం సాధించింది. అయితే వరుస విజయాలతో బలంగా ఉన్న భారత్‌ను సౌతాఫ్రికా ఓడించడానికి గల కారణాన్ని నాటి సౌతాఫ్రికా టీమ్ విశ్లేషకుడు ప్రసన్న అగోరమ్ తాజాగా వెల్లడించాడు.
భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడుతూ.. 'జహీర్ ఖాన్-డెత్ ఓవర్ల' స్ట్రాటజీతో ధోనీని బోల్తా కొట్టించి విజయాన్నందుకున్నామని తెలిపాడు. టోర్నీలో భారత ప్రధాన బలం బ్యాటింగేనని, బౌలింగ్‌లో బలహీనంగా ఉన్నా.. జహీర్ ఖాన్‌తో ధోనీ నెట్టుకొచ్చాడని, ఇది గ్రహించి దానికి అనుగుణంగా ప్రణాళిక రచించామని భారత్‌కే చెందిన ప్రసన్న గుర్తు చేసుకున్నాడు.

బ్యాటింగ్‌తోనే..
‘2011 ప్రపంచకప్‌లో భారత జట్టు ప్రతీ టీమ్‌ను చిత్తు చేసింది. నాగ్‌పూర్ వేదికగా సౌతాఫ్రికాతో మ్యాచ్‌కు ముందే వరుస విజయాలతో చాలా బలంగా కనిపించింది. అయితే మీరు(అశ్విన్) ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా.. భారత జట్టు బ్యాటింగ్ మీద ఆధారపడే ఈ విజయాలు సాధించింది. సెహ్వాగ్, గంభీర్, కోహ్లీ, సచిన్, ధోనీ, యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, యూసఫ్ పఠాన్‌లతో భారత బ్యాటింగ్ విభాగం చాలా బలంగా ఉంది. దీంతోనే నేను భారత బౌలింగ్‌ను టార్గెట్ చేస్తూ ఓ వ్యూహాన్ని రచించా.

ధోనీ వ్యూహం అర్థమైంది..
సౌతాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు వరకు భారత్ ఆడిన బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఐర్లాండ్, నెథర్లాండ్స్ మ్యాచ్‌ల్లో బ్యాటింగ్ పవర్ ప్లే, డెత్ ఓవర్లు కీలక ప్రభావం చూపించాయని గ్రహించా. ముఖ్యంగా డెత్ ఓవర్లలో జహీర్ ఖాన్ బౌలింగ్ అసాధారణమని అర్థమైంది. అతని డెత్ ఓవర్ల గణంకాలను క్షుణ్ణంగా పరిశీలించా. తొలి మ్యాచ్‌లో 2 ఓవర్లలో 1/4, ఇంగ్లండ్‌తో 3 ఓవర్లలో 3/11, ఐర్లాండ్‌తో బ్యాటింగ్ పవర్ ప్లే, డెత్ ఓవర్లలో నాలుగు ఓవర్లు వేసి 1/14, నెథర్లాండ్ పై 2/3తో రాణించాడు. అలాగే జహీర్‌ను ధోనీ ఉపయోగించిన దానిని కూడా గ్రహించా.
చాలా మ్యాచ్‌ల్లో క్లిష్ట సమయాల్లో జహీర్ సేవలను ధోనీ ఉపయోగించుకున్నాడు. తొలి 10 ఓవర్లలో 5 ఓవర్లు జహీర్‌తో వేయించడం.. మిగతా కోటాను డెత్ ఓవర్లలో ఉపయోగించుకునేవాడు. మధ్యలో క్లిష్ట పరిస్థితులు ఎదురైతే జహీర్‌కు బంతినిచ్చి పరిస్థితులను తనవైపు తిప్పుకునేవాడు. ఇలా తొలి పవర్‌ప్లేలో జహీర్ ఫిగర్స్ 18-1-86-2. ఇలా ఉండగా.. మిడిల్ ఓవర్స్(11-40)లో 7-0-35-2, డెత్ ఓవర్లలో(41-50) 10.4-0-33-7గా ఉన్నాయి. ఓవరాల్‌గా డెత్ ఓవర్లలో అతని ప్రదర్శన అద్బుతంగా ఉంది.

డెత్ ఓవర్లు లేకుండా..
దీంతో జహీర్‌కు డెత్ ఓవర్లు లేకుండా చేయడమే టార్గెట్‌గా ప్రణాళిక రచించా. ఆ ఉచ్చులో ధోనీ, జహీర్ చిక్కుకున్నారు. తొలి 5 ఓవర్లు వేసిన జహీర్.. మిడిల్ ఓవర్లలో మరోసారి బౌలింగ్ చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చాం. దీంతో అతను రెండు ఓవర్లు వేసాడు. ముందుగానే బ్యాటింగ్ పవర్ ప్లే తీసుకోవడంతో ధోనీ జహీర్‌తో రెండు ఓవర్లు వేయించాడు. దీంతో 37 ఓవర్లలోపే జహీర్ తన కోటాలో 9 ఓవర్లు పూర్తిచేసుకున్నాడు. ఈ కారణంగా జహీర్‌కు డెత్ ఓవర్లో బౌలింగ్ చేసే అవకాశం లేకుండా పోయింది.
ఇక సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం అంత సులువు కాదు. చివరి 10 ఓవర్లలో మా విజయానికి 69 పరుగులు కావాలి. చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. జహీర్‌కు మాత్రం ఒకే ఓవర్ ఉంది. దీంతో ధోనీ జహీర్‌తో 49వ ఓవర్ వేయించాడు. ఆ సమయంలో మా విజయానికి 12 బంతుల్లో 17 పరుగులు అవసరం. కానీ జహీర్ ఓవర్లో 4 పరుగులే వచ్చాయి. చివరి ఓవర్లో విజయానికి 13 పరుగులు అవసరం కాగా.. ఆశిష్ నెహ్రా మ్యాచ్‌ను కాపాడలేకపోయాడు.'అని ప్రసన్న తన స్ట్రాటజీని వివరించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
తండ్రి కాబోతున్న విరాట్ కోహ్లీ!