Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Australia: ఆ ఆరోపణల్లో నిజం లేదు.. అధికారిక బ్రాడ్‌కాస్టర్‌పై సీఏ ఫైర్!

Cricket Australia slams broadcast partner Channel 7 for talking game down

మెల్‌బోర్న్‌: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి భయపడి షెడ్యూల్ మార్చారని అధికారిక బ్రాడ్‌కాస్టర్ చానెల్ 7 చేసిన ఆరోపణలను క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ఖండించింది. కొవిడ్‌-19 ముప్పు ఉన్నప్పటికీ ప్రస్తుత సిరీస్‌ సురక్షితంగా సాగేలా కృషి చేసిన బీసీసీఐకి సీఏ కృతజ్ఞతలు తెలియజేసింది. పోటాపోటీ నెలకొన్న ఈ సిరీస్‌ నిర్వహణకు కారకులైన బీసీసీఐలోని మిత్రులకు ధన్యవాదాలని సీఏ తాత్కాలిక సీఈవో నిక్‌ హాక్లీ అన్నాడు. బీసీసీఐకి భయపడి సీఏ షెడ్యూలు మార్చిందన్న ఛానెల్‌ 7 ఆరోపణలను ఈ సందర్భంగా ఆయన తప్పుబట్టారు.

డేనైట్‌తో మొదలవ్వాలి..

డేనైట్‌తో మొదలవ్వాలి..

ముందుగా చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ బీసీసీఐకి లబ్ధి కలిగేలా షెడ్యూల్‌లో సీఏ మార్పులు చేసిందని.. ఈ రెండు బోర్డుల మధ్య ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయో తెలుసుకునే అవకాశాన్ని ఇవ్వాలని కోరుతూ ఛానెల్‌ 7 సంస్థ కోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది. భారత్‌తో పర్యటనను డే/నైట్‌ టెస్టుతో ఆరంభించాల్సిందని, కానీ ఆ మ్యాచ్‌ను క్రికెట్‌ ఆస్ట్రేలియా డిసెంబర్‌ 17కు మార్చిందని.. వన్డే, టీ20లను ముందుగా నిర్వహిస్తోందని సెవన్‌ వెస్ట్‌ మీడియా సీఈవో వార్‌బర్టన్‌ ఆరోపించారు.

దెబ్బతీసేలా ఉన్నాయి..

దెబ్బతీసేలా ఉన్నాయి..

ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీఏ చీఫ్ నిక్ హాక్లీ.. ఈ ఆరోపణలు తమ ఆటను దెబ్బతీసేలా ఉన్నాయన్నాడు. 'ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్‌ సానుకూలంగా ఉంది. ఇలాంటి సమయంలో మా ఆటను దెబ్బతీసేలా సెవెన్‌ వెస్ట్‌ మీడియా మాట్లాడటం నిరాశ కలిగిస్తోంది. సమ్మర్‌ క్రికెట్‌ ఆనందాన్ని అందించేందుకు క్రికెట్‌ ఆస్ట్రేలియా ఎంతో అంకితభావం ప్రదర్శించింది. బ్రాడ్‌కాస్టర్ ఒప్పంద స్థితిపై మేం విశ్వాసంతోనే ఉన్నాం.

ఎంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నా టీమిండియాతో ఈ సిరీస్‌ జరిగేందుకు బీసీసీఐలోని మా మిత్రులు ఎంతో మద్దతుగా నిలిచారు. తొలి రెండు వన్డేలకు రికార్డు వ్యూయర్‌షిప్‌ వచ్చింది. రాబోయే టెస్టు సిరీసుపై ఆసక్తికి ఇదో గొప్ప సూచిక. కరోనా సమయంలోనూ భారత్‌-ఆస్ట్రేలియా సిరీస్‌ కోసం పనిచేస్తున్న ఛానెల్‌ 7 సిబ్బందికి అభినందనలు'అని హాక్లీ అన్నాడు.

వన్డే సిరీస్ ఆసీస్ వశం..

వన్డే సిరీస్ ఆసీస్ వశం..

ఇక ఎన్నో అంచనాల మధ్య ఆసీస్ గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు ఊసూరుమనిపించింది. పేలవ బౌలింగ్, చెత్త ఫీల్డింగ్, ఇంటెన్సిటీవ్ లేని బ్యాటింగ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో వరుసగా రెండింటిలో ఓడి 0-2తో మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ చేజార్చుకుంది. డిసెంబర్ 17 నుంచి నాలుగు టెస్ట్‌ల సిరీస్ ప్రారంభం కానుంది.

Ind vs Aus: కోహ్లీసేనదే బ్యాటింగ్.. యార్కర్ల నట్టూ అరంగేట్రం!

Story first published: Wednesday, December 2, 2020, 10:03 [IST]
Other articles published on Dec 2, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+