CPL 2020: 48 ఏళ్ల వయసులో ప్రవీణ్ తాంబే పర్ఫెక్ట్ క్యాచ్.. పదికి పది గెలిచిన నైట్ రైడర్స్!

ట్రినిడాడ్: కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) టీ20 టోర్నమెంట్‌లో ఆడుతున్న తొలి భారత ఆటగాడిగా గుర్తింపు పొందిన ప్రవీణ్ తాంబే.. 48 ఏళ్ల వయసులో కూడా ఔరా.. అనే ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఆటకు వయసుతో సంబంధం లేదని మరొకసారి నిరూపించాడు. ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రవీణ్ తాంబే.. అవకాశాలు తక్కువగానే వచ్చినా.. తనదైన మార్క్ పెర్షామెన్స్‌తో ఆకట్టుకుంటున్నాడు.
తాజాగా సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియాట్స్ జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కళ్లు చెదిరే క్యాచ్‌తో అదరగొట్టాడు. బౌలింగ్‌లో ఓ వికెట్ తీసాడు. ఈ రెండింటికి సంబంధించిన వీడియోను సీపీఎల్ టీ20 తమ అధికారి ట్విటర్‌లో షేర్ చేసింది. 'ట్రినిడాడ్‌లో ప్రవీణ్ తాంబే ప్రత్యేకం'అనే క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది.
48 ఏళ్ల యువ ఆటగాడు..
సెయింట్ కిట్స్ ఇన్నింగ్స్ సందర్భంగా ఫవాద్ అహ్మద్ వేసిన ఏడో ఓవర్ మూడో బంతిని బెన్ డంక్ స్వీప్ షాట్ ఆడగా.. బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో పీల్డింగ్ చేస్తున్న ప్రవీణ్ తాంబే ముందుకు పరుగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేసి మరి బంతిని అందుకున్నాడు. అతని సూపర్ క్యాచ్‌తో మైదానంలో ఆటగాళ్లతో పాటు కామెంటేటర్లు అవాక్కయ్యారు. 48 ఏళ్ల యువ ఆటగాళ్లు అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడని వ్యాఖ్యాతలు కొనియాడారు. ఇక ఆ మరుసటి ఓవర్‌లో వేసిన ప్రవీణ్ తాంబే డా సిల్వాను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన అతను కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ తీశాడు.

నైట్‌రైడర్స్ 10/10
కీరన్ పొలార్డ్ నేతృత్వంలోని ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ (టీకేఆర్) జట్టు లీగ్ దశను అజేయంగా ముగించింది. ఆడిన 10 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ పై 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ కిట్స్ జట్టు 18.2 ఓవర్లలో 77 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో రామ్‌దిన్(19),కెప్టెన్ ఎమ్రిత్(15) టాప్ స్కోరర్లుగా నిలిచారు. నైట్‌రైడర్స్ బౌలర్ ఫవాద్ అహ్మద్ (4/21) సెయింట్ కిట్స్ పతనాన్ని శాసించాడు. అక్లీ హోసెన్ రెండు వికెట్లు తీయగా.. ప్రవీణ్ తాంబే, సికిందర్ రాజా, అలీ ఖాన్, అండర్సన్ ఫిలిప్ తలో వికెట్ తీశారు.

వెబ్‌స్టర్ సూపర్ ఇన్నింగ్స్‌తో..
అనంతరం నైట్‌రైడర్స్ జట్టు 11.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 78 పరుగులు చేసి గెలుపొందింది. వెబ్‌స్టర్ (33 బంతుల్లో 41 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) చెలరేగాడు. మొత్తం ఆరు జట్లు రౌండ్ రాబిన్ లీగ్ పద్థతిలో తలపడుతున్న ఈ టోర్నీలో టీకేఆర్ జట్టు లీగ్ దశలో 20 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. టీకేఆర్ జట్టుతోపాటు గయానా అమెజాన్ వారియర్స్, సెయింట్ లూయిస్ జౌక్స్, జమైకా తలవాస్ జట్లు కూడా సెమీఫైనల్ చేరాయి. సోమవారం లీగ్‌కు విశ్రాంతి కాగా.. మంగళవారం సెమీఫైనల్స్ జరుగుతాయి. ఫైనల్ 10వ తేదీన జరగనుంది.
England vs Australia: ఓయ్ బట్లర్ దీనికా రివ్యూ తీసుకునేది.. నువ్వు గొప్పోడివి సామి.! (వీడియో)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications