For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CPL 2020: వారెవ్వా వాటే క్యాచ్.. ఇది కదా కావాల్సింది.! (వీడియో)

CPL 2020: Trinbago Knight Riders maintain perfect start as Khary Pierre stars
CPL 2020,GAW vs TKR:Stunning Boundary Line Catch మైమరిపించే క్యాచ్‌‌ చూసి పరవశించిపోతున్న ఫ్యాన్స్..

ట్రినిడాడ్: కరోనా కారణంగా క్రికెట్‌కు కలిగిన అంతరాయంతో అభిమానులు అసలు సిసలు మజాను మిస్సయ్యారు. ప్రస్తుతం క్రికెట్ పున:ప్రారంభం కావడం.. కరీబియన్ గడ్డపై ధనాధన్ లీగ్ జరుగుతుండటంతో మళ్లీ ఆ మజాను ఆస్వాదిస్తున్నారు. ఇప్పటికే ఉక్కిరి బిక్కిరి చేసే మ్యాచ్‌లు.. ఔరా అనే బౌలర్ల పెర్ఫామెన్స్‌ను సీపీఎల్‌లో చూసిన ఫ్యాన్స్.. తాజాగా కళ్లు మైమరిపించే క్యాచ్‌‌ను చూసి పరవశించిపోతున్నారు. ఎన్నాళ్లైంది ఇలాంటిని క్యాచ్ చూడక.. ఇదే కదా మాకు కావాల్సిందని కామెంట్ చేస్తున్నారు. గురువారం గయాన అమెజాన్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ ప్లేయర్ వెబ్‌స్టర్ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. దాదాపు సిక్స్ అనుకున్న క్యాచ్‌ను తనదైన శైలిలో అందుకొని ఔరా అనిపించాడు.

బౌండరీ లైన్ వద్ద..

గయాన ఇన్నింగ్స్‌లో పిర్రే వేసిన 13 ఓవర్ తొలి బంతిని ఆ జట్టు బ్యాట్స్‌మన్ రూథర్ ఫర్డ్ ఓవర్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడాడు. బంతి కూడా దాదాపు సిక్స్‌గా వెళ్లింది. కానీ ఆ దిశలో బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న వెబ్ స్టెర్ గాల్లోకి ఎగిరి బంతిని అందుకున్నాడు. సమన్వయం కోల్పోయిన అతను చాకచక్యంగా బంతిని గాల్లోకి విసిరి.. బౌండరీ రోప్ ధాటాడు. ఆ వెంటనే తిరిగివచ్చి అందుకున్నాడు.

అయితే అతను బంతి అందుకునే క్రమంలో బౌండరీ తాకాడా? అనే సందేహంతో థర్డ్ అంపైర్‌ను సమీక్షించగా.. అలాంటిదేం లేదని స్పష్టమైంది. దీంతో రూథర్ ఫర్డ్(6) నిరాశగా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు వారెవ్వా వాటే క్యాచ్.. అంటూ కామెంట్ చేస్తున్నారు.

నైట్ రైడర్స్ జైత్రయాత్ర..

నైట్ రైడర్స్ జైత్రయాత్ర..

ఇక ఈ మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ 7 వికెట్లతో సునాయస విజయాన్నందుకుంది. సూపర్ బౌలింగ్.. అదిరే బ్యాటింగ్.. మైమరిపించే ఫీల్డింగ్‌తో అదరగొడుతున్న ఆ జట్టు లీగ్‌లో ఓటమెరుగని జట్టుగా తమ జైత్రయాత్రను కొనసాగిస్తుంది. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో గెలిచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన గయాన.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 112 పరుగులు చేసింది. షిమ్రన్ హెట్‌మైర్(26, రాస్ టేలర్(26), కీమో పాల్(28).. మినహా అంతా విఫలమయ్యారు. నైట్ రైడర్స్ బౌలర్లలో ఖారీ పిర్రే(3/18) గయాన పతనాన్ని శాసించాడు. అతనికి తోడుగా..డ్వేన్ బ్రావో, సికింధర్ రాజా, పొలార్డ్ తలో వికెట్ తీశారు.

బ్రావో,సిఫెర్ట్ మెరుపులు..

బ్రావో,సిఫెర్ట్ మెరుపులు..

అనంతరం లక్ష్య చేధనకు దిగిన నైట్ రైడర్స్ 18.2 ఓవర్లలో 3 వికెట్లకు 115 రన్స్ చేసి 10 బంతులు మిగిలి ఉండగానే విజయాన్నందుకుంది. ఆ జట్టులో వెబ్ స్టర్(27), డారెన్ బ్రావో(26 నాటౌట్), టీమ్ సీఫెర్ట్(39 నాటౌట్) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో ఇమ్రాన్ తాహిర్ రెండు వికెట్లు తీయగా.. కెప్టెన్ గ్రీన్ ఓ వికెట్ తీశాడు. అద్భుత బౌలింగ్ చేసిన ఖారీ పిర్రేకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

రిటైర్మెంట్ తర్వాత సగం రింగ్‌కే ఫోన్‌ ఎత్తుతా.. ఆర్పీ సింగ్‌కు ధోనీ హామీ!

Story first published: Friday, August 28, 2020, 11:57 [IST]
Other articles published on Aug 28, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+