
డ్వేన్ బ్రావో
కరీబియన్ బౌలర్ డ్వేన్ బ్రావో తనదైన ఆటతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. అటు బ్యాట్.. ఇటు బంతితో మైదానంలో అద్భుతం చేసే బ్రావో కోసం ఫ్రాంచైజీలు క్యూ కడతాయి. ఆటతో పాటు మైదానంలో అతను చేసే సందడి అంత ఇంత కాదు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగే బ్రావో.. సీపీఎల్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
ఇప్పటి వరకు 69 మ్యాచ్‌లు ఆడిన బ్రావో..97 వికెట్ల పడగొట్టి హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఇందులో నాలుగు 4 వికెట్స్ హాల్స్ ఉండగా.. ఒక 5 వికెట్ హాల్ ఉంది. అతని బెస్ట్ (5/23) కూడా ఇదే.

క్రిష్‌మర్ సంతోకి
జమైకాకు చెందిన లెఫ్టార్మ్ మీడియం పేసర్ క్రిష్‌మర్ సంతోకి సీపీఎల్ సెకండ్ హయ్యెస్ట్ వికెట్ టేకర్. ఈ కరీబియన్ లీగ్‌లో ఇప్పటి వరకు 58 మ్యాచ్‌లు ఆడిన
ఈ 35 ఏళ్ల సీనియర్ పేసర్.. 85 వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండు ఫోర్ వికెట్ హాల్స్ ఉన్నాయి. గత సీజన్‌లో గయానా అమెజాన్ వారియర్స్ తరఫున బరిలోకి దిగాడు.

రాయద్ ఎమిరిట్
రాయద్ ఎమిరిట్.. సీపీఎల్ సెకండ్ మోస్ట్ సక్సెఫుల్ బౌలర్. ట్రినిడాడ్‌కు చెందిన కుతిచేతివాటం పేసర్.. 75 మ్యాచ్‌ల్లో 85 వికెట్లతో క్రిషమర్‌తో రెండో స్థానంలో నిలిచాడు. గత సీజన్‌లో గయానా అమెజాన్ వారియర్స్‌కు ఆడిన రాయద్.. అప్ కమింగ్ సీజన్‌లో కూడా ఆ జట్టుకు ఆడనున్నాడు. ఇప్పటి 253.4 ఓవర్లు వేసిన ట్రినిడాడ్ పేసర్.. 23.44 సగటుతో 4/35 బెస్ట్ కలిగి ఉన్నాడు.

సునీల్ నరైన్..
పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఐపీఎల్ అభిమానులకు బాగా తెలిసిన ఆటగాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున విధ్వంకర బ్యాటింగ్, బౌలింగ్‌తో అలరించిన మిస్టరీ స్పిన్నర్. స్వల్ప లక్ష్యాలను కూడా కాపాడగలిగే సమర్థవంతమైన బౌలర్.. సూపర్ ఓవర్ కూడా వేయగలిగే ఏకైక స్పిన్నర్. ఇక సీపీఎల్‌లో ఇప్పటి వరకు 71 మ్యాచ్‌లు ఆడిన నరైన్..72 వికెట్లు తీశాడు. గత సీజన్‌లో గయానా అమెజాన్ వారియర్స్‌కు ఆడిన అతను.. ఈ సారి కూడా అదే జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా 4 వికెట్లు అందుకోలేదు. కానీ పలుమార్లు మూడుకు పైగా వికట్లు సాధించాడు.
నేలకొరిగిన డబ్ల్యూడబ్ల్యూఈ దిగ్గజం.. శోకసంధ్రంలో క్రీడాలోకం!


Click it and Unblock the Notifications
