For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నేలకొరిగిన డబ్ల్యూడబ్ల్యూఈ దిగ్గజం.. శోకసంధ్రంలో క్రీడాలోకం!

WWE Legend James Harris, known to WWE fans as Kamala has passed Away at 70

న్యూయార్క్: డబ్ల్యూడబ్ల్యూ దిగ్గజం, 'కమలా'గా అభిమానులకు సుపరిచితమైన అమెరికా మాజీ ప్రొఫెషనల్ రెజ్లర్ జేమ్స్ హరిస్(70) మరణించారు. గత కొన్నేళ్లుగా దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. కమలా మరణంతో డబ్ల్యూడబ్ల్యూలోకం శోకసంధ్రంలో మునిగిపోయింది. డబ్ల్యూడబ్ల్యూ ఎంటర్‌నైట్‌మెంట్ ప్రపంచంలో ఎన్నో చిరస్మరణీ మ్యాచ్‌లతో కమలా అభిమానులను అలరించాడు. ఈ ఎంటర్‌టైన్‌మెంట్ రెజ్లింగ్‌లో క్లాసిక్ హీరోలైన అండర్ టేకర్, అండ్రూ ది గేయింట్, హల్క్ హోగన్‌లతో కమలా భీకరంగా పోరాడాడు.

6 అడుగుల 7 ఇంచుల భారీ కాయం.. ముఖానికి పెయింట్‌తో చూడటానికి భయంకరంగా ఉండేవాడు. 1993లో డబ్ల్యూడబ్ల్యూఈ ప్రపంచంలోకి అడుగుపెట్టిన కమలా.. తన ప్రొఫెషనల్ కెరీర్‌లో మొత్తం 400 మ్యాచ్‌ల్లో పోటీపడ్డాడు. ఇక చివరిసారిగా 2006లో కనిపించాడు. కానీ 2010 వరకు డబ్ల్యూడబ్ల్యూ ప్రమోషన్స్‌లో పాల్గొన్నాడు. అనంతరం తీవ్ర అనారోగ్య సమస్యలతో డబ్ల్యూడబ్ల్యూకి దూరమయ్యాడు. డయాబెటిస్‌తో అతని రెండు కాళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి.

ఇక కమలా మరణంపై యావత్ డబ్ల్యూడబ్ల్యూలోకం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. 'డబ్ల్యూడబ్ల్యూఈ ప్రపంచంలో కమలాగా ప్రాచుర్యం పొందిన జేమ్స్ హారీస్ మరణ వార్త విషాదాన్ని నింపింది'అని డబ్ల్యూడబ్ల్యూఈ ట్వీట్ చేసింది. అతని సహచర ఫ్రొఫెషన్ రెజ్లర్లు కూడా కమలా మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ.. అతనితో ఉన్న జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు.

Story first published: Monday, August 10, 2020, 12:30 [IST]
Other articles published on Aug 10, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+