CPL 2020: చిక్కుల్లో పాక్ ఆటగాడు.. ఔటైన కోపంలో బ్యాట్‌తో బౌలర్‌పై దాడి! (వీడియో)

ట్రినిడాడ్: పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ అసిఫ్ అలీ వివాదంలో చిక్కుకున్నాడు. ప్రస్తుతం కరీబీయన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)2020 సీజన్ ఆడుతున్న ఈ పాక్ క్రికెటర్ ఔటైన కోపంలో బౌలర్‌పై బ్యాట్‌తో దాడికి దిగాడు. అదృష్టవశాత్తు బ్యాట్ బౌలర్‌కు తగలకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. జమైకా తల్లవాస్, గయానా అమెజాన్ వారియర్స్ మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. బౌలర్‌పై దాడికి దిగిన అసిఫ్ అలీపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ఇంతకేం జరిగిందంటే..
సీపీఎల్‌లో జమైకా తల్లవాస్ తరఫున బరిలోకి దిగిన అసిఫ్ అలీ.. గయానా బౌలర్ కీమోపాల్‌ను గాయపర్చే ప్రయత్నం చేశాడు. కీమో పాల్ వేసిన 8వ ఓవర్ రెండో బంతిని అసిఫ్ అలీ లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడాడు. కానీ గయానా కెప్టెన్ క్రీస్ గ్రీన్ అద్భుతంగా క్యాచ్ పట్టుకున్నాడు. ఇక పెవిలియన్ చేరుతున్న అలీని కీమోపాల్ కవ్వించాడు. దీంతో కోపాద్రిక్తుడైన అసిఫ్ బ్యాట్‌తో బౌలర్‌పై దాడి చేశాడు. కానీ కీమో పాల్ దూరంగా ఉండటంతో ప్రమాదం తప్పింది.

అవాక్కైన ఆటగాళ్లు..
ఇక అసిఫ్ అలీ చర్యతో కీమో పాల్‌తో పాటు మైదానంలోని ఆటగాళ్లంతా బిత్తరపోయారు. కామెంటేటర్లు అయితే అవాక్కయ్యారు. బిగ్గరగా అరుస్తూ ఘటనను వివరించారు.
మ్యాచ్ రిఫరీ రియాన్ కింగ్ ఈ సంఘటనపై దర్యాప్తు జరుపుతాడని పేర్కొన్నారు. ఇక లీగ్ నిబంధనల ప్రకారం అసిఫ్ అలీపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మ్యాచ్ ఫీజు కోతతో పాటు ఒక మ్యాచ్ వరకు నిషేధం పడొచ్చు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఇక ఈ సీజన్‌లో అసిఫ్ అలీ అద్భుతంగా రాణిస్తున్నాడు. సెయింట్ లూసియా ఔక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 47 రన్స్‌తో అజేయంగా నిలిచి జట్టుకు సూపర్ విక్టరీ అందించాడు.

అదరగొట్టిన ముజీబ్..
బౌలింగ్‌లో ముజీబ్ ఉర్ రెహ్మాన్(3/11), ఫిడెల్ ఎడ్వెర్డ్స్(3/30).. బ్యాటింగ్‌లో బొన్నర్(30 నాటౌట్), గ్లెన్ ఫిలిప్స్(26), రస్సెల్(20 బంతుల్లో 1 ఫోర్ 2 సిక్సర్లతో 23) మెరుపులు మెరిపించడంతో లో స్కోరింగ్ గేమ్‌లో తల్లవాస్ 5 వికెట్లతో విజయాన్నందుకుంది.
ఇక టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గయానా అమెజాన్ వారియర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 108 పరుగులు చేసింది. ఆ జట్టులో రాస్ టేలర్( 23), నవీన్ ఉల్ హక్(20 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచారు. ముజీబ్, ఫిడెల్‌కు తోడుగా రస్సెల్, సందీప్ తలోవికెట్ తీశారు.

అలవోకగా..
అనంతరం స్వల్ప లక్ష్యచేధనకు దిగిన జమైకా తల్లవాస్ 18 ఓవర్లలో 5 వికెట్లకు 113 పరుగులు చేసి 12 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. బొన్నర్ విన్నింగ్ షాట్‌తో మ్యాచ్‌ను ముగించడం విశేషం. సూపర్ బౌలింగ్‌తో అదరగొట్టిన అఫ్గాన్ సంచలనం ముజీబ్ ఉర్ రెహ్మాన్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ దక్కింది. ఇక మ్యాచ్ తొలి బంతికే జమైకా బౌలర్ ఫిడెల్ ఎడ్వెర్డ్.. గయానా ఓపెనర్ బ్రెండన్ కింగ్(0) క్లీన్ బౌల్డ్ చేయడం మ్యాచ్‌కు హైలైట్‌గా నిలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
అనిల్ కుంబ్లే ఉండగా.. టెన్షన్ ఎందుకు దండగ: కేఎల్ రాహుల్