CPL 2020: 9 సిక్సర్లతో పొలార్డ్ విధ్వంసం.. ఓడే మ్యాచ్‌లో గెలిచిన నైట్ రైడర్స్!

ట్రినిడాడ్: వెస్టిండీస్ క్రికెటర్ కీరన్ పొలార్డ్ తన విశ్వరూపాన్ని చూపించాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) 2020 సీజన్‌లో భాగంగా డిఫెండింగ్ చాంపియన్స్ బార్బోడస్ ట్రిడెంట్స్ జట్టుతో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఈ ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ కెప్టెన్ 28 బంతుల్లోనే 72 పరుగులు చేసి భీభత్సం సృష్టించాడు. 9 సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. దాదాపు ఓటమి ఖాయమనుకున్న స్థితిలో కెప్టెన్ ఇన్నింగ్స్‌తో చెలరేగి రెండు వికెట్లతో ఉత్కంఠకర విజయాన్నందించాడు. లీగ్‌లో ఓటమెరుగని జట్టుగా జైత్రయాత్రను కొనసాగిస్తున్న నైట్‌రైడర్స్.. టేబుల్ టాపర్‌గా కొనసాగుతుంది. అన్ని విభాగాల్లో సమష్టిగా ఉన్న ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లోనూ గెలిచింది.

రాణించిన చార్లెస్, మేయర్స్..
ఆధ్యాంతం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బార్బోడస్ ట్రిడెంట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 148 రన్స్ చేసింది. జాన్సన్ చార్లెస్(37 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 47), కైల్ మేయర్స్(37 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్స్‌తో 42) రాణించారు. చివర్లో అష్లే నర్స్(9 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 19), రషీద్ ఖాన్ (6 బంతుల్లో 1 ఫోర్ 1 సిక్స్‌తో 12) ధాటిగా ఆడారు. ప్రత్యర్థి బౌలర్లలో అకీల్ హోసీన్, జయ్‌దెన్ సీల్స్, సికిందర్ రాజా రెండేసి వికెట్లు తీయగా.. ఫవాద్ అహ్మద్ ఓ వికెట్ పడగొట్టాడు.

62కే 5 వికెట్లు..
148 పరుగుల సాధారణ లక్ష్యచేధనకు దిగిన నైట్‌రైడర్స్ తడబడింది. ఓపెనర్ లెండీ సిమ్మన్స్(29 బంతుల్లో 3 సిక్సర్లతో 32) ఫర్వాలేదనిపించినా.. ఇతర బ్యాట్స్‌మెన్ వెబ్ స్టర్(5), కొలిన్ మున్రో(0), డారెన్ బ్రావో(6), సీఫెర్ట్(4) అకీల్ హోసీన్(12) దారుణంగా విఫలమయ్యారు. దీంతో నైట్‌రైడర్స్ 62 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ స్థితిలో నైట్ రైడర్స్ విజయానికి 44 బంతుల్లో 87 రన్స్ అవసరం. ఈ నెమ్మదైన పిచ్‌పై పరుగులు తీయడానికి బ్యాట్స్‌మెన్ కష్టపడుతున్న తరుణంలో నైట్ రైడర్స్ విజయం అసాధ్యం.
పొట్టుపొట్టు ఆడిన పొలార్డ్
కానీ ఈ క్లిష్ట స్థితిలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కీరన్ పొలార్డ్(28 బంతుల్లో 2 ఫోర్లు, 9 సిక్స్‌లతో 72)ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఓవైపు సిమ్మన్స్, సికిందర్ రాజా ఔటైనా.. మరోవైపు తన మెరుపు బ్యాటింగ్‌తో జట్టును విజయం ముంగిట నిలిపాడు. ఆఖరి ఓవర్‌లో నైట్ రైడర్స్ విజయానికి 16 పరుగులు అవసరం కాగా.. రీఫర్ వేసిన తొలి బంతిని పొలార్డ్ భారీ సిక్సర్ కొట్టాడు.

దోబుచులాడిన విజయం..
దీంతో నైట్ రైడర్స్ విజయం ఖాయమని అనుకున్నారంతా.. కానీ మరుసటి బంతికే పొలార్డ్ రనౌట్ కావడంతో బార్బోడాస్ ట్రిడెంట్స్ శిబిరంలో ఆశలు రెకెత్తాయి. అనంతరం క్రీజులోకి వచ్చిన సీల్స్ సింగిల్ తీసి పిర్రేకు స్ట్రైక్ ఇచ్చాడు. నాలుగో బంతికి భారీ సిక్సర్ బాధిన పిర్రే.. అనంతరం సింగిల్ తీసి ఓ బంతి మిగిలుండగానే విజయాన్నందించాడు. 19.5 ఓవర్లలో నైట్ రైడర్స్ 8 వికెట్ల నష్టానికి 148 రన్స్ చేసి 2 వికెట్లతో విజయాన్నందుకుంది. విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విజయంలో కీలక పాత్ర పోషించిన పొలార్డ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
దారుణ హత్యకు గురైన సురేశ్ రైనా మామ.. అందుకే ఐపీఎల్‌కు దూరం!