CPL 2020: చెలరేగిన బ్రావో బ్రదర్స్.. నైట్‌రైడర్స్ సూపర్ విక్టరీ!

ట్రినిడాడ్: కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) 2020 సీజన్‌లో కీరన్ పొలార్డ్ నేతృత్వంలోని ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ జట్టు జైత్రయాత్ర కొనసాగుతుంది. ఒటమెరుగని జట్టుగా దూసుకెళ్తుంది. తాజాగా సెయింట్ లూసియా జౌక్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 23 పరుగులతో అద్భుత విజయాన్నందుకుంది. ఫలితంగా లీగ్‌లో ఆడిన 9 మ్యాచ్‌ల్లో గెలిచి టేబుల్ టాపర్‌గా సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది.

పొలార్డ్, డారెన్ బ్రావో మెరుపులు..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్.. డారెన్ బ్రావో(42 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 50) సూపర్ ఫిఫ్టీకి కెప్టెన్ పొలార్డ్(21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42) మెరుపు ఇన్నింగ్స్ తోడవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 175 రన్స్ చేసింది. టిమ్ సీఫెర్ట్(33), వెబ్‌స్టర్(20) కూడా రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో స్కాట్ కగ్లెజిన్ రెండు వికెట్లు తీయగా.. కెస్రిక్ విలియమ్స్, జహీర్ ఖాన్, డారెన్ సామీ తలో ఒక వికెట్ తీశారు.

మార్క్ దెయల్, ఫ్లెచర్ చెలరేగినా..
175 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సెయింట్ లూసియా జౌక్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 152 పరుగులే చేసి ఓటమిపాలైంది. మార్క్ దెయల్(40), ఆండ్రీ ఫ్లెచర్(42) రాణించినా.. మిగతా బ్యాట్స్‌మన్ మహ్మద్ నబీ(17), జడ్రాన్(12) విఫలమవడంతో పరాజయంపాలైంది. నైట్‌రైడర్స్ బౌలర్లలో పొలార్డ్ మూడు వికెట్లు తీయగా.. సీల్స్, బ్రావో రెండేసి వికెట్లు పడగొట్టారు.
ఫ్లెచర్ సిక్సర్.. అదరహో..
ఇక సెయింట్ లూసియా జౌక్స్ ఫస్ట్ డౌన్ బ్యాట్స్‌మన్ ఆండ్రి ఫ్లెచర్ కొట్టిన ఓ సిక్స్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. పొలార్డ్ వేసిన 14 ఓవర్ తొలి బంతిని.. ఫ్లెచర్ ఔట్‌సైడ్ లెగ్ దిశగా.. భారీ షాట్ ఆడాడు. బంతి వైడ్ లాంగాన్ ఫెన్స్ ధాటింది. అయితే భారీ షాట్ కొట్టిన ఫ్లెచర్ మళ్లీ బంతివైపు చూడకపోవడం గమనార్హం. ఈ సిక్స్ వీడియోను సెయింట్ లూసియా జౌక్స్ టీమ్.. ‘నో లుక్ సిక్స్.. ఫ్లెచర్ స్టైల్ షాట్'అనే క్యాప్షన్‌తో అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
Mumbai Indians సరికొత్త ప్రయోగం.. కరోనా కట్టడికి ఆటగాళ్లకు స్మార్ట్ రింగ్!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications