
చుక్కులు చూపించిన డ్వేన్ బ్రావో..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సెయింట్ లూసియా జౌక్స్‌కు డ్వేన్ బ్రావో(2/7) చుక్కలు చూపించాడు. షార్ట్ పిచ్, ఫుల్ లెంగ్త్, యార్కర్లతో బ్యాట్స్‌మన్‌ను ముప్పు తిప్పలు పెట్టాడు. రకీమ్ కార్న్‌వాల్(18) క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చిన బ్రావో.. రోస్టన్ చేజ్(7)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. రకీమ్ వికెట్‌తో టీ20ల్లో 500 వికెట్ల ఘనతను అందుకున్నాడు. అంతేకాకుండా సీపీఎల్‌లో 100 వికెట్లను తన ఖాతాలో సుకున్నాడు. ఓవైపు బ్రాడ్ మరోవైపు ఇతర బౌలర్లు చెలరేగడంతో లూసియా బ్యాట్స్‌మన్ పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు.
మెరిసిన అఫ్గాన్ సంచలనం..
పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్న స్థితిలో క్రీజులోకి వచ్చిన అఫ్గాన్ సంచలనం మహ్మద్ నబీ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. లీగ్ ఆరంభం నుంచి అదరగొడుతున్న ఆ అఫ్గాన్ ఆల్‌రౌండర్.. ఈ మ్యాచ్‌లో కూడా తన సూపర్ ఫామ్‌ను కొనసాగించాడు. 22 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్స్‌తో 30 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అయితే పిర్రే బౌలింగ్‌లో సెయింట్ లూసియా కెప్టెన్ డారెన్ సామీ ఎల్బీడబ్ల్యూ కాగా.. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో అంపైర్లు ఆటను నిలిపివేసారు. ఈ సమయానికి సెయింట్ లూసియా టీమ్ 17.1 ఓవర్లలో 6 వికెట్లకు 111 పరుగులు చేసింది.

ఖాతా తెరిచిన భారత ఆటగాడు..
సీపీఎల్ ఆడుతున్న తొలి భారత ఆటగాడిగా నిలిచిన ప్రవీణ్ తాంబే.. ఎట్టకేలకు ఈ మ్యాచ్‌లో చోటుదక్కించుకున్నాడు. గత మూడు మ్యాచ్‌ల్లో బెంచ్‌కే పరిమితమైన ఈ ఇండియన్ ప్లేయర్.. ఈ మ్యాచ్‌లో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. వర్షం కారణంగా ఒకే ఓవర్ వేసినా... వికెట్ తీసి ఖాతా తెరిచాడు. ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ నజ్బుల్లా జడ్రాన్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఇక నైట్ రైడర్స్ బౌలర్లలో ప్రవీణ్ తాంబేతో పాటు అలీ ఖాన్, పిర్రే, ఫవాద్ అహ్మద్ తలో వికెట్ తీశారు. బ్రావోకు రెండు వికెట్లు దక్కాయి.

కుదించిన లక్ష్యం..
వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం నైట్‌రైడర్స్ లక్ష్యాన్ని 9 ఓవర్లలో 72 పరుగులకు కుదించారు. ఇక చేజింగ్‌కు దిగిన నైట్ రైడర్స్ టీమ్ 8 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసి ఘనవిజయాన్నందుకుంది. ఓపెనర్లు సిమ్మన్స్(0), వెబెస్టెర్(5) విఫలమైనా.. మున్రో(17), డారెన్ బ్రావో(23 నాటౌట్), సీఫెర్ట్(15 నాటౌట్) రాణించారు. కెస్రిక్ విలియమ్స్ రెండు వికెట్లు తీయగా.. హోల్డర్, నబీ తలో వికెట్ తీశారు.
CPL 2020: చిక్కుల్లో పాక్ ఆటగాడు.. ఔటైన కోపంలో బ్యాట్‌తో బౌలర్‌పై దాడి! (వీడియో)


Click it and Unblock the Notifications












