CPL 2020: పాపం జమైకా.. రస్సెల్ చెలరేగినా తప్పని ఓటమి!

ట్రినిడాడ్: కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) 2020 సీజన్‌లో ఓవైపు ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ విజయాలతో దూసుకెళ్తుంటే.. మరొవైపు జమైకా తల్లవాస్ వరుస పరాజయాల పాలవుతుంది. ఆ జట్టు విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఆండ్రూ రస్సెల్ చెలరేగినా విజయాన్ని అందుకోలేకపోతుంది. మంగళవారం ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆండ్రూ రస్సెల్ (23 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో విరవిహారం చేసినా.. జమైకా తల్లవాస్‌కు విజయాన్నందించలేకపోయాడు.
నైట్ రైడర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో తల్లవాస్ 19 పరుగులతో ఓటమిపాలైంది. లీగ్‌లో నైట్ రైడర్స్ 7 మ్యాచ్‌లకు 7 విజయాలతో టేబుల్ టాపర్‌గా దూసుకెళ్తుండగా.. తల్లవాస్ 4 పరాజయాలతో నాలుగో స్థానంలో ఉంది.

చెలరేగిన మున్రో, పొలార్డ్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 184 రన్స్ చేసింది. ఓపెనర్లు లెండి సిమ్మన్స్(25), సునీల్ నరైన్(11 బంతుల్లో 29) శుభారంభం అందించగా.. మున్రో(54 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌తో 65) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. వీరికి తోడుగా చివర్లో కెప్టెన్ కీరన్ పొలార్డ్(16 బంతుల్లో 33 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో నైట్‌రైడర్స్ ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. జమైకా బౌలర్లలో కార్లోస్ బ్రాత్‌వైట్ 2 వికెట్లు తీయగా.. ఫిడెల్ ఎడ్వర్డ్స్, సందీప్ లమిచ్చనే తలో వికెట్ తీశారు.

ఫస్ట్ బాల్‌కే షాక్..
ఇక 185 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన తల్లవాస్‌కు తొలి బంతికి గట్టి షాక్ తగిలింది. అకీల్ వేసిన ఫస్ట్ బాల్‌కే ఓపెనర్ వాల్టన్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. మరో ఓపెనర్ ఫిలిప్స్(41), బోన్నర్(26) రాణించినా.. బ్లాక్‌వుడ్(12), కెప్టెన్ పోవెల్(2) విఫలమయ్యారు. చివర్లో బ్రాత్‌వైట్(21 నాటౌట్) సాయంతో రస్సెల్ చెలరేగినా.. ఫలితం లేకపోయింది. ప్రత్యర్థి బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో.. తల్లవాస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 165 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. నైట్ రైడర్స్ బౌలర్లలో అకిల్ హుస్సేన్, పిర్రే, నరైన్, డ్వేన్ బ్రావో తలో వికెట్ తీయగా.. ఫవాద్ అహ్మద్ రెండు వికెట్లు తీసాడు. విజయంలో కీలక పాత్ర పోషించిన మున్రోకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

అందుకే నరైన్ దూరం..
వెస్టిండీస్ స్పిన్నర్ సునీల్ నరైన్ కిడ్నీ స్టోన్స్ సమస్యతోనే సీపీఎల్‌లో నైట్ రైడర్స్ ఆడిన గత మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడని ఆ జట్టు కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ తెలిపాడు. ఈ మ్యాచ్ సందర్భంగా లీగ్ అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన మెక్ కల్లమ్.. సునీల్ నరైన్ కిడ్నీ స్టోన్స్ సమస్యతో బాధపడ్డాడని, వాటిని తొలగించడంతో మళ్లీ జట్టులోకి వచ్చాడని తెలిపాడు.
'సునీల్ నరైన్ కిడ్నీ స్టోన్స్ సమస్యతో బాధపడ్డాడు. దాంతో వైద్యులు వాటిని తొలగించారు. అప్పటి నుంచి నరైన్ బాగున్నాడు. నిన్న అతనికిష్టమైన ఫుట్‌బాల్ కూడా ఆడాడు. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాలనే లక్ష్యంతోనే ఈ రోజు మ్యాచ్ బరిలోకి దిగాడు. మనం కూడా అతని నుంచి గొప్ప పెర్ఫామెన్స్ చూడాలని ఆశిద్దాం. ఈ సీజన్‌ను అతను అద్భుతంగా ప్రారంభించాడు. ముఖ్యంగా ఇలాంటి పిచ్‌లపై అతను చెలరేగుతాడని మనందరికి తెలిసిందే'అని మెక్‌కల్లమ్ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో నరైన్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. 11 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 29 పరుగులు చేసి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
‘కిట్' స్పాన్సర్ల విషయంలో బీసీసీఐకి గట్టి షాక్!