బోరు కొట్టే డ్రాలు ఉండవిక... ఉత్కంఠకరమైన డ్రాలే: కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్: వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. రాబోయే రెండేళ్లు జరగనున్న ఈ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్ జట్లు తలపడుతాయి.
మొత్తం 27 సిరీసుల్లో ఆయా జట్లు మొత్తం 71 టెస్టులు ఆడనున్నాయి. కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ప్రస్తుతం వెస్టిండిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో టీమిండియా అద్భుత ప్రదర్శన చేస్తోంది. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా నార్త్ సౌండ్‌లో సర్ వివ్ రిచర్డ్స్ స్టేడియంలో విండిస్‌తో గురువారం నుంచి తొలి టెస్టు మ్యాచ్ ఆరంభం కానుంది.
యాషెస్ సిరిస్ వల్లే: గంగూలీ అభిప్రాయానికి మద్దతు పలికిన భజ్జీ
ఈ మధ్య కాలంలో టెస్టు క్రికెట్‌లో పోటీ రెండింతలైందని కోహ్లీ అన్నాడు. ఈ సందర్భంగా కోహ్లీ మాట్లాడుతూ "క్రికెట్ గేమ్‌లో మరింత పోటీ పెరిగింది. ఇది టెస్టు క్రికెట్‌కు ఓ ఉద్దేశం తీసుకొచ్చింది. సరైన సమయంలో సరైన చర్య" అని సోమవారం విండిస్ ప్లేయర్ల అసోయేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో అన్నాడు.

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా నార్త్ సౌండ్‌లో సర్ వివ్ రిచర్డ్స్ స్టేడియంలో విండిస్‌తో గురువారం నుంచి తొలి టెస్టు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ సందర్భంగా కోహ్లీ మాట్లాడుతూ "క్రికెట్ గేమ్‌లో మరింత పోటీ పెరిగింది. ఇది టెస్టు క్రికెట్‌కు ఓ ఉద్దేశం తీసుకొచ్చింది. సరైన సమయంలో సరైన చర్య" అని సోమవారం విండిస్ ప్లేయర్ల అసోయేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో అన్నాడు.

వెస్టిండిస్ పర్యటనతో టెస్టు చాంపియన్‌షిప్
ఐసీసీ ప్రతిషాత్మకంగా ప్రవేశపెట్టిన టెస్టు చాంపియన్‌షిప్‌ను టీమిండియా వెస్టిండిస్ పర్యటనతో ప్రారంభించనుంది. టెస్టు చాంపియన్‌షిఫ్‌లో భాగంగా ఇకపై టీమిండియా ప్రతి టెస్టు ఎంతో కీలకం. టెస్టు చాంపియన్ షిప్‌లో భాగంగా 2021 జూన్ వరకు పాయింట్ల పట్టికలో ఒకటి, రెండు స్థానాల్లో నిలిచిన జట్లు లార్డ్స్ వేదికగా ఫైనల్ మ్యాచ్ ఆడతాయి.

వారి బౌలింగ్ స్థాయికి తగినట్టు
వెస్టిండిస్ గడ్డపై విండిస్ బౌలర్లు అద్భుత ప్రదర్శన చేస్తారు. వారి బౌలింగ్ స్థాయికి తగినట్టు ఆడాల్సిన బాధ్యత బ్యాట్స్‌మెన్‌కు ఉందని కోహ్లీ తెలిపాడు. "మా బ్యాట్స్‌మెన్ ఆ స్థాయికి సరిపోతారని అనుకోను. టెస్టుల్లో బ్యాట్స్‌మన్‌షిప్ అనేది చాలా కష్టం. ఛాంపియన్‌షిప్‌తో అది మరింత కష్టం. జట్టుగా కష్టపడాలి. ప్రతి ఒక్కరూ తీసుకొనే ప్రతి నిర్ణయం ఎంతో కీలకమే" అని కోహ్లీ అన్నాడు.

కోహ్లీ మరో అరుదైన రికార్డు
ఇదిలా ఉంటే, ఈ టెస్టు సిరిస్‌లో విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డుని చేరువయ్యాడు. కోహ్లీ ఒక్క సెంచరీని సాధిస్తే ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేరిట ఉన్న రికార్డును సమం చేస్తాడు. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించిన కెప్టెన్ రికీ పాంటింగ్(19) సమం చేస్తాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ 18 సెంచరీలతో పాంటింగ్ తరువాతి స్థానంలో కొనసాగుతున్నాడు.
క్రికెటర్ శ్రీశాంత్‌కు భారీ ఊరట: జీవితకాల నిషేధం ఎత్తివేత

టెస్టుల్లో 25 సెంచరీలు నమోదు చేసిన కోహ్లీ
ఈ జాబితాలో సఫారీ మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్(25) తొలి స్థానంలో ఉన్నాడు. కోహ్లీ విషయానికి వస్తే టెస్టుల్లో మొత్తం 25 సెంచరీలు నమోదు చేశాడు. ఇందులో కెప్టెన్‌గా 18 సెంచరీ సాధించాడు. ఇక విండిస్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తే టీమిండియాకు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా ధోని రికార్డును విరాట్ కోహ్లి బద్దలు కొడతాడు. కోహ్లీ 46 టెస్టులకు కెప్టెన్సీ వహించగా 26 మ్యాచ్‌ల్లో టీమిండియా విజయం సాధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications