For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్‌లో హిందీ గోల.. కామెంటేటర్‌పై పెల్లుబికిన ఆగ్రహం

Commentator faces criticism for calling Hindi as mother tongue of all Indians

బెంగళూరు: ప్రతిష్టాత్మక రంజీట్రోఫీలో భాగంగా కర్ణాటక-బరోడా జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో అత్యుత్సాహం ప్రదర్శించిన ఓ హిందీ కామెంటేటర్‌పై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. బెంగళూరు వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌ హాట్‌స్టార్ వేదికగా ప్రత్యక్ష ప్రసారమైంది. అయితే ఈ మ్యాచ్ హిందీ వర్షన్ కామెంటేటర్స్ నోరుజారి అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు. తీవ్ర దుమారం రేగిన ఈ వ్యవహారంతో ఈ కామెంటేటర్స్‌పై బీసీసీఐ వేటు వేసింది.

ఇంతకేం జరిగిందంటే..

రంజీ ట్రోఫీ ఫైనల్ రౌండ్‌లో భాగంగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గురువారం హిందీ వర్షన్ కామెంటేటర్ మాట్లాడుతూ.. ప్రతీ భారతీయుడికి హిందీ తప్పనిసరి తెలియాలని, హిందీ భారతీయుల మాతృభాషని వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా హిందీ కన్నా గొప్ప భాష మరేది లేదన్నాడు. ఈ వ్యాఖ్యలకు నొచ్చుకున్న ఓ సెక్షన్ ఆఫ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే హిందీ భాష వ్యవహారం రాజకీయంగా తీవ్రదుమారం రేపిన సందర్భంలో కామెంటేటర్ హిందీ భాషపై ఈ తరహా కామెంట్స్ చేయడం అగ్గి ఆజ్యం పోసినట్లైంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రల ఫ్యాన్స్ సదరు కామెంటేటర్‌పై దుమ్మెత్తి పోస్తున్నారు. బరోడా రెండో ఇన్నింగ్స్ సందర్భంగా.. సునీల్ గావస్కర్ హిందీలో కామెంట్రీ చేయడంపై మాట్లాడే సందర్భంగా సదరు కామెంటేటర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ కామెంట్స్‌కు సహచర కామెంటేటర్ కూడా మద్దతు పలికాడు. దీంతో ఇద్దరిపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఫోర్‌‌ డే టెస్ట్ మ్యాచ్‌లు‌ పనికొస్తాయా? ఐసీసీ ఏం నిర్ణయం తీసుకోబోతుంది?

మాతృ భాషని ఎవరు చెప్పారు?

‘హిందీ భారతీయుల మాతృభాషని ఎవరు చెప్పారు? మీ భాషను ప్రజలపై రుద్దడం ఆపండి'అని కొందరు.. ఆఖరికి ఆటలను కూడా వదలడం లేదా? అని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. కొంచెం చదువుకున్నోళ్లను కామెంటేటర్లుగా పెట్టండయ్యా? అంటూ మరొకొందరూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

క్షమాపణలు చెప్పిన కామెంటేటర్స్..

తమ వ్యాఖ్యల పట్ల తీవ్ర దుమారం రేగడంతో తప్పును తెలుసుకున్న సదరు కామెంటేర్స్ క్షమాపణలు తెలిపారు. తాము అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందోనని కూడా వివరణ ఇచ్చుకున్నారు. ఇక బీసీసీఐ, స్టార్ట్ స్పోర్ట్స్ ఈ ఇద్దరిపై వేటు వేసింది.

ఆధిక్యంలో కర్ణాటక..

ఆధిక్యంలో కర్ణాటక..

ఈ మ్యాచ్‌లో కర్ణాటక ఆధిక్యంలో నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన బరోడాను ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 85 పరుగులకే ఆలౌట్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో 233 పరుగులకు ఆలౌటై 148 పరుగుల లీడ్ అందుకుంది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బరోడా 51 ఓవర్లలో 4 వికెట్లకు 168 పరుగులు చేసి నిలకడగా ఆడుతోంది.

Story first published: Thursday, February 13, 2020, 16:21 [IST]
Other articles published on Feb 13, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+