రోహిత్ కంటే కోహ్లీకే సెంచరీ చేసే ఛాన్స్ ఎక్కువ: పుజారా
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు వన్డే సిరీస్‌కు సిద్దమైంది. హామిల్టన్ వేదికగా బుధవారం జరిగే వన్డేతో ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌తో టీమిండియా వెటరన్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు పునరాగమనం చేయనున్నారు.
అయితే ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ కంటే విరాట్ కోహ్లీకే సెంచరీలు చేసే అవకాశం ఎక్కువ అని టీమిండియా మాజీ క్రికెటర్ చతేశ్వర్ పుజారా అభిప్రాయపడ్డాడు. రోహిత్ శర్మ ఓపెనర్‌గా దూకుడుగా ఆడాల్సి ఉంటుందని, ఫస్ట్ డౌన్‌లో వచ్చే కోహ్లీ యాంకర్ పాత్ర పోషించాల్సి ఉంటుందని చెప్పుకొచ్చాడు.

'రోహిత్ శర్మ ఓపెనర్‌గా పవర్ ప్లేలో దూకుడుగా ఆడాల్సి ఉంటుంది. న్యూజిలాండ్ పర్యటనలోనూ అతని పాత్రలో మార్పు ఉండకపోవచ్చు. కానీ అతను సెంచరీ కోసం ప్రయత్నిస్తాడని అనుకుంటున్నా. అయితే రోహిత్ శర్మతో పోలిస్తే విరాట్ సెంచరీ అవకాశాలు ఇంకాస్త మెరుగ్గా ఉంటాయి. ఎందుకంటే విరాట్ కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడు. ఎక్కువగా యాంకర్ పాత్ర పోషించాలి. ఈ స్థానంలో ఆడే బ్యాటర్ సెంచరీలను చేయడం కాస్త సులువు. న్యూజిలాండ్‌లో పిచ్ పరిస్థితులను బట్టి ఓపెనర్లు కూడా తమ బ్యాటింగ్ శైలిని మార్చుకోవాల్సి ఉంటుంది. దూకుడుగా ఆడేస్తామంటే కుదరదు.
ఈ వన్డే సిరీస్‌లో భారత్ కంటే న్యూజిలాండ్‌కే అడ్వాంటేజ్ ఎక్కువ. అక్కడి పరిస్థితులు ఆ జట్టుకు అనుకూలంగా ఉంటాయి. మరోవైపు ఐదు వన్డేల్లో తొలి మూడు మ్యాచ్‌లను టీమిండియా ఒక జట్టుతో ఆడుతోంది. ఆ తర్వాత రెండింట్లో మరో జట్టుతో బరిలోకి దిగుతోంది. అయితే తొలి మూడు మ్యాచ్‌ల్లోనే భారత్ దూకుడుగా ఆడేసి సిరీస్‌లో పైచేయి సాధిస్తారని ఆశిస్తున్నా. తప్పకుండా ఈ సిరీస్ హోరాహోరీగా ఉండటం ఖాయం. మరోవైపు వర్షం కూడా ఈ సిరీస్‌పై ప్రభావం చూపించనుంది. కచ్చితంగా ఒక మ్యాచ్ రద్దు అయ్యే అవకాశం ఉంది.'అని పుజారా వ్యాఖ్యానించాడు.
తొలి మూడు వన్డేలకు భారత్ జట్టు:
శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, నమన్ ధీర్, అన్షుల్ కాంబోజ్, గుర్నూర్ బ్రార్, రుతురాజ్ గైక్వాడ్, అర్ష్‌దీప్ సింగ్, ఇషాన్ కిషన్, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి(తొలి వన్డేకు మాత్రమే), ఆకిబ్ నబీ.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


