For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంకొన్నేళ్లు ఐపీఎల్ ఆడనున్న ధోనీ, రైనా.. ప్రాక్టీస్ వీడియోను షేర్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్!

Chennai super kings share Dhoni, Raina praticing video from chepak

చెన్నై: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, వెటరన్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా శనివారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అయితే ఈ దిగ్గజ ఆటగాళ్లు ఐపీఎల్ విషయంపై మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ ధోనీ, రైనా ఇంకొన్నాళ్లు ఐపీఎల్‌ ఆడుతారని వారి సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఇద్దరు ఆటగాళ్లు చెన్నై సూపర్ కింగ్స్.. చెన్నై వేదికగా నిర్వహిస్తున్న ప్రాక్టీస్ క్యాంప్‌లో పాల్గొన్నారు. దీన్ని బట్టి చూస్తే ధోనీ, రైనా ఐపీఎల్‌లో మరికొన్నేళ్లు కొనసాగుతారనే విషయం స్పష్టం అవుతుంది. ఇది వారి అభిమానులకు ఊరటనిచ్చే విషయమే.

ముమ్మరంగా ప్రాక్టీస్..

ఇక శనివారం ప్రారంభమైన ఈ ప్రాక్టీస్ క్యాంప్.. ఆదివారం కూడా కొనసాగింది. ఈ ప్రాక్టీస్‌ సెష‌న్‌కు సంబంధించిన వీడియోను సీఎస్‌కే అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోలో ఆటగాళ్లు తమ ప్రాక్టీస్ ముగించుకొని హోటల్‌కు పయనమవుతున్నారు. ఈ సందర్భంగా క్యాంప్ పర్యవేక్షకుడు, సీఎస్‌కే బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ రైనాను అప్యాయంగా కౌగిలించుకోగా.. రైనా.. ధోనీకి హగ్ ఇచ్చాడు. ఇతర ఆటగాళ్లు ఈ దిగ్గజాలకు అభినందనలు తెలిపారు. ఈ సన్నివేశాలను చూస్తే శనివారం ప్రాక్టీస్ సెషన్‌ ముగిసిన తర్వాత, రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించిన అనంతరం తీసిన వీడియోగా అర్థమవుతుంది.

చెన్నై భావోద్వేగం..

ఇక గత 12 ఏళ్లుగా ధోనీ, రైనా ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆడుతున్నారు. ఈ ఇద్దరికి తమిళనాడు వ్యాప్తంగా పిచ్చ క్రేజ్ ఉంది. వారంత ధోనీని తాల, రైనాను చిన్న తాలగా పిలుచుకుంటారు. తాల అంటే పెద్దన్న అని అర్థం. ఇక తమ ఆటగాళ్లు ఇద్దరు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడం పట్ల చెన్నై సూపర్ కింగ్స్ భావోద్వేగానికి గురైంది. ట్విటర్ వేదికగా ఈ ఇద్దరికి ఘన వీడ్కోలు తెలిపింది.

‘73'వీడ్కోలు..

‘73'వీడ్కోలు..

‘స్వాతంత్ర్య దినోత్సవం.. సూర్యస్తమయం.. దేశ దక్షిణ ప్రాంతమైన చెపాక్ వేదికగా దిగ్గజ ఆటగాళ్లు తమ ఆటకు అల్విదా ప్రకటించారు. #73Forever #Thala #ChinnaThala Lion faceLion face'అనే యాష్ ట్యాగ్‌లతో ట్వీట్ చేసింది. అలాగే మరో ట్వీట్‌లో‘73'కు వీడ్కోలు పలకడం. భారత్‌ 73 ఏళ్ల స్వాతంత్య్రాన్ని పూర్తి చేసుకుంది'అనే అర్థంలో ట్వీట్ చేసింది. ఇక భారత్ తరఫున ధోనీ 7' నెంబర్‌ జెర్సీ, రైనా '3' నెంబర్‌ జెర్సీతో బరిలోకి దిగిన విషయం తెలిసిందే.

 21న దుబాయ్ పయనం..

21న దుబాయ్ పయనం..

ఇక యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనుండగా.. ప్రాక్టీస్ క్యాంప్ అనంతరం చెన్నై ఆగస్టు 21న దుబాయ్‌కు వెళ్లనుంది. బీసీసీఐ నిబంధనల ప్రకారం దుబాయ్‌కు వెళ్లేముందు రెండు సార్లు.. అక్కడికి చేరుకున్న తర్వాత మొదటి రోజు, మూడో రోజు, ఆరో రోజు కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ టెస్ట్‌ల్లో నెగటీవ్ వస్తే బయోబబుల్ వాతావరణంలో మ్యాచ్‌లు ఆడేందుకు అనుమతిస్తారు. ఇక టోర్నీ జరుగుతున్నంత కాలం ఐదు రోజులకోసారి బయోబబుల్‌లో ఉన్నందరికి పరీక్షలు నిర్వహిస్తారు.

బాలేదు ధోనీ.. ఇది ఏ మాత్రం బాలేదు!

Story first published: Sunday, August 16, 2020, 13:27 [IST]
Other articles published on Aug 16, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+