ముస్తాక్ అలీ టోర్నీ ఉండగా.. వీదేశీ ప్లేయర్లు లేకుండా ఐపీఎల్ ఎందుకు దండగా?

ముంబై: కరోనా వైరస్ కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 సీజన్ నిరవధికంగా వాయిదాపడిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఈ క్యాష్ రిచ్ లీగ్ జరుగుంటే ఈ పాటికి తుది దశకు చేరుకునేది. కానీ ఏం చేస్తాం.. చెనా నుంచి వచ్చిన కరోనా గత్తర ప్రపంచాన్నే ఆగమాగం చేసింది. ఈ మహమ్మారి పీడ వదిలించుకోవడానికి దేశాలన్నీ లాక్ డౌన్ పాటించాయి.
దీంతో ఐపీఎల్ నిరవధికంగా వాయిదా వేయాల్సిన పరిస్థితి తప్పలేదు. ప్రస్తుతం దేశంలో కొన్ని సడలింపులతో కూడిన లాక్‌డౌన్ అమలవుతుండటంతో ఐపీఎల్ నిర్వహణపై కూడా అనేక వార్తలు వస్తున్నాయి. ప్రేక్షకుల్లేకుండా క్రికెట్ టోర్నీలు నిర్వహించాలనే చర్చ కూడా అంతర్జాతీయ వేదికంగా జరగుతుంది. ఈ క్రమంలో ఖాళీ మైదానాల్లో ఐపీఎల్ నిర్వహిద్దామన్నా.. విదేశీ ఆటగాళ్ల రాక సమస్యగా మారనుంది.

భారత ఆటగాళ్లతోనే ఐపీఎల్..
ఈ నేపథ్యంలో వీదేశీ ఆటగాళ్లు లేకుండా కేవలం భారత ఆటగాళ్లతో ఐపీఎల్ నిర్వహించాలనే ప్రతిపాదన కూడా వచ్చింది. అయితే ఈ ప్రతిపాదనపై ఐపీఎల్ ఫ్రాంచైజీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ సీఈఓ ధీరజ్ మల్హోత్ర ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ ఐడియాను ముందుకు తీసుకువచ్చాడు. అయితే దీనికి కొందరు అంగీకరిస్తుండగా.. మరికొందరు తీసిపారేస్తున్నారు.

వ్యతిరేకించిన చెన్నై..
ఈ ఆలోచనను చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) వ్యతిరేకించింది. అలా నిర్వహిస్తే అది ఐపీఎల్ ఎందుకవుతుందని, ముస్తాక్ అలీ(దేశవాళీ టీ20 పోటీలు) ట్రోఫీలా ఉంటుందని ఆ ఫ్రాంచైజీకి చెందిన ఓ అధికారి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. "కేవలం భారత ప్లేయర్లతోనే ఐపీఎల్ నిర్వహించే విషయంపై సీఎస్‌కే ఆసక్తిగాలేదు. మరో ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడినట్టు ఉంటుంది. ప్రస్తుతం పరిస్థితులు తీవ్రంగానే ఉన్న కారణంగా బీసీసీఐతో ఫ్రాంచైజీ ఏమీ మాట్లాడలేదు. ఈ ఏడాది చివర్లో ఐపీఎల్ జరుగుతందని మనం ఆశించొచ్చు" అని ఆ అధికారి చెప్పారు.

రాయల్స్‌కు ఓకే..
అయితే రాజస్థాన్ రాయల్స్ మాత్రం ఈ ఐడియాకు అంగీకరించినట్లు మల్హోత్ర తెలిపారు. మరిన్నీ ఫ్రాంచైజీలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపాడు. ఈ ఐడియాను భారత మాజీ ఓపెనర్, రెండుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న గౌతం గంభీర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది.
మరోవైపు షెడ్యూల్ ప్రకారం టీ20 ప్రపంచకప్ జరుగకుంటే ఈ ఏడాది సెప్టెంబర్ - అక్టోబర్ మధ్య ఐపీఎల్‌ను నిర్వహించే అవకాశాలున్నాయన్న అంచనాలు వెలువడుతున్నాయి.

తుది నిర్ణయం తీసుకోని బీసీసీఐ..
బీసీసీఐ మాత్రం ఐపీఎల్ నిర్వహణపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అలాగే ఈ ఏడాది ఐపీఎల్ జరుగకుంటే బీసీసీఐ సైతం ఆర్థిక ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. ఒకవేళ ఈ ఏడాది ఐపీఎల్ రద్దయితే బోర్డు రూ.4వేల కోట్లకు పైగా నష్టపోతుందని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ చెప్పారు.
అప్పులు తీర్చాలంటే ఆటంబాంబు అమ్ముకోవాలి: పాకిస్థాన్ మాజీ క్రికెటర్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications