Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Stephen Fleming:చెన్నై హెడ్ కోచ్‌గా స్టీఫెన్ ఫ్లెమింగ్ ఔట్..?

చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులకు స్టీఫెన్ ఫ్లెమింగ్ పేరు ఒక భావోద్వేగం. ధోనీ వ్యూహాలకు, ఫ్లెమింగ్ ఆలోచనలు తోడైతే ఐపీఎల్‌లో తిరుగుండదు అనేది ఇన్నేళ్ల చరిత్ర చెప్తున్న మాట. కానీ, ఇప్పుడు ఆ సుదీర్ఘ ప్రయాణం ముగింపు దశకు చేరుకుందా? అనే చర్చ క్రీడా వర్గాల్లో జోరందుకుంది.

ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కోచ్‌లలో స్టీఫెన్ ఫ్లెమింగ్ ఒకరు. 2008లో ఆటగాడిగా ప్రయాణం మొదలుపెట్టిన ఫ్లెమింగ్, 2009 నుంచి కోచ్‌గా బాధ్యతలు చేపట్టి చెన్నై సూపర్ కింగ్స్‌ను ఏకంగా 10 సార్లు ఫైనల్స్‌కు చేర్చారు. మధ్యలో రెండేళ్లు పూణే జట్టుకు కోచ్‌గా ఉన్నా, సీఎస్‌కే అంటే ఫ్లెమింగ్.. ఫ్లెమింగ్ అంటే సీఎస్‌కే అనేంతగా ఆ జట్టులో మమేకమైపోయారు. అయితే, ప్రస్తుతం సీఎస్‌కే శిబిరంలో పరిస్థితులు మారినట్లు కనిపిస్తున్నాయి.

chennai-super-kings-coach-stephen-fleming-era-nearing-end-concerns-rise-in-ipl

సవాలుగా మారిన చేపాక్ పిచ్

ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. సీఎస్కే కు పెట్టని కోటగా ఉన్న 'చేపాక్' మైదానంలో పిచ్ స్వభావం మారడం జట్టుకు పెద్ద మైనస్‌గా మారిందని వాన్ విశ్లేషించారు. గతంలో స్పిన్నర్లకు అనుకూలించే ఈ పిచ్, ఇప్పుడు పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా మారింది. ఇది సీఎస్‌కే బౌలర్లకు పెద్ద సవాలుగా పరిణమించింది. ప్రత్యర్థి జట్లు భారీ స్కోర్లు సాధిస్తుండటంతో, హోమ్ గ్రౌండ్‌లో సీఎస్‌కే ఆధిపత్యం తగ్గుతోందనే వాదన వినిపిస్తోంది.

ప్రయాణం ముగింపు దశకు చేరుకుందా?

గత 16 ఏళ్లుగా జట్టును వెనకుండి నడిపిస్తున్న ఫ్లెమింగ్, ఈ సీజన్‌లో జట్టును తిరిగి ఫామ్‌లోకి తీసుకురాకపోతే ఆయన పదవికి ముప్పు తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇక మెన్ ఇన్ ఎల్లో జట్టు వరుస ఓటములు కూడా ఫ్లెమింగ్‌పై ఒత్తిడి పెంచుతోంది. మరోవైపు ధోనీ జట్టులో లేకపోవడం మరింత కలవరపెడుతోంది.జట్టులో కొత్త రక్తం, కొత్త వ్యూహాలు అవసరమని మేనేజ్‌మెంట్ భావిస్తే, ఫ్లెమింగ్ సుదీర్ఘ ప్రయాణానికి ఈ ఏడాది ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో సీఎస్‌కే ప్లే ఆఫ్స్ చేరకపోతే,వచ్చే ఏడాది కొత్త కోచ్‌తో బరిలోకి దిగే ఛాన్స్ ఉందంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

ధోనీ-ఫ్లెమింగ్ జోడీ ఐపీఎల్‌లో ఒక అద్భుతమైన అధ్యాయం. అయితే కాలంతో పాటు మార్పులు సహజం. ఈ కీలక సీజన్‌లో ఫ్లెమింగ్ తన మార్క్ వ్యూహాలతో జట్టును మళ్ళీ టాప్‌లోకి తీసుకువస్తారా? లేక విమర్శకులు అన్నట్లుగా ఒక గొప్ప ప్రయాణానికి ఘనమైన వీడ్కోలు పలుకుతారా? అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా, సీఎస్‌కే చరిత్రలో ఫ్లెమింగ్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.

Story first published: Tuesday, April 7, 2026, 11:48 [IST]
Other articles published on Apr 7, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+