For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విదేశాల్లోనే ఐపీఎల్ 2020.. ప్రేక్షకులు లేనప్పుడు ఎక్కడ ఆడినా ఒకటే: లీగ్ ఛైర్మన్

Brijesh Patel says Coronavirus May Force IPL out of India
IPL 2020: BCCI Looking September-October Window But Out Of India

న్యూఢిల్లీ: కరోనా దెబ్బకు ఆగిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్( ఐపీఎల్‌) 2020 సీజన్‌ను మళ్లీ నిర్వహించేందుకు చర్యలు మొదలయ్యాయి. ఇన్నాళ్లు జరుగుతుందా లేదా అన్న సందేహాలతో ఊగిసలాడుతున్న లీగ్‌కు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ప్రకటన కొత్త ఊపిరి పోసింది. ప్రేక్షకుల్లేకుండా ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్‌ పోటీలు నిర్వహించేందుకైనా సిద్ధమేనని గంగూలీ సంకేతమిచ్చాడు.

భారత్‌లో కష్టమే..

భారత్‌లో కష్టమే..

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మెగాటోర్నీని భారత్‌లో నిర్వహించడం కష్టమనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. దేశంలో నెలకొన్న పరిస్థితులు ఇప్పట్లో అదుపులోకి వచ్చే అవకాశాలు కనిపించడంలేదు. రోజు రోజుకి పెరుగుతున్న కేసులు, మరణాల సంఖ్య ప్రజల్లో భయాందోళనలను కలిగిస్తోంది. సడలింపుల పేరిట లాక్‌డౌన్ ఏత్తేయడంతో పరిస్థితి పూర్తిగా అదుపుతప్పింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహించేందుకు ఆయా రాష్ట్రాలు ముందుకు వచ్చే అవకాశాలు కనబడటం లేదు.

ప్రేక్షకులు లేకుండా నిర్వహించినా.. వేగంగా విస్తరిస్తున్న మహమ్మారిని అడ్డుకోవడం కష్టమని, మ్యాచ్ నిర్వహించేందుకు సిబ్బందితో పాటు అధికారులు, పోలీసులు అవసరమని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు ఇతర దేశాల బోర్డులు కూడా ఆతిథ్యం ఇచ్చేందుకు తాము సిద్దమని ఆఫర్ ఇస్తున్నాయి. దీంతో ఐపీఎల్ జరిగినా విదేశాల్లోనే నిర్వహించే అవకాశం ఉందనే ప్రచారం ఊపందుకుంది.

అదే ఆలోచనలో బీసీసీఐ..

అదే ఆలోచనలో బీసీసీఐ..

ఇక ప్రేక్షకులే లేకుండా టోర్నీ జరపాలని భావిస్తే ఏ దేశంలో నిర్వహించినా ఒకటేనని లీగ్‌ చైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌ వ్యాఖ్యానించడం కూడా ఈ ప్రచారానికి బలాన్ని చేకూరుస్తుంది. గురువారం ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ ఏడాది సెప్టెంబరు-అక్టోబరులో ఐపీఎల్‌-13వ సీజన్‌ జరిగే అవకాశం ఉందన్నాడు. అయితే అంతకన్నా ముందు టీ20 ప్రపంచక్‌పపై ఐసీసీ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలన్నాడు.

‘ఐసీసీ అధికారిక ప్రకటన తర్వాత మేం ఐపీఎల్‌ షెడ్యూల్‌పై చర్చిస్తాం. మేమైతే సెప్టెంబరు-అక్టోబరు విండోను సిద్ధంగా ఉంచాం. అయితే సెప్టెంబరులో వర్షాలతో ఇబ్బంది ఉంటుంది కాబట్టి వేదికల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ లీగ్‌ను విదేశాలకు తరలించాల్సి వస్తే అందుకూ సిద్ధమే. అయితే ఎక్కడ జరిగినా మ్యాచ్‌లు మాత్రం రెండు, మూడు స్టేడియాలకే పరిమితమవుతాయి.' అని పటేల్‌ వివరించాడు.

శ్రీలంక, యూఏఈ రెడీ..

శ్రీలంక, యూఏఈ రెడీ..

ఇక ఐపీఎల్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు శ్రీలంక, యూఏఈ దేశాలు సిద్దంగా ఉన్నాయని బ్రిజేష్ పటేల్ తెలిపాడు. అయిత తమ తొలి ప్రాధాన్యత మాత్రం భారతేనని స్పష్టం చేశాడు. ‘మా తొలి ప్రాధాన్యంత భారత్. కానీ ఆ సమయంలో దేశంలో నెలకొనే పరిస్థితులపై ఆదారపడి ఉంటుంది. శ్రీలంక, యూఏఈలు ఆతిథ్యానికి రెడీగా ఉన్నాయి. చూద్దాం ఏక్కడ నిర్వహించాల్సి వస్తదో. ప్రేక్షకులు లేకుండా టోర్నీ జరపాలని భావిస్తే.. ఏ దేశంలో నిర్వహించినా ఒకటే'అని అన్నాడు.

షార్ట్ ఐపీఎల్..?

షార్ట్ ఐపీఎల్..?

ఇక ఐపీఎల్ లీగ్ కుదించే అవకాశం ఉందా? అని ప్రశ్నించగా.. అది కూడా పరిస్థితులపైనే ఆధారపడి ఉందన్నాడు. ‘మేం ఏప్పటిలానే నిర్వహించాలనుకుంటున్నాం. కానీ అది ఆసియా కప్, ప్రపంచక టోర్నీల వాయిదా నిర్ణయాలపై ఆధారపడి ఉంది. ఐపీఎల్ జరగడం బోర్డుతో పాటు స్పాన్సర్స్ బ్రాడ్ కాస్టర్స్, ఆటగాళ్లకు చాలా ముఖ్యం. ప్రతీ ఒక్కరు జరగాలనే కోరుకుంటున్నారు. ఐపీఎల్‌లో ఆడాలని ఆటగాళ్లంతా ఉవ్విళ్లురుతున్నారు. ప్రేక్షకుల్లేకుండా ఐపీఎల్ నిర్వహించినా ప్రపంచకప్‌ను నిర్వహించలేం. మెగా టోర్నీ నిర్వహణపై త్వరలోనే ఐసీసీ నిర్ణయం తీసుకుంటుంది.'అని పటేల్ చెప్పుకొచ్చాడు.

ఒక్క బంతికే 17 పరుగులు.. పాక్‌పై సెహ్వాగ్ అరుదైన రికార్డు!

Story first published: Friday, June 12, 2020, 15:00 [IST]
Other articles published on Jun 12, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+