Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సూర్యకుమార్ యాదవ్‌ను ఆసీస్ టూర్‌కు ఎందుకు ఎంపిక చేయలేదు: బ్రియాన్ లారా

Brian Lara says See no reason why Suryakumar Yadav can’t be part of Indian squad
Suryakumar Yadav Reveals Conversation With Virat Kohli After On-Field Stare-Off IPL 2020

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2020 సీజన్‌లో అద్భుత ప్రదర్శనతో జట్టు చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించిన ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్‌కు భారత సెలెక్టర్లు మొండి చెయ్యి చూపించిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా టూర్‌కు సూర్యను ఎంపిక చేయకపోవడాన్ని ప్రస్తావిస్తూ ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు భారత సెలెక్షన్ కమిటీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత మూడు సీజన్లుగా అద్భుతంగా ఆడుతున్నా.. అవకాశం ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. ఈ వ్యవహరం తీవ్ర దుమారం రేపింది. అయితే తాజాగా వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా కూడా సూర్యను ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నించాడు. అతన్ని పక్కకు పెట్టడానికి గల కారణమే లేదన్నాడు.

సెలెక్ట్ అవ్వాల్సింది..

సెలెక్ట్ అవ్వాల్సింది..

స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో పాల్గొన్న లారా.. సూర్య కుమార్‌ యాదవ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. ముంబై ఇండియన్స్‌లో సూర్య పోషించిన పాత్ర చాలా కీలకమని కొనియాడాడు. ‘నంబర్ 3లో సరిగ్గా సరిపోయే ఆటగాడు సూర్య. సాధారణంగా ఏ జట్లలో‌నైనా నంబర్ ఆటగాడు ఉత్తమమైన ఆటగాడే. ముంబై ఇండియన్స్ తరఫున సూర్య అదరగొట్టాడు. అయితే అతన్ని భారత జట్టులోకి ఎందుకు తీసుకోలేదో నాకు అర్థం కాలేదు. అతన్ని పక్కన పెట్టడానికి గల కారణం కూడా తెలియదు. సూర్య ఎంపికవ్వాల్సింది'అని లారా చెప్పుకొచ్చాడు.

తీవ్ర ఒత్తిడిలో..

తీవ్ర ఒత్తిడిలో..

అలాగే సూర్య ఓ క్లాస్ ప్లేయరని, అతను చేసిన పరుగులను చూసి ఈ మాట చెప్పడం లేదని, సూర్య బ్యాటింగ్ టెక్నిక్, సామర్థ్యాన్ని చూసి అంటున్నానని లారా చెప్పుకొచ్చాడు. ‘సూర్య క్లాస్ ప్లేయర్. అతను చేసిన పరుగులను చూసి ఈ మాట చెప్పడం లేదు. అతని టెక్నిక్, ఒత్తిడిలో ఆడగలిగే సామర్థ్యాన్ని చూసి చెబుతున్నా. ముంబై తరఫున అతను పోషించిన పాత్ర కీలకం. రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్‌ల తర్వాత తీవ్ర ఒత్తిడిలో అతను బ్యాటింగ్ చేశాడు. ప్రతీసారి ఇలానే ఆడాడు.'అని లారా కొనియాడాడు.

నిరాశ చెందా..

నిరాశ చెందా..

గత మూడేళ్లుగా ఐపీఎల్‌లో 400కు పైగా పరుగులతో నిలకడగా రాణించినా సూర్య‌కు భారత జట్టులో అవకాశం దక్కలేదు. అయితే ఆస్ట్రేలియా టూర్‌కు ఎంపిక కాకపోవడంతో తాను తీవ్రంగా నిరాశ చెందానని ఈ ముంబై బ్యాట్స్‌మన్ చెప్పుకొచ్చాడు. ‘ఆస్ట్రేలియా టూర్ కోసం భారత జట్లను ప్రకటించిన రోజు నేను చాలా బాధపడ్డాను. నేను బాగా ఆడటంతో సెలెక్ట్ అవుతానని అనుకున్నా. కానీ అలా జరగలేదు. ఒక్క ఐపీఎల్‌లోనే కాకుండా గత రెండేళ్లుగా నేను వైట్ బాల్ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్నా. ఈ సారి ఖచ్చితంగా పిలుపు వస్తుందని అనుకున్నా. కానీ రాలేదు. కొంత నిరాశకు గురైనా దాని గురించి ఎక్కువగా ఆలోచించవద్దని నిర్ణయించుకున్నా. 'అని తెలిపాడు.

ఇక ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా సూర్య నిలిచాడు. 16 మ్యాచ్‌ల్లో 480 రన్స్ చేశాడు. గత రెండు సీజన్లలో కూడా అతను 424, 512 పరుగులతో రాణించాడు.

India vs Australia: నా జీవితానికి సరిపోయేంత చితక్కొట్టా.. మూసుకొని బౌలింగ్ చేయరా.!

Story first published: Monday, November 23, 2020, 16:13 [IST]
Other articles published on Nov 23, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+