Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Australia: నా జీవితానికి సరిపోయేంత చితక్కొట్టా.. మూసుకొని బౌలింగ్ చేయరా.!

4 instances when Australian cricketers got fitting replies for their sledging

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా క్రికెటర్లంటేనే స్లెడ్జింగ్‌కు మారుపేరు. మాటలతో కవ్విస్తూ, ప్రత్యర్థిని మానసికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఆసీస్‌తో ఆట అంటేనే మాటల యుద్ధం గుర్తుకొస్తుంది. ప్రత్యర్థి ఎవరైనా సరే మైదానంలో ఆసీస్ ఆటగాళ్లు ప్రవర్తించే మార్పులో తేడా ఉండదు. వారి స్లెడ్జింగ్ హద్దులు దాటి వివాదాలకు దారి తీసిన సందర్భాలున్నాయి. అయితే బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో ఆ జట్టు ఆటగాళ్లలో కొంచెం మార్పు వచ్చింది. స్లెడ్జింగ్ విషయంలో కొంత తగ్గారు. అయితే గతంలో ఆసీస్ ఆటగాళ్ల స్లెడ్జింగ్‌ను భారత ఆటగాళ్లు తిప్పికొట్టారు. అప్పట్లో అవి చర్చనీయాంశమయ్యాయి. అవెంటో ఒకసారి లుక్కెద్దాం.

బేబీ సిట్టర్..

బేబీ సిట్టర్..

2018-19 భారత పర్యటనలో కూడా ఇరు జట్ల మధ్య మాటల తూటలు పేలాయి. అయితే ఇవి హద్దులు దాటకపోవడంతో అభిమానులకు కావాల్సిన మజా లభించింది. ముఖ్యంగా ఆసీస్ టెస్ట్ కెప్టెన్ టీమ్ పైన్- టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ మధ్య జరిగిన ఫన్నీ వార్ ప్రతీఒక్కరిని ఆకట్టుకుంది. తన పిల్లలను ఆడించాలన్న పైన్ వ్యాఖ్యలను పంత్ తిప్పికొట్టాడు. నామ్‌కేవాస్త్ కెప్టెన్ అంటూ బదులిచ్చాడు. మరోసారి ఆసీస్‌లో అడుగుపెట్టిన భారత్.. ఆతిథ్య జట్టుతో నవంబర్ 27 నుంచి మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్ట్‌లు ఆడనుంది. ఈ క్రమంలో మళ్లీ స్లెడ్జింగ్ చర్చనీయాంశమైంది.

మూసుకొని బౌలింగ్ చేయ్..

మూసుకొని బౌలింగ్ చేయ్..

భారత జట్టు 2016 పర్యటనలో ఆసీస్ ఆల్‌రౌండర్ జేమ్స్ ఫాల్క్‌నర్.. విరాట్ కోహ్లీపై నోరుపారేసుకున్నాడు. 73 పరుగులతో క్రీజులో విరాట్‌ను పదే పదే రెచ్చగొడుతూ మానసికంగా దెబ్బతీసే ప్రయత్నం చేశాడు. అయితే ఫాల్కనర్ మాటల తూటాలకు విరాట్ అదే రీతిలో బదులిచ్చాడు. విరాట్ అన్న మాటలు స్టంప్ మైక్‌లో రికార్డు అయ్యాయి. ‘అనవసరంగా నీ శక్తిని వృథా చేసుకోకు. ఇక్కడే ఏ పాయింట్ లేదు. నా జీవితానికి సరిపోయేలా నిన్ను చితక్కొట్టా. వెళ్లి బౌలింగ్ చేయి'అని గట్టిగానే చెప్పాడు. ఈ మ్యాచ్‌లో చెలరేగిన విరాట్ (117) సెంచరీ చేశాడు.

నువ్వే జాతి కుక్కవు..

నువ్వే జాతి కుక్కవు..

2003-04 ఆసీస్ పర్యటనలో మైకెల్ క్లార్క్ స్లెడ్జింగ్‌ను అప్పటి టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తిప్పికొట్టాడు. ఈ టూర్‌లో భాగంగా ఆస్ట్రేలియా-ఎతో జరిగిన మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ గాయంతో మధ్యలోనే వైదొలగడంతో క్లార్క్ ఓల్డ్ బ్యాట్స్‌మెన్ అంటూ ఎగతాళి చేశాడు. సచిన్ మౌనంగానే మైదానం వీడగా.. ఈ మాటలకు చిర్రెత్తుకుపోయిన సెహ్వాగ్ మాత్రం క్లార్క్‌కు క్లాస్ పీకాడు. ‘సచిన్ చేసిన సెంచరీలంతా లేదు నీ వయసు'అని మందలించాడు. అయితే సెహ్వాగ్ మాటలకు మరింత రెచ్చిపోయిన క్లార్క్.. నోరుకు పనిచెప్పాడు. దీంతో మరింత ఆగ్రహానికి గురైన సెహ్వాగ్.. ‘నీ టీమ్‌మెట్స్ అంతా పెప్ అంటున్నారు.. నువ్వేజాతి కుక్కవు'అంటూ ఘాటుగా ప్రశ్నించాడు.

IND vs AUS 2020 : Rohit Sharma Breaks Silence On Controversy Surrounding His Hamstring Injury
 తలకాయ్ పగులిద్ది..

తలకాయ్ పగులిద్ది..

1991-92 పర్యటనలో నాటి ఆస్ట్రేలియా ప్లేయర్ విట్నీమేడ్‌- భారత క్రికెటర్ రవిశాస్త్రి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే విట్నీ మేడ్ ఆసీస్ టీమ్ 12వ సభ్యుడి కాగా.. అతనివైపు శాస్త్రి షాట్ ఆడటంతో నోరుపారేసుకున్నాడు. బ్రేక్ టైమ్‌లో క్రీజులో ఉండు లేకుంటే తల పగలగొడ్తానని హెచ్చరించాడు. దాంతో చిర్రెత్తుకుపోయిన రవి శాస్త్రి.. ‘ఈ మాటల కన్నా మంచిగా బౌలింగ్ చేసుంటే జట్టులో ఉండేవాడివి'అని నోరూ మూయించాడు.

బెస్ట్ ఐపీఎల్ ఎలెవన్ vs బెస్ట్ పీఎస్‌ఎల్ ఎలెవన్.. గెలిచే సత్తా ఎవరిదో చెప్పిన మాజీ క్రికెటర్!

Story first published: Monday, November 23, 2020, 18:39 [IST]
Other articles published on Nov 23, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+