Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

షెఫాలీ ఏడ్వడం తట్టుకోలేకపోయా.. ఆ క్షణం నా గుండె తరుక్కుపోయింది: ఆసీస్ మాజీ క్రికెటర్

Brett Lee Says Really Felt For Shafali Verma, Seeing Her In Tears Was Tough

మెల్‌బోర్న్‌: భారత యువ సంచలనం షెఫాలీ వర్మ కన్నీటి పర్యంతమవ్వడం చూసి తట్టుకోలేకపోయానని ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ బ్రెట్ లీ తెలిపాడు. ఆమె వెక్కి వెక్కి ఏడుస్తుంటే తన గుండె తరుక్కుపోయిందని ఈ మాజీ పేసర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ 85 పరుగుల తేడాతో చిత్తుగా ఓడి విశ్వవిజేతగా నిలిచే సువర్ణవకాశాన్ని చేజార్చుకున్న విషయం తెలిసిందే.

లీగ్ దశలో అప్రతిహత విజయాలతో దూసుకుపోయిన హర్మన్‌ప్రీత్ సేన.. కీలక టైటిల్ ఫైట్‌లో మాత్రం పూర్తిగా తేలిపోయింది. టోర్నీ ఆద్యాంతం ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న అమ్మాయిలు.. ఫైనల్లో మాత్రం ఫ్లాఫ్ షోతో తీవ్రంగా నిరాశపరిచారు.

కన్నీటిని ఆపుకోలేని షెఫాలీ..

కన్నీటిని ఆపుకోలేని షెఫాలీ..

ముఖ్యంగా తన సూపర్ బ్యాటింగ్‌‌తో జట్టును ఫైనల్‌కు చేర్చిన షెఫాలీ వర్మ కీలక ఫైనల్లో మాత్రం చేతులెత్తేసింది. ఆసీస్ ఓపెనర్ అలిసా హీలీ ఇచ్చిన సునాయస క్యాచ్ వదిలేయడంతో పాటు.. బ్యాటింగ్‌లోనూ 2 పరుగులే చేసి దారుణంగా విఫలమైంది. దీంతో ఓటమి తర్వాత.. తన వల్లే ఈ పరిస్థితి వచ్చిందని, ఆ క్యాచ్ పట్టి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని కన్నీటి పర్యంతమైంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్, సహచర ప్లేయర్లు ఓదార్చే ప్రయత్నం చేసినా.. ఉబికి వస్తున్న దు:ఖాన్ని దింగమింగలేకపోయింది. వెక్కి వెక్కి ఏడ్వసాగింది.

అత్యుత్తమ వరల్డ్‌కప్‌ జట్టును ప్రకటించిన ఐసీసీ.. భారత్ నుంచి ఇద్దరే!!

ఆమెను అలా చూడలేకపోయా..

ఆమెను అలా చూడలేకపోయా..

ఆమె కన్నీటి పర్యంతమవ్వడం.. సహచర ఆటగాళ్లతో పాటు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని కదిలించింది. ఈ నేపథ్యంలోనే ఆసీస్ దిగ్గజ పేసర్ బ్రెట్ లీ ఐసీసీకి రాసిన తన కాలమ్‌లో షెఫాలీ వెక్కివెక్కి ఏడ్వడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు.

‘షెఫాలీ ఏడ్వడం నాకు బాధనిపించింది. మ్యాచ్‌ ముగిసాక ఆమె కన్నీటి పర్యతమవ్వడం చూడటం చాలా కష్టంగా అనిపింది. కానీ ఆమె గర్వించదగ్గ క్రికెటర్‌. ఆస్ట్రేలియాలో షెఫాలీ ప్రదర్శన అద్భుతంగా సాగింది. తొలి టోర్నమెంట్‌‌లో ఈ యువ ప్లేయర్ తన బ్యాటింగ్ నైపుణ్యం‌తో ఆకట్టుకుంది. మానసికంగా ఆమె చాలా ధృడంగా కూడా కనిపించింది. ఈ టోర్నీ పరాజయంతో ఆమె మరింత పరిణితి సాధిస్తుందని ఆశిస్తున్నా. ఈ అనుభవంతో ఖచ్చితంగా ఆమె మరింత రాటుదేలుతుంది. ఆస్ట్రేలియాలో ఆడే తదుపరి టోర్నీల్లో ఆమె చేసే భారీ స్కోర్లు ఎవ్వర్నీ ఆశ్చర్యపరచకపోవచ్చు. సానుకూల ధోరణితో ముందుకు సాగుతుందనే భావిస్తున్నా. 'అని తెలిపాడు.

అప్పుడే ముగిసిపోలేదు..

అప్పుడే ముగిసిపోలేదు..

ఈ ఫలితం భారత అమ్మాయిలను నిరాశ పరిచవచ్చని, కానీ భవిష్యత్తు వారు మరింత రాటేదేలుతారన్నారు. ‘ఈ రాత్రి భారత మహిళలకు తీవ్ర నిరాశను మిగిల్చవచ్చు. కానీ భవిష్యత్తులో వారు మరింత రాటుదేలతారు. ఈ ఫలితంతోనే వారి ఆట ముగిసిపోలేదు. ఇది కేవలం ఆరంభం మాత్రమే 'అని బ్రెట్‌ లీ పేర్కొన్నాడు.

కప్ పోయింది.. కన్నీరే మిగిలింది..

కప్ పోయింది.. కన్నీరే మిగిలింది..

ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. అలీసా హెలీ( 39 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 75), బెత్ మూనీ(54 బంతుల్లో 10 ఫోర్లు 78 నాటౌట్) విధ్వంసతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 184 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన భారత్ 19.1 ఓవర్లలో 99 పరుగులకే ఆలౌటైంది. భారత బ్యాటర్లలో దీప్తీ శర్మ(33), వేద కృష్ణమూర్తి (19) టాప్ స్కోరర్లు కావడం గమనార్హం. ప్రధాన బ్యాటర్లు షెఫాలీ (2), మంధాన(11), రోడ్రిగ్స్‌(0), హర్మన్‌(4) ఘోరంగా విఫలమయ్యారు. ఆసీస్‌ బౌలర్లలో మేగన్‌ స్కట్ నాలుగు వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించగా.. జోనాసన్‌ మూడు వికెట్లు తీసింది.

Story first published: Monday, March 9, 2020, 17:50 [IST]
Other articles published on Mar 9, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+