ఇతరులను వార్న్ ఆడుకుంటే.. అతన్ని సచిన్ ముప్పుతిప్పలు పెట్టేవాడు: బ్రెట్‌లీ

న్యూఢిల్లీ: ఇతర బ్యాట్స్‌మెన్‌ను ప్రపంచ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ ఇబ్బంది పెడితే అతన్ని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ముప్పు తిప్పలు పెట్టేవాడని ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్‌లీ తెలిపాడు. వార్న్ పలు వేరియషన్స్‌తో బంతులు విసిరినా.. సచిన్ సమర్ధవంతంగా ఎదుర్కునేవాడని ఈ ఆసీస్ పేసర్ గుర్తు చేసుకున్నాడు. స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో మాట్లాడుతూ.. సచిన్ ఔట్ చేసేందుకు వార్న్ ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఫలితం దక్కకపోయేదన్నాడు. వీరి పోరు పిల్లి, ఎలుకల మధ్య ఉన్న పోరులా ఉండేదన్నాడు.

వార్న్ అలసిపోయేవాడు..
‘బౌలర్లను అర్థం చేసుకోవడంలో సచిన్‌ను మించినవారు లేరు. వైవిధ్యమైన బంతులను ఎదుర్కోవడానికి అతను ఉపయోగించే టెక్నిక్ చాలా విభిన్నంగా, క్లాస్‌గా ఉండేది. వార్న్ కూడా సచిన్‌ను ఔట్ చేయడం కోసం వినూత్నమై బంతులను సంధించేవాడు. కానీ అతని బౌలింగ్‌లోని ప్రతీ మార్పును సచిన్ ముందుగానే పసిగట్టి.. అందుకు తగిన జవాబుతో సిద్దంగా ఉండేవాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్యాట్స్‌మన్‌ను తన స్పిన్‌తో వార్న్ ఇబ్బంది పెడితే.. వార్న్‌ను సచిన్ ముప్పు తిప్పులు పెట్టాడు. సచిన్ ఔట్ చేయడం కోసం ప్రయత్నించి.. వార్న్ అలసిపోయేవాడు.'అని లీ చెప్పుకొచ్చాడు.

పిల్లి-ఎలుక పోరులా..
‘వార్న్ బౌలింగ్‌కి వేస్తున్న సమయంలో కొన్నిసార్లు సచిన్ వేగంగా ఆడేవాడు. దీంతో వార్న్ తీవ్ర ఒత్తిడిలో షార్ట్ బంతులు వేసేవాడు. మరికొన్నిసార్లు సచిన్ బ్యాక్‌ఫుట్‌లో ఓపికగా ఆడుతూ.. అద్బుతమైన షాట్స్ కొట్టేవాడు. ఇది చూస్తుంటే నాకు పిల్లి, ఎలుకల మధ్య పోరులా అనిపించేది. వార్న్‌తో అలా ఆడుకున్న బ్యాట్స్‌మెన్ సచిన్ మాత్రమే. వేరే ఎవరికీ అది సాధ్యం కాలేదు'అని లీ పేర్కొన్నాడు.

22 ఏళ్ల వయసులో..
తనకు 22 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు సచిన్‌తో ఆడే అవకాశం వచ్చిందని లీ తెలిపారు. ‘తొలిసారి సచిన్‌ని ఔట్ చేసిన తర్వాత నాకు ఇంకా చాలు అనిపించింది. సచిన్ టెండూల్కర్‌ను ఔట్ చేయడం.. నేను సాధించిన అతి పెద్ద విజయంగా భావించాను'అని బ్రెట్ లీ గుర్తు చేసుకున్నాడు. సచిన్ టెండూల్కర్ క్రికెట్ గాడ్..అని అతన్ని అధిగమించేవారేవరో చూడాలన్నాడు.
6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టిన తర్వాత స్టువర్ట్ బ్రాడ్ తండ్రి యూవీతో ఏమన్నాడంటే.?

సచిన్‌ను కవ్వించొద్దని హెచ్చరించాడు..
సచిన్‌ను కవ్వించవద్దని, లేకుంటే మూల్యం చెల్లించుకుంటావని కెరీర్ ప్రారంభంలో మెక్‌గ్రాత్ తనను హెచ్చరించినట్లు బ్రెట్‌లీ తెలిపాడు. ‘మా జట్టులో ఎప్పుడూ ఒక బౌలింగ్ కెప్టెన్ ఉండేవాడు. నేను జట్టులోకి వచ్చినప్పుడు గ్లెన్ మెక్‌గ్రాత్ మా బౌలింగ్ సారథి. అతనెప్పుడూ యువ బౌలర్లకు ఒకే విషయం చెప్పేవాడు. అది మిచెల్ జాన్సన్ అయినా, మరెవరైనా.. టీమిండియా బ్యాట్స్‌మన్ సచిన్‌ను కవ్వించవద్దని, ఒకవేళ అతన్ని కవ్విస్తే మాత్రం ఆరోజు ఆ బౌలర్ బాధపడక తప్పదని హెచ్చరించేవాడు. మా బౌలింగ్ సమావేశాల్లోనూ ఇదే చర్చకువచ్చేది' అని బ్రెట్‌లీ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications