Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2020 టైటిల్ గెలిచేది ఆ జట్టే.. పరుగుల విధ్వంసం సృష్టించేది అతనే: బ్రెట్ లీ

Brett Lee picks MS Dhoni led CSK as the winner of the IPL 2020

ముంబై: కరోనా దెబ్బకు భారత్‌ను వదిలిపెట్టి యూఏఈలో అడుగుపెట్టిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్‌‌కు సర్వం సిద్ధమవుతోంది. ఎడారి హీట్‌‌లో.. అరేబియన్‌‌ నైట్స్‌‌లో.. ఇసుక తిన్నెల మధ్య.. వెచ్చని వెన్నెల్లో.. పచ్చగా పరుచుకున్న మైదానాల్లో అభిమానులకు కావాల్సిన మజాను అందించేందుకు జట్లన్నీ సిద్దమయ్యాయి. మరో 9 రోజుల్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్‌ల మధ్య జరిగే రసవత్తర పోరుతో ఈ క్యాష్ రిచ్ లీగ్‌కు తెరలేవనుంది. టైటిలే లక్ష్యంగా అన్ని జట్లు బరిలోకి దిగుతున్నాయి.

అయితే ఈ సీజన్ ఐపీఎల్ టైటిల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ గెలుచుకుంటుందని ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ అంచనా వేసాడు. అంతేకాకుండా ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ పరుగుల విధ్వంసం సృష్టిస్తాడని తెలిపాడు. ఐపీఎల్‌ కవరేజ్‌లో భాగంగా అధికారిక బ్రాడ్‌కాస్టర్స్‌ స్టార్ స్పోర్ట్స్‌కు హోస్ట్‌గా వ్యవహరించనున్న బ్రెట్‌ లీ.. ముంబై చేరుకున్నాడు. కరోనా వైరస్ నేపథ్యంలో క్వారంటైన పాటిస్తున్నాడు.

చాంప్స్ చెన్నై..

చాంప్స్ చెన్నై..

హోటల్ గదిలో ఖాళీగా ఉన్న ఈ ఆసీస్ పేసర్.. ‘గాయ్స్.. ఐసోలేషన్‌లో చిక్కుకుపోయా.. ఆసక్తికరమైన ప్రశ్నలేమైనా అడగండి'అని అభిమానులను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చిట్‌చాట్‌కు ఆహ్వానించాడు. ఈ క్రమంలోనే ఫ్యాన్స్‌ అడిగిన పలు ప్రశ్నలకు బ్రెట్‌లీ ఓపిగ్గా సమాధానమిచ్చాడు. ఈ చిట్‌చాట్‌లో భాగంగా ఓ అభిమాని ‘బ్రెట్ లీ సర్.. ఐపీఎల్ 2020 చాంపియన్‌గా ఏ జట్టు నిలుస్తుంది?'అని ప్రశ్నించాడు. విజేతను చెప్పడం కష్టమే అయినా తాను మాత్రం మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టే టైటిల్‌ గెలుస్తుందని అనుకుంటున్నానని బదులిచ్చాడు.

ప్లే ఆఫ్‌లో కోల్‌కతా..

ప్లే ఆఫ్‌లో కోల్‌కతా..

మరో అభిమాని ‘కోల్‌కతా జట్టులోకి ప్యాట్ కమిన్స్ రాకతో ఆ జట్టు మూడో టైటిల్ గెలుస్తుందా..? ఆ జట్టు బౌలింగ్‌పై నీ అంచనా ఏమిటి'అని ప్రశ్నించగా.. కమిన్స్ వరల్డ్ క్లాస్ ప్లేయరని, కోల్‌కతా ప్లే ఆఫ్ చేరుతుందని బ్రెట్ లీ సమాధానమిచ్చాడు. ఇక ఈడెన్ గార్డెన్స్ తన ఫేవరెట్ గ్రౌండ్ అని చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా సారథుల్లో అలెన్ బార్డర్, పాంటింగ్, స్టీవ్ వా, మైఖెల్ క్లార్క్‌ల్లో ఎవరు బెస్ట్ అనుకుంటున్నావని ప్రశ్నించగా... బ్రెట్‌లీ వా పేరు సూచించాడు. అలాగే తనలోని అత్యుత్తమ ఆటను బయటకు తీసింది మాత్రం పాంటింగ్ అని చెప్పుకొచ్చాడు.

 రోహిత్ చెలరేగుతాడు..

రోహిత్ చెలరేగుతాడు..

ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత విధ్వంసకరమైన బ్యాట్స్‌మన్ ఎవరని లీని ప్రశ్నించగా.. ఈ ఆసీస్ మాజీ పేసర్ నేరుగా సమాధానం చెప్పకుండా దాటవేశాడు. ఈ సీజన్‌లో రోహిత్ శర్మ చెలరేగుతాడని జోస్యం చెప్పాడు. ఇక తనను ఇబ్బంది పెట్టే బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్, సచిన్, లారా అని, సచిన్‌తో ఆడటం చాలా ఇష్టమని, అతనితో ఆడటం ఎప్పుడైనా రెడీ అని తెలిపాడు. ఇక ప్రస్తుత తరంలో వరల్డ్ బెస్ట్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీనే అని అభిప్రాయపడ్డాడు.

ధోనీకి పెద్ద అభిమానిని..

ధోనీకి పెద్ద అభిమానిని..

ఇక ధోనీ గురించి చెప్పమని ప్రశ్నించగా.. అతనికి తాను పెద్ద అభిమానినని బదులిచ్చాడు. 2021 టీ20 ప్రపంచకప్ ఆస్ట్రేలియా కైవసం చేసుకుంటుందన్నాడు. మెక్‌గ్రాత్‌తో కలిసి బౌలింగ్ చేయడం ఇష్టమన్న బ్రెట్‌లీ.. ఐపీఎల్‌లో కేకేఆర్ తరఫున టైటిల్ గెలవడం బెస్ట్ మూమెంట్ అని చెప్పుకొచ్చాడు. తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో సచిన్ వికెట్ తీసిన ప్రతీసారి చాలా సంతోషంగా ఫీలయ్యేవాడినని తెలిపాడు. బౌలింగ్‌లో బౌన్సర్ వేయడం చాలా ఇష్టమన్నాడు.

CSK ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. కరోనా సోకిన ఆ ఆటగాడికి నెగటీవ్!

Story first published: Thursday, September 10, 2020, 14:44 [IST]
Other articles published on Sep 10, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+