For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బ్రాడ్ హగ్ బెస్ట్ ఐపీఎల్ 2020 ఎలెవన్.. ధోనీకి దక్కని చోటు!

Brad Hogg picks his best IPL 2020 XI, no MS Dhoni in the team

సిడ్నీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. మరో 6 రోజుల్లో ఈ క్యాష్ రిచ్ లీగ్‌కు తెరలేవనుంది. ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలు తమ జట్టుకు సంబంధించిన ప్రమోషన్స్ ప్రారంభించగా.. అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ కూడా వినూత్న ప్రొమోలతో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు క్రికెట్ విశ్లేషకులు, నిపుణులు వారి విశ్లేషణలు, అంచనాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హగ్ ఐపీఎల్ 2020 సీజన్ బెస్ట్ ఎలెవన్ జట్టును ప్రకటించాడు.

 ధోనీకి దక్కని చోటు..

ధోనీకి దక్కని చోటు..

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ బెస్ట్ ఎలెవన్ టీమ్‌లో భారత మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీకి చోటు దక్కకపోవడం. ప్రపంచ క్రికెట్‌లోనే బెస్ట్ వికెట్ కీపర్ కమ్ కెప్టెన్‌గా గుర్తింపు పొందిన ధోనీ.. ఐపీఎల్‌లో కూడా తనదైన సారథ్యంతో చెన్నైకి మూడు టైటిళ్లు అందించాడు. 5 సార్లు రన్నరప్‌గా నిలబెట్టాడు. ప్రతీ సీజన్‌లో జట్టును ప్లే ఆఫ్‌కు చేర్చాడు. ఇంతటి ఘన చరిత్ర ఉన్న మహీని బ్రాడ్ హగ్ పక్కన పెట్టడం అందరిని విస్మయపరుస్తుంది. బహుషా.. ధోనీ అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలికాడని, లేకుంటే గతేడాదిగా ఆటకు దూరమయ్యాడనే కారణాలతోనే మహీ ప్రభావం అంతంగా ఉండదని బ్రాడ్ హగ్ భావించి ఉంటాడని అర్థమవుతుంది.

ఓపెనర్లుగా..

ఓపెనర్లుగా..

తన బెస్ట్ ఎలెవన్ ఓపెనర్లుగా ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్, సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మలను బ్రాడ్ ఎంచుకున్నాడు. వార్నర్ ఐపీఎల్‌లో తనదైన ఆటతో ఎన్నో సార్లు ఆరేంజ్ క్యాప్ అందుకున్నాడు. జట్టుకు ఒంటిచేత్తో విజయాలందించాడు. 2016లో చాంపియన్‌గా కూడా నిలబెట్టాడు. ఇక రోహిత్ ఐపీఎల్‌లోనే సక్సెస్‌ఫుల్ కెప్టెన్. ముంబై ఇండియన్స్‌కు నాలుగు టైటిళ్లు అందించాడు.

కెప్టెన్‌గా విలియమ్సన్..

కెప్టెన్‌గా విలియమ్సన్..

ఈ బెస్ట్ ఎలెవన్‌కు సారథిగా బ్రాడ్ హగ్.. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను ఎంచుకున్నాడు. సక్సెస్ ఫుల్ కెప్టెన్లు రోహిత్, ధోనీని కాదని విలియమ్సన్ తీసుకోవడం ఆసక్తికరం. అయితే వార్నర్ గైర్హాజరీలో జట్టును అద్భుతంగా నడిపించిన విలియమ్సన్ ఫైనల్‌కు తీసుకువెళ్లడమే కాకుండా.. హయ్యెస్ట్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. గతేడాది ప్లే ఆఫ్‌కు చేర్చాడు. అయినా సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం వార్నర్‌కే సారథ్యం బాధ్యతలు అప్పగించింది. ఇక బ్రాడ్ విలిమ్సన్‌కు బ్యాటింగ్ ఆర్డర్ నాలుగో స్థానాన్ని కేటాయించాడు.

ఫస్ట్ డౌన్‌లో విరాట్..

ఫస్ట్ డౌన్‌లో విరాట్..

ఇక మూడో స్థానాన్ని ఆర్‌సీబీ కెప్టెన్, ఐపీఎల్ హయ్యెస్ట్ రన్ స్కోరర్ విరాట్ కోహ్లీ కేటాయించిన బ్రాడ్.. ఐదో స్థానంలో స్పెషలిస్ట్ కీపర్‌గా రిషభ్ పంత్‌ను తీసుకున్నాడు. నిలకడలేమి ఆటతో పంత్ తడబడుతున్నా అతనికి అవకాశం కల్పించడం విశేషం. స్పెషలిస్ట్ ఆల్‌రౌండర్లుగా వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు ఆండ్రీ రస్సెల్, భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాలను ఎంచుకున్నాడు. ఇక రస్సెల్ గతేడాది కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున పరుగుల సునామీ సృష్టించిన విషయం తెలిసిందే.

బుమ్రా నేతృత్వంలో..

బుమ్రా నేతృత్వంలో..

మిస్టరీ బౌలింగ్‌తో పాటు విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆకట్టుకునే సునీల్ నరైన్‌ను లోయారార్డర్‌లోకి తీసుకున్న హగ్.. అతనికి తోడుగా భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌‌ను ఎంచుకున్నాడు. రవీంద్ర జడేజాతో పాటు ఈ ఇద్దరిని స్పిన్నర్లు కోటాలో ఎంపిక చేశాడు. ఇక పేసర్లుగా భారత స్టార్ పేసర్, యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రా, డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ భువనేశ్వర్ కుమార్‌లను తీసుకున్నాడు.

బ్రాడ్ హగ్ బెస్ట్ ఎలెవన్..

బ్రాడ్ హగ్ బెస్ట్ ఎలెవన్..

డేవిడ్ వార్నర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్(కెప్టెన్), రిషభ్ పంత్(కీపర్), ఆండ్రీ రస్సెల్, రవీంద్ర జడేజా, సునీల్ నరైన్, యుజ్వేంద్ర చహల్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా

నేనెవరినైనా చంపానా..? అంపైర్‌తో స్టార్ ఆటగాడి వాగ్వాదం!

Story first published: Sunday, September 13, 2020, 12:57 [IST]
Other articles published on Sep 13, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+