పంత్ కాపీ వద్దు.. సొంత గుర్తింపు తెచ్చుకో.!!

సిడ్నీ: నిలకడలేమి ఫామ్‌తో సతమతమవుతున్న టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఒకరిని అనుకరించకుండా, సొంత గుర్తింపు తెచ్చుకోవాలని ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ బ్రాడ్ హడిన్ సూచించాడు. ఇటీవల దారుణంగా విఫలమైన ఈ ఢిల్లీ ప్లేయర్.. ఆఖరికి జట్టులో చోటు కూడా కోల్పోయాడు.
కేఎల్ రాహుల్ రూపంలో వికెట్ కీపింగ్ ఆప్షన్ దొరకడంతో చాలా మ్యాచ్‌లు బెంచ్‌కే పరిమితమయ్యాడు. అవకాశం వచ్చిన వాటిల్లో రాణించలేకపోయాడు. ఇక టీ20 వరల్డ్‌కప్ నాటికైనా పంత్ తిరిగి ఫామ్ అందుకుంటాడా? లేదా? అనేది అటు అతని ఫ్యాన్స్‌ను ఇటు మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో బ్రాడ్ హడిన్.. పంత్‌కు కొన్ని సూచనలు చేశాడు.

ఏ మాత్రం లాభం లేదు..
‘పంత్.. నువ్వు ఎవ్వర్నీ అనుకరించాలని ప్రయత్నించకు. నీకు నీవు సొంత గుర్తింపు తెచ్చుకో. నీకో శైలి ఉంది. దాన్నే కొనసాగించు. అందులో సాంకేతికంగా తప్పిదాలు ఉంటే సరి చేసుకో. అంతే గానీ మరొక క్రికెటర్‌ను కాపీ కొట్టడానికి ప్రయత్నించ వద్దు. అలా చేస్తే ఒత్తిడిలో పడటం తప్పితే లాభం ఉండదు. 'ఈ మాజీ ప్లేయర్ సూచించాడు.
టీమిండియాకు ఇద్దరు కెప్టెన్లు అవసరమా? పరిమిత ఓవర్ల పగ్గాలు రోహిత్‌కు ఇవ్వాలా?

నేను అలా చేయలేదు..
కెరీర్ ప్రారంభంలో తాను ఎవరినీ అనుకరించలేదన్నాడు. ‘నేను ఆసీస్ తరఫున తొలి టెస్టు అవకాశం దక్కించుకున్నప్పుడు మాజీ వికెట్ కీపర్లు ఇయాన్ హీలే, ఆడమ్ గిల్ క్రిస్ట్‌లను అనుకరించే ప్రయత్నం చేయలేదు. నా స్టైల్‌లోనే ఆటను ఆస్వాదించా. నువ్వు మరొక వికెట్ కీపర్‌ను కానీ బ్యాట్స్‌మన్‌ను కానీ అనుకరించే ప్రయత్నం చేయకు. అదే నీకు పెద్ద సవాల్. ఒకవేళ వేరే ఒకర్ని కాపీ కొడితే.. నీలో ఉన్న సహజత్వం బయటకి రాకపోగా నీ అసలు ఆటకే ప్రమాదం వస్తుంది.' అని బ్రాడ్ హడిన్ పేర్కొన్నాడు.

ధోనీ ఒక సూపర్ స్టార్
ఒకవైపు పంత్‌కు సూచనలు చేసిన హడిన్.. మరొవైపు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై ప్రశంసల జల్లు కురిపించాడు. మహీ ఒక సూపర్ స్టార్ అంటూ కొనియాడాడు. దాదాపు దశాబ్దకాలానికి పైగా ధోనీ ఎన్నో చిరస్మరణీయమైన విజయాల్ని అందించాడని తెలిపాడు. భారత్‌కు దొరికిని ఆణిముత్యం ధోని అంటూ కితాబిచ్చాడు. మరి ధోనీ వారసత్వాన్ని అందిపుచ్చుకునే మరే వికెట్ కీపరైనా వారి వారి సహజ సిద్ధ శైలినే అనుసరించాల్సి ఉంటుందని, అప్పుడే వారికి ప్రత్యేక గుర్తింపు వస్తుందని ఈ ఆసీస్ మాజీ ప్లేయర్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications