'సెంచరీ బాదిన స్మిత్‌ను ఎగతాళి చేయడం నిరాశకు గురిచేసింది'

హైదరాబాద్: యాషస్ సిరిస్‌లో భాగంగా గురువారం ప్రారంభమైన తొలి టెస్టులో ఇంగ్లాండ్ అభిమానుల తీరుని ఆస్ట్రేలియా మాజీ బౌలింగ్ గ్రేట్ గ్లెన్ మెక్‌గ్రాత్ తప్పుబట్టాడు. టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ పట్ల ఇంగ్లాండ్ అభిమానుల వ్యవహారించిన తీరు పట్ల మెగ్‌గ్రాత్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఈ మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ ఔటై పెవిలియన్ వెళుతున్న సమయంలో ఇంగ్లీషు అభిమానులు సాండ్ పేపర్ చూపిస్తూ పెవిలియన్‌కు సాగనంపారు. ఆ తర్వాత వార్నర్, బాన్‌క్రాఫ్ట్ ఇన్నింగ్స్ ఓపెన్ చేయడానికి వెళుతున్నప్పుడు కూడా ఇంగ్లిష్ అభిమానులు 'చీటర్స్.. చీటర్స్' అంటూ నినాదాలు చేశారు. కొందరు అభిమానులు అయితే స్టీవ్ స్మిత్ ఏడ్చిన ఫోటోలను మాస్క్‌లుగా ధరించి ఈ మ్యాచ్‌కి హాజరయ్యారు.
అయితే, ఇవేమీ పట్టించుకోకుండా స్టీవ్ స్మిత్ తొలిరోజు ఒంటరి పోరాటం చేసి తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. ఇంగ్లాండ్ అభిమానులు స్టీవ్ స్మిత్‌ను ఎగతాళి చేయడంపై గ్లెన్ మెక్‌గ్రాత్ మాట్లాడుతూ ఈ ప్రారంభాన్ని మేము ముందుగానే ఊహించామని అన్నాడు.

16 నెలలు క్రితం వారు తప్పు చేశారు
"16 నెలలు క్రితం వారు తప్పు చేశారు. అందుకు తగిన శిక్షను కూడా అనుభవించారు. ప్రస్తుతం దానిని మరిచిపోయి ముందుకు సాగుతున్నారు. అతడు (స్మిత్) సెంచరీ చేసినప్పుడు కూడా ఇంగ్లాండ్ అభిమానులు ఎగతాళి చేస్తున్నారు. అదొక అద్బుతమైన ఇన్నింగ్స్. అలా చేయడం నన్ను నిరాశ పరిచింది" అని మెక్‌గ్రాత్ అన్నాడు.
మైదానాన్ని వీడి 'క్షమాపణలు' చెప్పిన అండర్సన్.. గాయం తీవ్రత అధికంగా ఉంటే టోర్నీకి దూరం!!

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాను ఇంగ్లాండ్ బౌలర్లు ఆరంభంలోనే దెబ్బతీశారు. ఓపెనర్లు వార్నర్ (2), బాన్‌క్రాఫ్ట్ (8)లను స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేర్చాడు. ఖవాజా (13) కూడా ఎక్కువసేపు నిలవలేదు. 35 పరుగులకే 3 వికెట్లు పడిన దశలో స్మిత్, హెడ్ (35)తో కలిసి ఇన్నింగ్స్‌ను సరిదిద్దాడు. లంచ్ విరామానికి ఆసీస్ 83/3తో నిలిచింది. స్టువర్ట్ బ్రాడ్‌తో వోక్స్ విజృంభించడంతో ఆసీస్ వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది.

150 పరుగులైనా దాటుతుందా?
హెడ్‌తో పాటు వేడ్ (1), పైన్ (5), పాటిన్సన్ (0), కమిన్స్ (5) స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. 23 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయింది. దీంతో ఆసీస్ స్కోరు కనీసం 150 పరుగులైనా దాటుతుందా అనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో స్మిత్‌కు లోయర్ ర్డర్ బ్యాట్స్‌మెన్ పీటర్ సిడిల్ (85 బంతుల్లో 44; 4 ఫోర్లు) సహకరించాడు. వీరిద్దరి తొమ్మిదో వికెట్‌కు 88 పరుగులు జత చేయడంతో ఆసీస్ 210/8తో కోలుకుంది.

ఆఖరి వికెట్‌కు 74 పరుగులు జోడించిన స్మిత్
కానీ సిడిల్‌ను అలీ ఔట్ చేయడంతో ఆసీస్ ఇన్నింగ్స్ ముగియడానికి ఎక్కువ సమయం పట్టదనిపించింది. అయితే, స్మిత్ పట్టువదలకుండా నాథన్ లియాన్(12 నాటౌట్)తో కలిసి చివరి వరకు పోరాడాడు. ఈ క్రమంలో 184 బంతుల్లో సెంచరీ చేసిన స్మిత్‌ను బ్రాడ్ బౌల్డ్ చేశాడు. దీంతో ఆఖరి వికెట్‌కు లయాన్‌తో కలిసి స్టీవ్ స్మిత్ 74 పరుగులు జోడించడం విశేషం.
విభేదాల మధ్య విండిస్ పర్యటన: ఫ్లోరిడాలో రోహిత్‌పై కోహ్లీ పైచేయి సాధించేనా?

పునరాగమనం తర్వాత స్మిత్‌కి ఇదే తొలి టెస్టు సెంచరీ
ఇంగ్లాండ్ బౌలర్లు చెలరేగిన వేళ... అసాధారణ ఇన్నింగ్స్ ఆడిన స్టీవ్ స్మిత్ (144; 219 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సులు) అద్భుతమైన సెంచరీతో ఆదుకోవడంతో యాషెస్ తొలి టెస్టులో తొలి రోజును ఆస్ట్రేలియా కాస్త గౌరవంగా ముగించింది. టెస్టుల్లో స్మిత్‌కు ఇది 24వ టెస్టు సెంచరీ కాగా యాషెస్‌లో మాత్రం నాలుగో సెంచరీ. బాల్ టాంపరింగ్ పునరాగమనం తర్వాత స్టీవ్ స్మిత్‌కి ఇదే తొలి టెస్టు సెంచరీ.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications