For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కూరగాయాలు అమ్ముకుంటున్న అంతర్జాతీయ క్రికెటర్!

Blind Cricket World Cup-Winner Naresh Tumda Forced To Sell Vegetables In Ahmedabad

న్యూఢిల్లీ: నిన్నటి వరకు అతను అంతర్జాతీయ స్థాయి క్రికెటర్‌, ప్రపంచకప్ విజేత.. ఇప్పుడేమో పొట్టకూటి కోసం కూరగాయలు అమ్ముకుంటున్న నిరుపేద.! సాధారణంగా దేశవాళీ క్రికెట్‌ మ్యాచ్‌ ఆడినా సౌకర్యవంతమైన జీవితాన్ని గడపగలిగే అవకాశమున్న ఈ రోజుల్లో.. అంతర్జాతీయస్థాయి ఆటగాడయ్యుండి పేదరికంలో మగ్గుతున్నాడా? అంటే.. ఇది నిజం. ఎందుకంటే.. అతను అంధ క్రికెటర్‌ కాబట్టి. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌కు చెందిన 29 ఏళ్ల నరేశ్ తుమ్డా.. రెండేళ్ల క్రితం ప్రపంచకప్ గెలిచిన భారత అంధ క్రికెట్ జట్టులో సభ్యుడు. షార్జా వేదికగా దాయాదీ పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత బ్లైండ్ టీమ్ 308 రన్స్‌ను చేధించి విశ్వవిజేతగా నిలిచింది.

 కరోనా పుణ్యమా..

కరోనా పుణ్యమా..

ప్రపంచకప్ విజేత అయిన నరేశ్.. రెండేళ్ల అనంతరం కరోనా పుణ్యమా రోడ్డున పడ్డాడు. పొట్ట కూటి కోసం అహ్మద్ బాద్‌లోని జమాల్‌పూర్‌ మార్కెట్లో కూరగాయలు అమ్ముకుంటున్నాడు. ఓవైపు ఐదుగురు కుటుంబ సభ్యుల పోషణ.. మరోవైపు మహత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాది హామీ పథకం‌తో కూడా ఉపాధి లభించకపోవడంతో ఈ ప్రపంచకప్ విజేత కూరగాయలు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది.

 మేం అంధులమనే కదా ఈ వివక్ష..

మేం అంధులమనే కదా ఈ వివక్ష..

‘అదే భారత జట్టు ప్రపంచకప్ గెలిస్తే ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపిస్తారు. మాలాంటి వారిని మాత్రం కనీసం క్రీడాకారులుగా కూడా పరిగణించరు. ఎందుకంటే మేం అంధులం. ఈ సమాజం అందరిని సమానంగా చూడాలి. ప్రపంచకప్ గెలిచిన తర్వాత మా అంధ క్రికెటర్లకు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తుందనుకున్నాం. కానీ అది జరగలేదు. అంతలోనే కరోనా మా జీవన విధానాన్ని దెబ్బతీసింది. ఉపాధి హామీ పథకం కింద కూడా ఉపాధి దొరక్క.. కూరగాయలు అమ్ముకునే పరిస్థితి వచ్చింది'అని నరేశ్ తుమ్డా టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశాడు.

 నరేశ్‌లానే ఇతర దివ్యాంగ ఆటగాళ్లు..

నరేశ్‌లానే ఇతర దివ్యాంగ ఆటగాళ్లు..

ఇక నరేశ్ తుమ్డా ఒక్కడే కాదు చాలా మంది క్రీడాకారులు పొట్టకూటి కోసం నానా తిప్పలు పడుతున్నారు. హరియాణా రాష్ట్రంలోని సోనేపట్‌కు చెందిన 35 ఏళ్ల దినేష్‌ సెయిన్ అనే దివ్యాంగ క్రికెటర్ కిరాణా షాపు నడిపిస్తూ.. ప్యూన్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు. జాతీయ వీల్‌చైర్‌ క్రికెటర్‌ అయిన రాజేంద్రసింగ్‌ ధామి పొట్టకూటి కోసం కూలీగా అవతారమెత్తాడు. ఇన్ని రోజలు ప్రైజ్‌మనీ, స్పాన్సర్‌షిప్‌లు, కోచ్‌గా పనిచేయగా వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషించిన ధామి.. కరోనాతో రోజు కూలీగా మారాడు. ఉత్తరాఖండ్‌‌లోని రాయ్‌కోట్‌కు చెందిన రాజేంద్రసింగ్‌..ప్రస్తుతం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రాళ్లు కొడుతూ రోజులు వెళ్లదీస్తున్నాడు.

 బీసీసీఐ అండగా ఉండాలి..

బీసీసీఐ అండగా ఉండాలి..

దివ్యాంగ క్రికెటర్లకు అండగా ఉండాలని ఫిజికల్ చాలెంజ్‌డ్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(పీసీసీఏఐ) భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి లేఖ రాసింది. కరోనా కారణంగా దివ్యాంగ క్రికెటర్లు దయనీయ స్థితిని ఎదుర్కొంటున్నారని పేర్కొంది. ‘ఇటీవల దివ్యాంగ క్రికెటర్ల గురించి వస్తున్న వార్తలు.. వారి దయనీయ పరిస్థితిని తెలియజేస్తున్నాయి. బీసీసీఐతో పాటు ప్రభుత్వం వారికి అందించాల్సిన సాయాన్ని గుర్తు చేస్తున్నాయి. కరోనా ముందుకు మాములుగా బతికిన ఆటగాళ్లు.. ఈ మహమ్మారితో దయనీయ స్థితులు ఎదుర్కొంటున్నారు. వారేం ప్రజల జాలి కోరుకోవడం లేదు. అందరిని సమానంగా చూడాలంటున్నారు. ఇంగ్లండ్, సౌతాఫ్రికా చివరకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డులు కూడా దివ్యాంగ క్రికెటర్ల వింగ్ కలిగి ఉన్నాయి. ఈ విషయంలో బీసీసీఐ ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు.'అని పీసీసీఐ సెక్రటరీ జనరల్ రవి చౌహన్ తెలిపారు.

రైనా.. అఫ్రిదిలా రిటైర్మెంట్ వెనక్కి తీసుకో: ఆకాష్ చోప్రా

Story first published: Friday, August 21, 2020, 17:50 [IST]
Other articles published on Aug 21, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+