
బుడగలోనే వినోదం..
బయో బబుల్ వాతావరణంలో క్రీడా టోర్నీలు జరుగుతుంటే.. కట్టుదిట్టమైన భద్రతా వలయంలో సినిమా, సిరీయల్ ఎంటర్‌టైన్‌మెంట్ షో షూటింగ్‌లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వరల్డ్ పాపులర్ టీ20 టోర్నీ ఇండియన్ ప్రీమిర్ లీగ్(ఐపీఎల్)2020 సీజన్‌కు రంగం సిద్దమైంది. ఎన్నో అవాంతరాలు.. మరెన్నో ఒడిదొడుకులు దాటుకొని మరో 10 రోజుల్లో సెప్టెంబర్ 19న ఈ క్యాష్ లీగ్‌కు తెరలేవనుంది. మరోవైపు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి బిగ్‌బాస్-4 కూడా వచ్చేసింది. రెండు రోజుల క్రితమే ఈ కాంట్రవర్సియల్ షో ప్రారంభమైంది. అయితే రెండు స్టార్ ఇండియా చానెళ్లకు చెందినవే.

బిగ్ బాస్ vs ఐపీఎల్ 2020..
రియాల్టీ షో అయిన బిగ్ బాస్.. రియల్ లైవ్ షో అయిన ఐపీఎల్ 2020 సమయాలు క్లాష్ కానున్నాయి. ఈ సీజన్ ఐపీఎల్ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రసారం కానుండగా.. మధ్యాహ్నం మ్యాచ్ 3.30 గంటలకు మొదలవుతుంది. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 రాత్రి 9.30 గంటలకు, శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పుడిదే అభిమానులను అయోమయానికి గురిచేస్తుంది.
అయితే ఈ ఎంటర్‌టైన్‌మెంట్ ఫైట్‌లో ఐపీఎల్ 2020 సీజనే పై చేయి సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే గత ఆరు నెలలుగా ఎలాంటి క్రికెట్ జరగకపోవడం.. వరల్డ్ ఫేమస్ ఆటగాళ్లంతా ఈ లీగ్‌లో బరిలోకి దిగడం.. తమ ఆరాథ్య ఆటగాళ్ల కోసం అభిమానుల నిరీక్షిస్తుండటం.. అంతేకాకుండా స్థానికత పేరుతో ఫ్రాంచైజీలు చేసే హడావిడి బిగ్ బాస్ 4 వ్యూయర్ షిప్‌ను దెబ్బతీయనుంది.

గంగవ్వ స్పెషల్ అట్రాక్షన్..
అంతేకాకుండా ఈ సీజన్ బిగ్‌బాస్ కంటెస్టెంట్లలో ఫేమ్ ఉన్న సెలెబ్రిటీలు లేకపోవడం కూడా ఐపీఎల్ 2020 సీజన్‌కు ప్లస్ కానుంది. 16 మంది కంటెస్టెంట్స్‌లో యూట్యూబ్ స్టార్, మైవిలేజ్ షో నటి గంగవ్వనే ప్రత్యేకత. ఆమెను అస్త్రంగా వాడుకునే బిగ్‌బాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడనే విషయం గత రెండు ఎపిసోడ్లతో స్పష్టమైంది. ఇప్పట్లో ఆమెను ఎలిమినేట్ చేసే సాహసం కూడా బిగ్ బాస్ చేయకపోవచ్చు. అయితే బిగ్ బాస్ -4 సక్సెస్ అనేది టాస్క్‌లు, హౌస్‌లో గొడవలపై ఆధారపడి ఉంటుంది. షో గురించి హాట్ టాపిక్ అయితే తప్పా పెద్ద లాభం ఉండదు.
ఈ షోను యూత్, మధ్య వయస్కులు, అర్భన్ ప్రాంతాలే వారే ఎక్కువ చూస్తారు. అదేవిధంగా ఐపీఎల్ చూసేది కూడా వీరే. ఇదే బిగ్‌బాస్ వ్యూయర్ షిప్‌ను దెబ్బతీయనుంది. అంతేకాకుండా తెలుగు ప్రజలు కేవలం సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లే ఫాలో అవుతారా అంటే అది లేదు. ఇక్కడా ఆరాధ్య ఆటగాళ్ల జట్లకే ప్రాధాన్యత ఉంటుంది. సన్‌రైజర్స్‌ను సపోర్ట్ చేస్తూనే మరో వైపు రోహిత్ శర్మ ఫ్యాన్స్ ముంబై ఇండియన్స్‌ను.. కోహ్లీ అభిమానులు ఆర్‌సీబీని ఫాలో అవుతారు. ఇది కూడా బిగ్ బాస్‌కు దెబ్బే.

కరోనా ఎఫెక్ట్..?
అయితే ప్రేక్షకాదరణ విషయంలో ఐపీఎల్ 2020 సీజన్‌కు డోకా లేనప్పటికీ.. కరోనా ఒక్కటే గజ్జున వణికిస్తుంది. బిగ్ బాస్ అంటే ఓ ఇంట్లో జరుగుతుంది. కాబట్టి ఆ రియాల్టీ షోకు కరోనా సోకే అవకాశమే లేదు. కానీ ఐపీఎల్ మైదానాల్లో జరుగుతుంది. వేదికలు.. హోటళ్లకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఏ ఆటగాడికైనా కరోనా వస్తే.. టోర్నీ మొత్తానికే ఎసరు రానుంది. అందుకే అత్యంత భద్రతా వలయంలో టోర్నీ నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లను చేస్తుంది. ఇప్పటికే జట్లు, ఆటగాళ్లకు కఠిన ప్రొటోకాల్స్ గురించి తెలియజేసింది.
చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో ఆయా ఫ్రాంచైజీలు కూడా మేల్కొన్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇదొక్కటే ఐపీఎల్ 2020 సీజన్‌ను వెంటాడుతోంది. మొత్తానికి ధనాధన్ లీగ్ ధాటికి వ్యూయర్ షిప్ పరంగా బిగ్ బాస్ 4 విలవిలలాడనుంది. దీనికి గతేడాది టీర్పీ రేటింగ్సే సాక్ష్యం. ఐపీఎల్ లేని సయంలో వచ్చిన బిగిబాస్-3.. ఆ చానెల్లో ప్రసారమయ్యే కార్తీక దీపం రేటింగ్స్‌ను అందుకోలేకపోయింది.
బీసీసీఐ నా పాటను కాపీ కొట్టింది.. ఐపీఎల్ 2020 థీమ్ సాంగ్ నాదే: ర్యాపర్ కృష్ణ కౌల్


Click it and Unblock the Notifications
