న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బీసీసీఐ నా పాటను కాపీ కొట్టింది.. ఐపీఎల్ 2020 థీమ్ సాంగ్ నాదే: ర్యాపర్ క‌ృష్ణ కౌల్

Rapper Krishna Kaul alleges IPL has plagiarised his song ‘Dekh Kaun Aya Waapas’

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్‌కు మరో 10 రోజుల్లో తెరలేవనుండగా.. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మరో సమస్య వచ్చి పడింది. డ్రీమ్ 11 ఐపీఎల్ 13వ సీజన్ కోసం అభిమానులను ఆకట్టుకునేందుకు బోర్డు తాజాగా ఓ థీమ్ సాంగ్‌ను విడుదల చేసింది. ఈ సీజన్ లీగ్ కోసం ఎన్నో ఆటంకాలు.. మరెన్నో ఒడుదొడుకులను ఎదుర్కొన్న బీసీసీఐ.. ఈ క్రమంలోనే కరోనాపై యుద్ధ భేరిలాగా మళ్లీ ఈ టోర్నీ భారత్‌లో జరుగుతుందనే ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఓ అద్భుతమైన పాటను చిత్రీకరించింది. ఈ సాంగ్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకోగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 'ఆయేంగే హమ్‌ వాపస్‌' అనే లిరిక్స్‌తో సాగిన ఈ పాట వింటుంటే గూజ్ బంప్స్ వస్తున్నాయి.

నా పాటను పేరడి చేశారు..

నా పాటను పేరడి చేశారు..

అయితే ఈ పాట తనదేనని ర్యాపర్ కృష్ణ కౌల్ ఆరోపిస్తున్నాడు. తన ‘దేఖ్ కౌన్ ఆయా వాపాస్ 'సాంగ్‌ను 'ఆయేంగే హమ్‌ వాపస్‌'‌గా పేరడి చేసి ఐపీఎల్ 2020 థీమ్ సాంగ్‌ను రూపొందించారని, తనకు ఏ మాత్రం క్రెడిట్ ఇవ్వాలేదని ట్విటర్ వేదికగా వాపోయాడు. చట్టపరమైన చర్యలు తీసుకుంటానని తెలిపాడు. ‘హే గాయ్స్.. ఐపీఎల్ నా ‘దేఖ్ కౌన్ ఆయా వాపాస్ 'సాంగ్‌‌‌ను ‘ఆయేంగే హమ్‌ వాపస్‌'‌గా పేరడి చేసి ఈ సీజన్ థీమ్ సాంగ్‌గా రిలీజ్ చేసింది. కనీసం నాకు క్రెడిట్ కూడా ఇవ్వలేదు. ఈ విషయాన్ని నా సహచర ఆర్టీస్టులకు, ట్విటర్ ఫ్రెండ్స్‌కు తెలియజేయాలనే ట్వీట్ చేస్తున్నా. చట్టపరమైన చర్యలు తీసుకుంటా'అని ట్వీట్ చేశాడు.

స్పందించిన ఐపీఎల్ ర్యాపర్..

స్పందించిన ఐపీఎల్ ర్యాపర్..

ఇక కృష్ణ కౌల్ ఆరోపణల నేపథ్యంలో ఐపీఎల్ 2020 సీజన్ థీమ్ సాంగ్ పాడిన ర్యాపర్ స్పందించాడు. తానే కేవలం పాటను మాత్రమే పాడనని, కంపోజ్ చేయలేదని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పష్టం చేశాడు. ‘డ్రీమ్ 11 ఐపీఎల్ ట్రాక్ ‘ఆయేంగే హమ్ వాపస్'గా సాంగ్ నేను రాయలేదు. కంపోజ్ చేయలేదు. ఆ పాటలోని వాయిస్ మాత్రమే నాది.'అని తన ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొన్నాడు.

10 రోజుల్లో ధనాధన్ లీగ్ షురూ..

10 రోజుల్లో ధనాధన్ లీగ్ షురూ..

ఇక షెడ్యూల్ ప్రకారం మార్చి 29న ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ కరోనా కారణంగా నిరవధికంగా వాయిదా పడింది. అనంతరం ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్ కూడా వాయిదా పడటంతో ఈ క్యాష్ రిచ్ లీగ్‌కు మార్గం సుగుమమైంది. అయితే భారత్‌లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో లీగ్‌ను యూఏఈకి తరలించారు. ఈ మధ్యలో ఎదురైన ఎన్నో ఆటంకాలను అధిగమించిన బీసీసీఐ.. చివరకు సెప్టెంబర్ 19 నుంచి నంబర్ 10 వరకు ముహుర్తం ఖారారు చేస్తూ షెడ్యూల్‌ను విడుదల చేసింది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.

Story first published: Tuesday, September 8, 2020, 14:02 [IST]
Other articles published on Sep 8, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X