Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చాడు.. టీ20ల్లో చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు!

టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఐపీఎల్, దేశీయ క్రికెట్‌లో భువనేశ్వర్ కుమార్ నిలకడైన ప్రదర్శనల ఆధారంగా న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భువీ భారత జట్టులోకి తీసుకున్నారు. భువనేశ్వర్ కుమార్ తన స్వింగ్, అనుభవంతో కివీస్ బ్యాటర్లను చెమటలు పట్టించగలడని భారత అభిమానులు ఆశించారుయ కానీ ఈ రీ-ఎంట్రీ కెరీర్‌లోనే అత్యంత చెత్త దశగా మిగిలింది.

IND vs NZ: సిరీస్ గెలిచాం కానీ పరువు పోయింది.. కివీస్ చేతిలో ఘోర ఓటమి!

IND vs NZ: సిరీస్ గెలిచాం కానీ పరువు పోయింది.. కివీస్ చేతిలో ఘోర ఓటమి!

అన్ని మ్యాచ్‌లలో ఫ్లాప్
ఈ సిరీస్‌లో భువనేశ్వర్ కుమార్ 4 మ్యాచ్‌లకు తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. తొలి మూడు మ్యాచ్‌లలో నిలకడగా విఫలమవడంతో అతడిని నాలుగో టీ20 నుంచి తొలగించారు. కానీ హామిల్టన్‌లో జరిగిన ఐదో, చివరి మ్యాచ్‌కు తిరిగి జట్టులోకి తీసుకున్నారు. అయితే వేదిక మారినంత మాత్రాన భువీ అదృష్టం మారలేదు. సిరీస్ పొడవునా వికెట్లు తీయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు.

Bhuvneshwar Kumar Returns After 4 Years Registers Worst Bowling Average in T20I Series Full Details

ఈ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో నాలుగు ఇన్నింగ్స్‌లలో బౌలింగ్ చేసిన భువనేశ్వర్ కుమార్ కేవలం ఒక వికెట్‌తో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఈ సమయంలో కివీస్ బ్యాటర్లు భువీ బౌలింగ్‌లో భారీగా పరుగులు సాధించారు. ఫలితంగా భువనేశ్వర్ కుమార్ ఎకానమీ రేటు 11.25గా, బౌలింగ్ సగటు 180.00గా నమోదైంది. ఈ అత్యంత నిరాశాజనకమైన ప్రదర్శనతో భువనేశ్వర్ కుమార్ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో అత్యంత చెత్త బౌలింగ్ సగటు కలిగిన చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.

IND vs NZ: అర్థ శతకాలతో చెలరేగిన ఇషాన్, శ్రేయస్.. కివీస్ ముంగిట భారీ స్కోరు!

Also Read

IND vs NZ: అర్థ శతకాలతో చెలరేగిన ఇషాన్, శ్రేయస్.. కివీస్ ముంగిట భారీ స్కోరు!

భువనేశ్వర్ కుమార్ న్యూజిలాండ్‌కు చెందిన కైల్ జేమీసన్ ఐదేళ్ల క్రితం నెలకొల్పిన చెత్త రికార్డును (175.00) అధిగమించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి వచ్చిన వెంటనే భారత స్టార్ స్వింగ్ బౌలర్ ఇలాంటి గణాంకాలను నమోదు చేస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. ఈ సిరీస్ వైఫల్యం తర్వాత భువనేశ్వర్ కుమార్ అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్లే కనిపిస్తోంది.

Story first published: Sunday, November 1, 2026, 18:39 [IST]
Other articles published on Nov 1, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+