Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఈ పరిస్థితుల్లో ఐపీఎల్ కష్టం: బీసీసీఐ ట్రెజరర్

BCCI treasurer Arun Dhumal Says At the moment, IPL 2020 is not possible

ముంబై: కరోనా కట్టడిలో భాగంగా ఈ నెలాఖరుదాకా పొడిగించిన 'లాక్‌డౌన్‌ 4.0'లో కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చింది. స్టేడియాలు, క్రీడా సముదాయాలు తెరుచుకోవచ్చని, ప్లేయర్లు ప్రాక్టీస్ చేసుకోవచ్చని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. అయితే మైదానాలు, స్టేడియాల వద్ద ఏ ఒక్క ప్రేక్షకుణ్ని అనుమతించరాదని ఆ శాఖ వెల్లడించిన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.

ప్రయాణలపై ఆంక్షలున్నాయి కదా..

ప్రయాణలపై ఆంక్షలున్నాయి కదా..

ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తి కారణంగా నిరవధికంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఖాళీ మైదానల్లో జరుగుతుందనే అశ అభిమానుల్లో మొదలైంది. అయితే బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ ధుమాల్ మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్ జరగడం సాధ్యం కాదన్నారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్ నిర్వహించడం అసాధ్యం. ఎందుకంటే ఇప్పటికీ ప్రయాణాలపై ఆంక్షలు అలాగే ఉన్నాయి. ప్రయాణం చేయకుండా ఐపీఎల్‌ ఎలా జరుగుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలు పరిశీలిస్తున్నాం. దాన్ని బట్టే మేం ప్రణాళికలు రచిస్తాం'' అని అరుణ్ ధుమాల్ తెలిపారు.

'క్రికెటర్లు తమ ట్రైనింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు ఒక అవకాశం లభించింది. ఆటగాళ్లు స్టేడియాలకు వెళ్లొచ్చు. ఔట్‌డోర్‌ ప్రాక్టీస్‌లో పాల్గొనవచ్చు. ఆటగాళ్లందరూ ఒక్కో ప్రాంతంలో ఉండటంతో ఒకే దగ్గర జట్టు మొత్తం కలిసి సాధన చేసే ఛాన్స్‌ లేదని' ఆయన పేర్కొన్నారు.

రూ.4వేల కోట్ల నష్టం..

రూ.4వేల కోట్ల నష్టం..

ఐపీఎల్ 2020 సీజన్ ఈ ఏడాది జరగకపోతే బీసీసీఐకి సుమారు 4వేల కోట్ల రూపాయల భారీ నష్టం వాటిల్లుతుందని ఇప్పటికే బోర్డు వర్గాలుస్పష్టం చేశాయి. షెడ్యూల్ ప్రకారం మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఈ క్యాష్ రిచ్ లీగ్.. కరోనా కారణంగా తొలుత ఏప్రిల్ 15కు వాయిదా వేశారు. అనంతరం దేశంలో లాక్‌డౌన్ పొడిగించడంతో నిరవధికంగా వాయిదా పడింది. ఇప్పటికైతే ఈ మెగాటోర్నీపై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

రద్దయితే కోత తప్పదు..

రద్దయితే కోత తప్పదు..

అయితే ఈ సీజన్ ఐపీఎల్ రద్దయితే భారత క్రికెటర్ల జీతాల్లోనూ కోత పడనుందని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ఇటీవలే హింట్ ఇచ్చాడు. ఓ జాతీయ చానెల్‌తో మాట్లాడుతూ.. బీసీసీఐ ఆర్థిక పరిస్థితి సమక్షిస్తున్నామని, ఐపీఎల్ జరగకుంటే ఆటగాళ్ల జీతాల్లో కోత తప్పదని సూచన ప్రాయంగా తెలిపాడు. ‘బీసీసీఐ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని సమీక్షిస్తున్నాం. ఒకవేళ ఐపీఎల్‌ 2020 సీజన్‌ జరగకపోతే మాత్రం బీసీసీఐకి సుమారు రూ. 4వేల కోట్లు నష్టం వాటిల్లనుంది. ఇది చాలా పెద్ద మొత్తం కాబట్టి పూర్తి స్థాయిలో సమీక్షించి ఆటగాళ్ల జీతాల్లో కోతపై నిర్ణయం తీసుకుంటాం. అయితే ఐపీఎల్ జరిగితే మాత్రం క్రికెటర్ల జీతాల్లో ఎలాంటి కోతలుండవు'అని దాదా స్పష్టం చేశాడు.

మరోవైపు ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ వాయిదా పడే అవకాశం ఉందని, దాంతో ఐపీఎల్‌కు లైన్ క్లియర్ అవుతుందనే వాదన వినిపిస్తుంది.

కోహ్లీ పద్దతి మార్చుకో.. అతనేం వాటర్ బాయ్ కాదు: కైఫ్

Story first published: Monday, May 18, 2020, 15:18 [IST]
Other articles published on May 18, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+