For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

శ్రీలంకలో ఐపీఎల్‌.. బీసీసీఐ ఏమన్నదంటే?

BCCI official Says No proposal from Sri Lanka Cricket to host IPL 2020
IPL 2020 : BCCI Reaction On Sri Lanka To Host IPL 13

ముంబై: కరోనా వైరస్ కారణంగా యావత్ క్రీడా ప్రపంచం స్తంభించింది. ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌, టెన్నిస్‌ గ్రాండ్‌స్లామ్స్‌, షూటింగ్ ప్రపంచకప్ సహా అన్నీ టోర్నీలు వాయిదాపడటమో.. లేదా రద్దవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2020 సీజన్‌ కూడా నిరవధికంగా వాయిదా పడింది. తొలుత ఏప్రిల్‌ 15వ వరకూ వాయిదా వేసిన బీసీసీఐ.. దేశంలో లాక్‌డౌన్ పొడిగించడంతో నిరవధిక వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఇది అమలులో ఉంటుందని గురువారం అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

శ్రీలంక ఆఫర్..

శ్రీలంక ఆఫర్..

ఈ నేపథ్యంలో ఐపీఎల్‌కు ఆతిథ్యమివ్వడానికి సిద్ధంగా ఉన్నామని శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. 'ఒకవేళ ఐపీఎల్‌ ఈ ఏడాది రద్దయితే భారత క్రికెట్‌ బోర్డుతో పాటు ఐపీఎల్‌ వాటాదారులు 500 మిలియన్‌ డాలర్లు (రూ.3800 కోట్లు) నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి 2009లో దక్షిణాఫ్రికాలో నిర్వహించినట్టుగానే ఈసారి కూడా ఇతర దేశానికి తరలిస్తే ఆర్థికంగా కలిసి వస్తుంది. ఐపీఎల్‌కు ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ మా ప్రతిపాదన బీసీసీఐకి నచ్చితే శ్రీలంక ఆరోగ్య శాఖ అధికారుల పర్యవేక్షణలో అన్ని సౌకర్యాలను కల్పిస్తాం' అని లంక బోర్డు ప్రెసిడెంట్ షమ్మి సిల్వ తెలిపారు.

ఈ పరిస్థితుల్లో ఈ చర్చ సరికాదు..

ఈ పరిస్థితుల్లో ఈ చర్చ సరికాదు..

ఈ ప్రకటనతో ఐపీఎల్ శ్రీలంకలో జరుగుతుందనే ప్రచారం జోరుగా సాగింది. అయితే తాజాగా ఈ శ్రీలంక ఆఫర్‌పై ఓ బీసీసీఐ ఉన్నతాధికారి స్పందించారు. ప్రపంచమంతా నిర్బంధంలో ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో ఐపీఎల్‌పై ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోలేమని స్పష్టం చేశారు. అయితే శ్రీలంక క్రికెట్‌ బోర్డు నుంచి ఇప్పటివరకు ఎటువంటి ప్రతిపాదన రాలేదని, కానీ, ప్రస్తుతం వాటి గురించి చర్చించడం సరికాదని అభిప్రాయపడ్డారు.

శ్రీలంకతో పాటు మరిన్ని దేశాలు..

శ్రీలంకతో పాటు మరిన్ని దేశాలు..

మరో బీసీసీఐ సీనియర్‌ అధికారి మాట్లాడుతూ. ‘ఐసీసీలో బీసీసీఐ మిత్రపక్షంగా శ్రీలంక ఉంది. వారి ప్రతిపాదనను అర్థంచేసుకోగలం. కానీ, ఐసీసీ ఛైర్మన్‌ అధ్యక్షుడు మనోహర్ వచ్చే నెలలో పదవీ విరమణ చేయవచ్చు. అంతేకాక ఐపీఎల్‌ను భారత్‌ వెలుపల నిర్వహించాలని భావిస్తే శ్రీలంకతో పాటు మరిన్ని దేశాలు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాయి'అని తెలిపాడు.

తబ్లిగీ జమాత్‌పై వివాదాస్పద ట్వీట్.. ట్రెండింగ్‌లో స్టార్ రెజ్లర్ బబితా ఫోగాట్!!

భారత్ కంటే తక్కువ..

భారత్ కంటే తక్కువ..

ఇక శ్రీలంకలో కూడా ప్రస్తుతం కర్ఫ్యూ కొనసాగుతుంది. కానీ, భారత్‌తో పోలిస్తే ఆ దేశంలో కరోనా తీవ్రత అంతగా లేదు. లంకలో దాదాపు 200 మందికి కరోనా సోకగా, భారత్‌లో ఈ ప్రాణాంతక వైరస్ బాధితుల సంఖ్య 13వేలకు పైగా చేరింది. ఐపీఎల్‌ను నిర్వహిస్తే తమ బోర్డు ఆర్థికంగా బలపడుతుందని శ్రీలంక ఆశిస్తోంది. అయితే బీసీసీఐ సెప్టెంబర్-అక్టోబర్‌, అక్టోబర్‌-నవంబర్‌ సమయంలో ఐపీఎల్‌ను నిర్వహించే అవకాశాలు లేకపోలేదు. ఇక ఐపీఎల్‌ను ఇప్పటివరకు రెండు సార్లు భారత్‌ వెలుపల నిర్వహించిన విషయం తెలిసిందే. ఎన్నికల కారణంగా 2009లో దక్షిణాఫ్రికాలో, 2014లో తొలి అర్ధభాగాన్ని యూఏఈలో నిర్వహించారు.

Story first published: Friday, April 17, 2020, 18:42 [IST]
Other articles published on Apr 17, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+