Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తాజా అప్‌డేట్.. జూలై, సెప్టెంబర్‌ మధ్యలో ఐపీఎల్!!

BCCI looking at July-September window for IPL 2020 due to Coronavirus outbreak

ముంబై: కరోనా వైరస్‌ దెబ్బకు ప్రపంచమే ఆగిపోయింది. క్రీడారంగం అయితే అతలాకుతం అయ్యింది. వేగంగా వ్యాప్తిచెందుతున్న ఈ మహమ్మారిని అడ్డుకునేందుకు ముందు జాగ్రత్తగా కొన్ని టోర్నీలు పూర్తిగా రద్వవ్వగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. ఇక అంతర్జాతీయ క్రికెట్‌పై ఇది పెను ప్రభావమే చూపించింది.

క్యా‘కరోనా’.. తప్పలేదు..

క్యా‘కరోనా’.. తప్పలేదు..

మొదట ఖాళీ స్టేడియాల్లో మ్యాచులు నిర్వహించాలని భావించినా ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో వాయిదా వేయక తప్పలేదు. ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)ను ఈ మహమ్మారి వదల లేదు. భారత్‌లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో ఈ క్యాష్‌రిచ్ లీగ్‌ను తాత్కలికంగా నిలిపివేయడమే ఉత్తమమని భావించిన బీసీసీఐ ఏప్రిల్‌ 15కు వాయిదా వేసింది.

అప్పడైనా జరుగుతుందా?

అప్పడైనా జరుగుతుందా?

కానీ అప్పటికీ ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా పరిస్థితులు ఎలాగుంటాయో చెప్పలేం. దీంతో ఏప్రిల్‌ 15 తర్వాత కూడా ఐపీఎల్‌ జరుగుతుందా? జరిగితే మొత్తమా? కుదించా? విదేశీ ఆటగాళ్లు ఉంటారా? ఉండరా? భారత్‌లోనా? లేక మరే దేశంలోనా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ క్యాష్ రిచ్ లీగ్ నిర్వహించేందుకు ఉన్న మార్గాలన్నిటిపై బీసీసీఐ సమాలోచనలు చేస్తోంది.

బీసీసీఐ ప్లాన్-బి..

బీసీసీఐ ప్లాన్-బి..

ఇందులో భాగంగానే మినీ ఐపీఎల్ నిర్వహించే ప్రతిపాదనను పరిశీలించింది. 8 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించి వరల్డ్‌కప్ ఫార్మాట్‌లో ఆడించాలని ఓ ఆప్షన్‌గా పెట్టుకుంది. తాజాగా ఏప్రిల్ వరకు కూడా పరిస్థితులు అదుపులోకి రాకపోతే ఎలా? అని ప్లాన్-బి కూడా తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడు కుదరకపోతే.. ఐపీఎల్‌ను జూన్‌-సెప్టెంబర్ మధ్యలో నిర్వహిస్తే ఎలా ఉంటుందనే అంశంపై కూడా బీసీసీఐ యోచిస్తోందని తాజా సమాచారం. ఐసీసీ ఫ్యూచర్ టూర్ ప్లానింగ్ (ఎఫ్‌టీపీ) ప్రకారం సెప్టెంబ‌ర్‌లో ఆసియా కప్‌ ఉంటుంది. అనంతరం ఇంగ్లండ్‌లో పాకిస్థాన్‌ పర్యటించనుంది. జూన్‌, జులైలో ఇంగ్లండ్ 100 బాల్ టోర్నీని ప్రారంభించాల్సి ఉంది. ఇంగ్లండ్‌, పాక్‌ను పక్కన పెట్టినా ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌ జట్లకు ప్రత్యేకమైన, ముందుగా నిర్ణయించిన పెద్ద సిరీసులు ఏమీ లేవు. ఆసియా కప్‌ను మినహాయిస్తే టీ20 ప్రపంచకప్‌ వరకు శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ మినహా భారత్‌‌కు మరో సిరీస్ లేదు. ఈ నేపథ్యంలోనే జూన్-సెప్టెంబర్ మధ్య ఐపీఎల్ నిర్వహిస్తే ఎలా ఉంటుందనేదానిపై చర్చ జరిగినట్లు విశ్వసనీయ సమాచారం.

ఐపీఎల్ రద్దయితే ధోనీ పరిస్థితేంటి?

విదేశాల్లో నిర్వహిస్తే..

విదేశాల్లో నిర్వహిస్తే..

భారత్‌లో ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్‌-2009ని సౌతాఫ్రికాలో 37 రోజులు నిర్వహించారు. ఇప్పుడూ పరిస్థితులు అనుకూలిస్తే కొన్ని రోజులు విదేశాల్లో, మరికొన్ని రోజులు స్వదేశంలో నిర్వహించాలనే ఆలోచన కూడా చేసినట్లు తెలుస్తోంది. కొవిడ్‌-19 వ్యాప్తిని బట్టి మొత్తం టోర్నీని తరలిస్తే ఎలా ఉంటుందని కూడా చర్చించారట. ఇక 37 రోజుల్లో ప్రతి వారం కోల్పోయే కొద్దీ 9 నుంచి 11 మ్యాచులు రద్దు చేయాల్సి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని జూన్‌-సెప్టెంబర్‌ మధ్య కాలంలో ఐపీఎల్‌ కుదురుతుందో లేదో బీసీసీఐ, ఫ్రాంచైజీలు కలిసి సమాలోచనలు చేస్తున్నాయన్నది ఐపీఎల్‌కు సంబంధించి తాజా అప్‌డేట్.

Story first published: Wednesday, March 18, 2020, 13:41 [IST]
Other articles published on Mar 18, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+