Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆగస్టులో కోహ్లీ సేన శ్రీలంక పర్యటన!

BCCI agrees to Indian team touring Sri Lanka in August

ముంబై: శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ20ల పర్యటనకు భారత క్రికెట్ నియంత్ర మండలి( బీసీసీఐ) ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఈ మ్యాచులు వీక్షించేందుకు 30-40% అభిమానులను అనుమతించాలని శ్రీలంక క్రికెట్‌ బోర్డు భావిస్తోంది. ఏదేమైనప్పటికీ ప్రభుత్వ ఆదేశాల మేరకే నడుచుకుంటామని తెలిపింది.

ఆటలన్నీ ఆగమాగం..

ఆటలన్నీ ఆగమాగం..

కరోనా వైరస్‌ కారణంగా మార్చి నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. అన్ని దేశాలూ ఏదో ఒక రూపంలో స్వీయ నిర్భంధంలోకి వెళ్లాయి. వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ టోర్నీలు వాయిదాపడ్డాయి. ఇప్పుడిప్పుడే కరోనాపై ఒక అంచనా వస్తుండటంతో తిరిగి క్రికెట్‌ను మొదలు పెట్టేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా పర్యటనను బీసీసీఐ ఖాయం చేసేసింది. ఇప్పుడు శ్రీలంక పర్యటనకు ఆమోదం తెలిపినట్టు తెలిసింది. సౌతాఫ్రికా సిరీస్‌ మధ్యలోనే ఆగిపోయిన తర్వాత టీమ్ఇండియా క్రికెట్‌ ఆడలేదు.

శ్రీలంకలో తక్కువ..

శ్రీలంకలో తక్కువ..

ఇతర దేశాలతో పోలిస్తే శ్రీలంకలో వైరస్‌ ప్రభావం తక్కువగా ఉండటంతో బీసీసీఐ అంగీకరించిందని సమాచారం. వాస్తవంగా ఈ పర్యటన జూన్‌లో ఉండాలి. వైరస్‌ కారణంగా వాయిదా పడింది. గత ప్రణాళిక ప్రకారమే వేదికలు ఉంటాయి. 30-40 శాతం సీట్లు నింపేందుకు శ్రీలంక క్రికెట్‌ సిద్ధమవుతోంది. అయితే ప్రభుత్వం అనుమతిస్తేనే ఇది సాధ్యమవుతుంది.

అభిమానుల మధ్యలోనే..

అభిమానుల మధ్యలోనే..

'30-40% వీక్షకులను అనుమతించాలని భావిస్తున్నాం. అభిమానులు ఒక్కొక్కరూ మీటర్‌ దూరం కూర్చొని మ్యాచులను వీక్షించాల్సి ఉంటుంది. ఏదేమైనప్పటికి తుది నిర్ణయం వైద్యశాఖ తీసుకుంటుంది. మేం వారి సూచనలు పాటించాల్సిందే' అని శ్రీలంక క్రికెట్‌ బోర్డు సభ్యుడొకరు మీడియాకు తెలిపారు. శ్రీలంకలో ఆసియాకప్‌-2020ని నిర్వహించేందుకు పాకిస్థాన్‌ ఈ మధ్యే అంగీకరించిన సంగతి తెలిసిందే.

జూన్‌లో ఉండాల్సింది కానీ..

జూన్‌లో ఉండాల్సింది కానీ..

వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం జూన్ నెలలోనే శ్రీలంక పర్యటనకి భారత్ వెళ్లాల్సింది. అక్కడ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేలా షెడ్యూల్‌ రూపొందించారు. కానీ.. కరోనా వైరస్ కారణంగా ఆగస్టులోనే అక్కడికి వెళ్లేందుకు బీసీసీఐ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సెప్టెంబరులో జరగనున్న ఆసియా కప్ 2020కి కూడా శ్రీలంకనే ఆతిథ్యమివ్వనుండటంతో.. ఈ టూర్‌ టీమిండియాకి కలిసొచ్చే అవకాశం ఉందని టీమ్‌మేనేజ్‌మెంట్ భావిస్తోంది.

129 పరుగులకే 7 వికెట్లు.. ఓడాల్సిన వన్డేలో 2 వికెట్లతో గెలిచిన భారత్!

Story first published: Wednesday, June 10, 2020, 21:43 [IST]
Other articles published on Jun 10, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+