Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పీసీబీ షాకింగ్ నిర్ణయం: చేతులెత్తేసిన బాబర్ ఆజం!

ఇంగ్లాండ్ జట్టుతో ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం వేదికగా బుధవారం నుంచి ప్రారంభం కానున్న మూడో టెస్టుకు ముందు పాక్ క్రికెట్లో తీవ్ర కలకలం రేగుతోంది. ఇప్పటికే తొలి రెండు టెస్టుల్లో ఘోర పరాజయాలను చవిచూసి ఇంగ్లాండ్ చేతిలో టెస్ట్ సిరీస్‌‌ను కోల్పోయిన పాకిస్తాన్ జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇన్నింగ్స్, 194 పరుగుల తేడాతో పరాజయం పాలైన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఊహించని నిర్ణయాలు తీసుకుంది.

IND vs PAK: బ్రాడ్‌కాస్టర్‌కు భారీ బొక్క.. నట్టేట ముంచిన పాక్!

IND vs PAK: బ్రాడ్‌కాస్టర్‌కు భారీ బొక్క.. నట్టేట ముంచిన పాక్!

రెండో టెస్ట్ పూర్తయిన వెంటనే ఏకంగా ఏడుగురు ఆటగాళ్లను.. మహ్మద్ రిజ్వాన్, ఇమామ్-ఉల్-హక్, సల్మాన్ అలీ ఆఘా, అలీ ఉస్మాన్, ఆమిర్ జమాళ్, మహమ్మద్ అవేస్ జాఫర్, ఖుర్రమ్ షెహజాద్‌లను పీసీబీ హుటాహుటిన స్వదేశానికి పంపించివేసింది. అంతేకాకుండా హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్‌లను కూడా బాధ్యతల నుంచి తొలగించి వారి స్థానంలో వైట్-బాల్ కోచ్ మైక్ హెస్సన్, యాష్లే నాఫ్కేలకు బాధ్యతలు అప్పగించింది.

Babar Azam Shocked as Pakistan Cricket Board Sends 7 Players and Coach Home Before Test Full Details

ఈ ఊహించని పరిణామాలపై మ్యాచ్‌కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం నోరు విప్పారు. ఈ మార్పుల గురించి తనకు ముందే ఏమైనా తెలుసా అని ప్రశ్నించగా.. తనకూ ఈ విషయం తర్వాతే తెలిసిందని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. "ఈ నిర్ణయాలు నాకు కూడా పెద్ద షాక్. ఇవన్నీ నాకు తర్వాతే తెలిసాయి. పీసీబీ ఈ నిర్ణయాలు తీసుకుంది కాబట్టి, వారే దీనికి తగిన సమాధానం చెప్పగలరు" అని బాబర్ ఆజం స్పష్టం చేశారు.

IND vs PAK: భారత్‌ను ఓడిస్తాం.. టైటిల్ గెలుస్తాం: పాక్ కోచ్

Also Read

IND vs PAK: భారత్‌ను ఓడిస్తాం.. టైటిల్ గెలుస్తాం: పాక్ కోచ్

అంతే కాకుండా ఏడుగురు కీలక ఆటగాళ్లతో పాటు కోచ్ ను ఇంటికి పంపడం ఎంతవరకు కష్టంగా అనిపించిందని అడగగా.. అది కష్టం అనిపించలేదని, కానీ చాలా ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు. క్రమశిక్షణారాహిత్యంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు విచారణ జరుపుతున్నట్లు వార్తలు రాగా.. ఆ విచారణ దేని గురించి అన్నది తనకు ఎలాంటి అవగాహన లేదని, ఈ నిర్ణయాల్లో తన ప్రమేయం ఏ మాత్రం లేదని బాబర్ కుండబద్ధలు కొట్టారు. ఇంగ్లాండ్‌లో ముగింపు మ్యాచ్‌నైనా గెలిచి గౌరవప్రదంగా సిరీస్‌ను ముగించాలని బాబర్ సేన భావిస్తోంది.

Story first published: Tuesday, September 8, 2026, 19:22 [IST]
Other articles published on Sep 8, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+