Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంగ్లీష్ స్పష్టంగా మాట్లాడేందుకు నేనమన్నా తెల్లోడినా.. నెమ్మదిగా నేర్చుకుంటా: పాక్ క్రికెటర్

Babar Azam responds to Tanvir Ahmed’s ‘improve your English’ remark

న్యూఢిల్లీ: ఇంగ్లీష్ స్పష్టంగా మాట్లాడేందుకు తానేమి తెల్లోడిని కాదని.. క్రికెటర్‌ను మాత్రమేనని ఇటీవల పాకిస్థాన్ పరిమిత ఓవర్ల జట్టు సారథ్య బాధ్యతలు అందుకున్న బాబర్ ఆజమ్ అన్నాడు. ఇప్పటికే టీ20 జట్టును నడిపిస్తున్న ఈ స్టార్ ప్లేయర్‌కు ఇటీవలే వన్డే జట్టు పగ్గాలు కూడా అందించారు. ఈ క్రమంలో అతనిపై సహచర ఆటగాళ్లు, మాజీ క్రికెటర్లు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేప‌థ్యంలో పాకిస్థాన్ మాజీ పేసర్ త‌న్వీర్ అహ్మ‌ద్‌కు ఓ ఉచిత సలహా ఇచ్చి అతని ఆగ్రహానికి గురయ్యాడు. అతని బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రశంసిస్తూనే ఇంగ్లీష్ నేర్చుకోవాలని సూచించాడు.

ఇంగ్లీష్ రాకుంటే ఇబ్బందులు ఎదురవుతాయి..

ఇంగ్లీష్ రాకుంటే ఇబ్బందులు ఎదురవుతాయి..

‘బాబర్ ఆజమ్ తన ఇంగ్లీష్‌ను ఇప్పటికైనా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. సార‌థిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన అత‌డు టాస్ స‌మ‌యంలో, మ్యాచ్ అనంత‌రం మాట్లాడాల్సి ఉంటుంది. దీంతో పాటు ఇత‌ర దేశాల ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన సంద‌ర్భంలో ఇంట‌ర్వ్యూలు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పనిసరి'అని ఓ యూట్యూబ్ వీడియోలో తన్వీర్ చెప్పాడు.

రాత్రికి రాత్రి వచ్చేయదు..

రాత్రికి రాత్రి వచ్చేయదు..

ఇక తన్వీర్ సూచనపై తాజాగా బాబర్ స్పందించాడు. పాకిస్థాన్ జర్నలిస్ట్‌ సాజ్ సాధిక్‌తో మాట్లాడుతూ.. ఒకింత అసహనం వ్యక్తం చేశాడు. ‘నేనో క్రికెట‌ర్‌ను. మైదానంలో దిగి క్రికెట్ ఆడ‌టం నా బాధ్య‌త‌. అంతే కాని స్ప‌ష్టమైన ఇంగ్లిష్ మాట్లాడేందుకు నేనేం తెల్ల‌వాడిని (గోరా) కాదు. ఆంగ్లంపై ప‌ట్టు సాధించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నా. మీరంతా ఓ పిరియడ్ ఆఫ్ టైమ్‌లో నేర్చుకున్నారు. అది రాత్రికి రాత్రే రాదు. కాస్త స‌మ‌యం ప‌డుతుంది` అని బాబ‌ర్ వ్యాఖ్యానించాడు. ఇక పాకిస్థాన్ ఆట‌గాళ్లు ఇంగ్లిష్‌లో త‌డ‌బ‌డ‌తారనే విషయం ప్ర‌పంచ వ్యాప్తంగా తెలిసిన విష‌యమే. చాలా సందర్భాల్లో వారి బట్లర్ ఇంగ్లీష్‌తో నవ్వుల పాలయ్యారు.

విరాట్‌తో పోల్చకండి..

విరాట్‌తో పోల్చకండి..

ఇక తనను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పోల్చకపోవడమే మంచిదని బాబర్ ఆజమ్ తెలిపాడు. ‘ఈ పోలికలు చేయకపోతే మంచిది. కోహ్లీ విభిన్నమైన ఆటగాడు, నా స్టైల్ వేరు. నా జట్టు విజయానికి సహాయపడటమే నా పని. అంతేకానీ కోహ్లీతో పోల్చడం నాకు ఇష్టం లేదు" అని బాబర్ అజామ్ స్పష్టం చేశాడు. ఇక పాక్ మాజీ క్రికెట్ యూనీస్ ఖాన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 12 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ అనుభవం ఉన్న కోహ్లీతో కేవలం ఐదేళ్ల నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్న బాబర్‌ని పోల్చడం సరికాదన్నాడు.

ఆ విషయంలో మా జట్టుదే పైచేయి..

ఆ విషయంలో మా జట్టుదే పైచేయి..

కరోనా కారణంగా ఖాళీ మైదానాల్లో క్రికెట్ ఆడాలన్న ప్రతిపాదనపై బాబర్ ఆజమ్ స్పందిస్తూ.. ఈ విషయంలో అన్ని జట్ల కన్నా తమ టీమే మెరుగైందన్నాడు. ప్రేక్షకుల్లేకుండా తటస్థ వేదికైనా దుబాయ్‌లో ఎన్నో మ్యాచ్‌లు ఆడామని, ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో తమకు తెలుసున్నాడు. ‘ప్రేక్షకుల్లేకుండా ఆడితే ఎలా ఉంటుందో అన్ని జట్లకన్నా మాకే బాగా తెలుసు. ఇలా ఖాళీ మైదానాల్లో గత పదేళ్లుగా మేం దుబాయ్ వేదికగా ఆడాం. ఖాళీ మైదానాల్లో ఆడితే అటు ఫ్యాన్స్‌కు ఇటు ఆటగాళ్లకు కావాల్సిన మజా మిస్సవుతుంది'అని తెలిపాడు.

వన్డే ప్రపంచకప్‌ ఓటమికి కోహ్లీసేన అనాలోచిత నిర్ణయాలే కారణం: యువరాజ్

Story first published: Tuesday, May 19, 2020, 12:16 [IST]
Other articles published on May 19, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+