ఆంక్షలు ఉన్నా.. టీమిండియా ఆసీస్ టూర్‌కు గ్రీన్ సిగ్నల్!

మెల్‌బోర్న్: కరోనా కారణంగా ఆటలన్నీ ఆగమాగమయ్యాయి. క్రికెట్ అయితే పూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో క్రికెట్ మొదలయ్యే అవకాశం లేదని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ కూడా స్పష్టం చేశాడు. అయితే, ఈ ఏడాది చివర్లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన వరకు పరిస్థితి మారుతుందని అంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ దేశానికి వచ్చే టీమిండియా కోసం ఆస్ట్రేలియా గవర్నమెంట్ ఆంక్షల సడలింపు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది.

క్రికెట్ ఆస్ట్రేలియాకు ఊరట..
కరోనా మహమ్మారి కారణంగా ఆస్ట్రేలియాలో సెప్టెంబరు వరకు విదేశీయులకు అనుమతి లేదు. పరిస్థితులు అదుపులోకి రాకపోతే లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశం ఉండడంతో ఈ ఏడాది చివర్లో జరగాల్సిన నాలుగు టెస్ట్‌ల సిరీస్‌పై సందిగ్ధం నెలకొంది. ఒకవేళ భారత జట్టు పర్యటన రద్దయితే సీఏకు సుమారు రూ.1462 కోట్ల మేర నష్టం వాటిల్లే అవకాశముంది. దీంతో బోర్డును గట్టెక్కించడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం..కోహ్లీ సేన పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్టు విశ్వసనీయ సమాచారం. క్రీడా కార్యకలాపాల పునరుద్ధరణకు అన్ని అవకాశాలనూ పరిశీలిస్తున్నామని ప్రధాని స్కాట్ మారిసన్ చెప్పడంతో సీఏలో కొంత జోష్ కనిపిస్తోంది.

ఇప్పటికే జీతాల్లో కోత..
ఇప్పటికే ఫైనాన్షియల్ ప్రెజర్‌లో ఉన్న సీఏ.. తమ ఎంప్లాయ్స్ శాలరీల్లో 80 శాతం కోత పెట్టింది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్- జనవరి జరిగే మధ్య ఆసీస్ టూర్‌లో 3 టీ20లు, 4 టెస్టులు, 3 వన్డేల్లో ఇండియా తలపడనుంది. లిమిటెడ్ ఓవర్ల సంగతి పక్కనబెడితే కనీసం డిసెంబర్-జనవరి మధ్య టెస్ట్ సిరీస్ అయినా జరిగితే ఫైనాన్స్ విషయంలో కొంత రిలీఫ్ దక్కుతుందని సీఏ భావిస్తోంది.

ఐదో టెస్టుపై ఇప్పుడే చెప్పలేం
తమతో టెస్టు సిరీస్‌లో అదనంగా ఒక మ్యాచ్ ఆడాలన్న క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతిపాదనపై ఇప్పుడే స్పందించడం తొందరపాటు అవుతుందని బీసీసీఐ అధికారి ఒకరు అన్నారు. ‘ఆస్ట్రేలియాతో మేం ఐదు టెస్టులు ఆడేందుకు ఆసక్తిగా ఉన్నామని చెప్పడం తొందరపాటు అవుతుంది. ఇప్పటికైతే ఏడెనిమిది నెలల తర్వాత ఏం జరుగుతుందని మేం ఆలోచించే పరిస్థితి కూడా లేదు. అక్టోబర్‌లో ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఎవరికి తెలుసు?. అందువల్ల ముందుగా ఈ గండం నుంచి మనం ఎలా గట్టెక్కుతామో చూడాలి. ఆ తర్వాతే ఆట గురించి ఆలోచిద్దాం' అని ఆయన అభిప్రాయపడ్డారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
ఇప్పటికీ ఆ ఓటమి పీడకలలా వెంటాడుతోంది : రాహుల్